Hyderabad to Andaman: వేసవిని ప్రకృతి ఒడిలో గడపాలనుకున్నారా..? తక్కువ ఖర్చుతోనే అండమాన్ దీవులను సందర్శించేయండిలా..

Hyderabad to Andaman Tour: సమ్మర్ హాలీడేస్‌లో చాలా మంది టూర్ ప్లాన్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో పర్యాటకులను అమితంగా ఆకర్షించే గమ్యస్థానాలలో అండమాన్ నికోబార్ దీవులు కూడా ఉన్నాయి. ఎంతో అందమైన ఈ దీవులు దేశంలోనే అత్యంత ప్రముఖమైన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడి తెల్లని ఇసుక..

Hyderabad to Andaman: వేసవిని ప్రకృతి ఒడిలో గడపాలనుకున్నారా..? తక్కువ ఖర్చుతోనే అండమాన్ దీవులను సందర్శించేయండిలా..
Hyderabad To Andaman Tour
Follow us

|

Updated on: May 20, 2023 | 7:05 PM

Hyderabad to Andaman Tour: సమ్మర్ హాలీడేస్‌లో చాలా మంది టూర్ ప్లాన్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో పర్యాటకులను అమితంగా ఆకర్షించే గమ్యస్థానాలలో అండమాన్ నికోబార్ దీవులు కూడా ఉన్నాయి. ఎంతో అందమైన ఈ దీవులు దేశంలోనే అత్యంత ప్రముఖమైన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడి తెల్లని ఇసుక తిన్నెలతో కనిపించే బీచ్‌లు, సూర్యోదయ-సూర్యస్తమయ సమయంలో ప్రకృతి అందాలు పర్యాటకలు మనసులను దోచేసుకుంటాయి.  మరి ఈ దీవుల అందాలను మీరూ చూసేయాలనుకుంటున్నారా..? అయితే అండమాన్ నికోబార్ దీవుల టూర్‌కి వెళ్లాలనుకునే మీలాంటి వారి కోసమే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) సరికొత్త టూరేజ్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకెెజ్ ద్వారా తక్కువ ఖర్చుతోనే మీరు అండమాన్ నికోబార్ దీవులలోని అందాలను చూసి రావచ్చు.

అమేజింగ్ అండమాన్ ఎక్స్ హైదరాబాద్ అనే పేరుతో IRCTC ఈ టూర్‌ ప్యాకేజీ మే 26వ తేదీన అందుబాటులోకి వస్తుంది. ఈ టూర్ ప్యాకేజీలో మీరు పోర్ట్ బ్లెయిర్, సెల్యూలార్ జైల్, హావ్‌లాక్ ఐలాండ్, రాధానగర్ బీచ్, నీల్ ఐలాండ్ వంటి పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. ఇక హైదరాబాద్ నుంచి ప్రారంభం కాబోతున్న ఈ టూర్‌..  5 రాత్రులు, 6 రోజులు కొనసాగుతుంది.

ఐఆర్‌సీటీసీ అండమాన్ టూర్ 6 రోజుల ప్లాన్:

Day 1: మొదటి రోజు మధ్యాహ్నం హైదరాబాద్‌లో ఈ టూర్ ప్రారంభం అవుతుంది. ఉదయం 6.35 గంటలకు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఫ్లైట్ ఎక్కితే ఆ ఉదయమే 9.15 గంటలకు అండమాన్‌లోని పోర్ట్ బ్లెయిర్ చేరుకుంటారు. ముందుగా హోటల్ చెక్‌ఇన్ అయిన అనంత‌రం సెల్యూలార్ జైల్ మ్యూజియాన్ని సందర్శిస్తారు. తర్వాత కార్బిన్స్ కోవ్ బీచ్‌కు వెళ‌్తారు. పోర్ట్ బ్లెయిర్‌లోనే ఆ రోజు రాత్రి భోజనం, బస ఉంటుంది.

ఇవి కూడా చదవండి

Day 2 : రెండో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసి.. హావ్‌లాక్ ఐలాండ్‌కు వెళ్తారు. హోటల్‌లో చెక్ఇన్ అయిన తర్వాత రాధానగర్ బీచ్‌ని సందర్శిస్తారు. ఆ రాత్రి హావ్‌లాక్‌లోనే బస ఉంటుంది.

Day 3: మూడో రోజు బ్రేక్‌ఫాస్ట్ చేసి.. హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. తర్వాత కాలాపత్తర్ బీచ్ సందర్శిస్తారు. నీల్ ఐలాండ్ కోసం ప్రీమియం క్రూయిజ్ ఎక్కి అక్కడకు చేరుకోవాలి. ఆ తర్వాత హోటల్ చెక్ ఇన్ అయిన తర్వాత లక్ష్మణపూర్ బీచ్ సందర్శన ఉంటుంది. నీల్ ఐలాండ్‌లోనే రాత్రి డిన్నర్, బస ఉంటుంది.

Day 4: నాలుగో రోజు బ్రేక్ ఫాస్ట్ త‌ర్వాత‌ భరత్‌పూర్ బీచ్ సందర్శన ఉంటుంది. అనంత‌రం క్రూయిజ్ ద్వారా పోర్ట్ బ్లెయిర్‌కు బయలుదేరాలి. సాయంత్రం కావాలంటే షాపింగ్ కోసం టైమ్ ఉంటుంది. పోర్ట్ బ్లెయిర్‌లో నాల్గో రోజు రాత్రి భోజనం, బస ఉంటుంది.

Day 5: ఐదో రోజు బ్రేక్ ఫాస్ట్ చేసి రాస్ ఐలాండ్ బయలుదేరతారు. తర్వాత నార్త్ బే సందర్శన ఉంటుంది. భోజనం తర్వాత నేవల్ మెరైన్ మ్యూజియం సందర్శిస్తారు. పోర్ట్ బ్లెయిర్‌లో రాత్రి భోజనం, బస ఉంటుంది.

Day 6: ఆరో రోజు ఉదయం అల్పాహారం చేసి హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. అనంత‌రం పోర్ట్ బ్లెయిర్‌ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లాలి. ఉద‌యం 07:55 గంటలకు హైదరాబాద్ వెళ్లే విమానం ఉంటుంది. 12:10 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

ఐఆర్‌సీటీసీ అమేజింగ్ అండమాన్ ఎక్స్ హైదరాబాద్ టూర్ ప్యాకేజీ ధ‌ర‌

ఈ టూర్ ప్యాకేజ్ ధర విషయానికొస్తే.. ప్యాకేజీలో ఒక్కరు ప్రయాణించడానికి రూ.55,780 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇద్దరు కలిసి ప్రయాణిస్తే ఒక్కొక్కరు రూ.43,170, ముగ్గురు కలిసి ప్రయాణిస్తే రూ.42,885 చెల్లించాలని ఐఆర్‌సీటీసీ తెలిపింది. పెద్దవారికే కాక 5 నుంచి 11 సంవత్సరాల వయసు ఉన్న చిన్నారులకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. ఈ టూర్ ప్యాకేజీలోనే మీ ఫ్లైట్ టికెట్లు, హోటల్‌లో స్టేయింగ్, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ వంటివి కవర్ అవుతాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు