International Yoga Day: మనదేశంలోని ఈ ప్రదేశాలు సందర్శనకు మాత్రమే కాదు .. యోగాకు కూడా బెస్ట్

యోగా శారీరక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అదే సమయంలో మానసిక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. మనస్సులో ఒత్తిడి లేకుండా చేస్తుంది. రోజంతా చురుకుగా ఉంటుంది. అయితే యోగా చేసేటపుడు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రజలు యోగాభ్యాసం చేసేందుకు ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుంటారు. మీరు అలాంటి ప్రదేశం కోసం చూస్తున్నట్లయితే.. ఈ రోజు మన భారతదేశంలోని యోగా చేయడానికి ప్రసాంతంగా ఉండే కొన్ని అద్భుతమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం..

International Yoga Day: మనదేశంలోని ఈ ప్రదేశాలు సందర్శనకు మాత్రమే కాదు .. యోగాకు కూడా బెస్ట్
Yoga In Evening
Follow us

|

Updated on: Jun 19, 2024 | 7:58 PM

ప్రాచీన వ్యాయామంలో యోగా ఒక భాగం. రోజూ యోగా చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. యోగా 1500 BCలో భారతదేశంలో ఉద్భవించిందని నమ్ముతారు. ఆ తర్వాత అది భారతీయ సంస్కృతిలో భాగమైంది. యోగా యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుని ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా యోగాను అభ్యసిస్తున్నారు. అంతేకాదు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21 న జరుపుకుంటారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రజలు యోగా సాధన చేస్తూ వ్యాధులకు దూరంగా ఉండాలనే సందేశాన్ని ఇస్తారు.

యోగా శారీరక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అదే సమయంలో మానసిక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. మనస్సులో ఒత్తిడి లేకుండా చేస్తుంది. రోజంతా చురుకుగా ఉంటుంది. అయితే యోగా చేసేటపుడు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రజలు యోగాభ్యాసం చేసేందుకు ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుంటారు. మీరు అలాంటి ప్రదేశం కోసం చూస్తున్నట్లయితే.. ఈ రోజు మన భారతదేశంలోని యోగా చేయడానికి ప్రసాంతంగా ఉండే కొన్ని అద్భుతమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం..

రిషికేశ్: ఉత్తారాఖండ్ లోని రిషికేశ్ గురించి చాలా మందికి తెలుసు. దీనిని యోగా క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఇక్కడ పరమార్థ్ నికేతన్‌తో సహా అనేక యోగా కేంద్రాలు ఉన్నాయి, ఈ ప్రదేశం యోగా సాధన అద్భుతంగా పరిగణిస్తున్నారు. అంతేకాదు గంగా నది ఒడ్డున కూడా యోగా చేయవచ్చు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రిషికేశ్ లో ఘనంగా జరుపుకుంటారు. దీని కోసం ప్రపంచం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు చేరుకుంటారు.

ఇవి కూడా చదవండి

గోవా: గోవా చక్కని బీచ్ లు, ప్రత్యేకమైన కట్టడాలు, విశిష్టమైన వన సంపదతో పాటు రాత్రి జీవితానికి ప్రసిద్ధి చెందినప్పటికీ.. ఈ ప్రాంతం యోగా చేయడానికి బెస్ట్ ఎంపిక అని చెప్పవచ్చు. యోగా చేయడానికి గోవాలో చాలా ప్రదేశాలు ఉన్నాయి. గోవాలోని అంజునా, పలోలెం బీచ్‌లో అనేక యోగా శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ ధ్యానం , యోగాకు సంబంధించిన వర్క్‌షాప్‌లు నిర్వహించబడుతున్నాయి.

హిమాచల్ ప్రదేశ్: యోగా సాధన కోసం హిమాలయ పర్వత సానువుల్లో అందమైన హిమాచల్‌ ప్రదేశ్ లోని ధర్మశాలకు కూడా వెళ్లవచ్చు. యోగా, ధ్యానంతో పాటు బౌద్ధ సంప్రదాయాలను కూడా ఇక్కడ అధ్యయనం చేయవచ్చు. పర్వతాల అందాలను చూస్తూ యోగా చేస్తే కలిగే అనుభవం మాటల్లో వర్ణించలేనిది.

కేరళ: కేరళ అందమైన ప్రశాంతమైన ప్రాంతం అంటారు. ఈ ప్రదేశం యోగా ప్రియులకు ఉత్తమమైనది. పచ్చని వాతావరణంలో యోగాను అభ్యసించడం వల్ల చాలా మంచి అనుభూతి కలుగుతుంది. కేరళలో అనేక యోగా రిట్రీట్‌లు, కేంద్రాలు ఉన్నాయి, ఇక్కడ యోగా నేర్చుకోవచ్చు. ధ్యానానికి కూడా బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..