Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Record: ధనాధన్ లీగ్‌లో ‘యశస్వీ జైస్వాల్’ సరికొత్త చరిత్ర.. 16 ఏళ్ల నాటి ఐపీఎల్‌ రికార్డ్‌ బద్దలు..

Yashasvi Jaiswal: ఐపీఎల్‌ క్రికెట్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ య‌శ‌స్వి జైస్వాల్‌ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. ఇప్పటికే సంచలనాలు నమోదు చేస్తున్న జైస్వాల్..  తాజాగా ఓ ఐపీఎల్ సీజ‌న్‌లో అత్య‌ధిక ర‌న్స్ చేసిన అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్‌ అవతరించాడు. ఈ క్రమంలో అతను సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లను..

IPL Record: ధనాధన్ లీగ్‌లో ‘యశస్వీ జైస్వాల్’ సరికొత్త చరిత్ర.. 16 ఏళ్ల నాటి ఐపీఎల్‌ రికార్డ్‌ బద్దలు..
Yashasvi Jaiswal
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 20, 2023 | 5:56 PM

Yashasvi Jaiswal: ఐపీఎల్‌ క్రికెట్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ య‌శ‌స్వి జైస్వాల్‌ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. ఇప్పటికే సంచలనాలు నమోదు చేస్తున్న జైస్వాల్..  తాజాగా ఓ ఐపీఎల్ సీజ‌న్‌లో అత్య‌ధిక ర‌న్స్ చేసిన అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్‌ అవతరించాడు. ఈ క్రమంలో అతను సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌ల పేరిట ఉన్న రికార్డులను కూడా బ్రేక్ చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 16వ సీజన్‌లో రాజస్థాన్ తరఫున 14 మ్యాచ్‌లు ఆడిన జైస్వాల్ మొత్తం 625 పరుగులు చేశాడు. ఇంకా ఈ 14  మ్యాచ్‌లలో అతని బ్యాటింగ్ యావరేజ్ 48.07, స్ట్ర‌ైక్ రేట్‌ 163.61 ఉండడం విశేషం. ఇంకా ఇందులో ఒక సెంచరీ, 5 అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి.  ఇక జాతీయ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించ‌ని ప్లేయర్స్‌ని అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్లుగా పరిగణిస్తారన్న సంగతి తెలిసిందే.

అయితే శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌కి ముందు ఐపీఎల్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్‌గా అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ షాన్ మార్ష్ పేరిట ఉండేది. షాన్ మార్ష్ ఐపీఎల్ ఆరంగేట్ర సీజన్‌(2008)లో అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్‌గా 616 పరుగులు చేశాడు. తద్వారా ఓ ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు 16 ఏళ్లగా కూడా షాన్ మార్ష్ పేరిటనే ఉంది. కానీ నిన్న జరిగిన మ్యాచ్‌లో పంజాబ్  కింగ్స్‌పై హాఫ్ సెంచరీ చేసిన జైస్వాల్(50) 46 పరుగుల వద్ద షాన్ మార్ష్ రికార్డును బ్రేక్ చేశాడు. అలా ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా 16 ఏళ్ల రికార్డు బద్దలు చేసి ఆగ్రస్థానంలో నిలిచాడు. తద్వారా షాన్ మార్ష్ రెండో స్థానానికి, తర్వాతి స్థానాలలో ఇషాన్ కిషన్ 526( ఐపీఎల్ 2020).. సూర్య కుమార్ యాదవ్ 512(ఐపీఎల్ 2018), 480 (2020) ఉండేవారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..