AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. ఐస్‌క్రీమ్‌లో మొన్న చేతివేలు.. ఇప్పుడు చాక్లెట్ సిరప్‌లో చచ్చిన ఎలుక..

వైరల్ అవుతున్న ఈ వీడియోలో శీఘ్ర ఇ-కామర్స్ కంపెనీ Zepto నుంచి ఆర్డర్ చేసిన హెర్షే కంపెనీకి సంబంధించిన చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక కనిపించింది అంటూ ఒక మహిళ పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో జెట్ స్పీడ్ తో వైరల్ అవుతోంది. ప్రమీ శ్రీధర్ అనే ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు వీడియోను షేర్ చేశారు. తాము చాక్లెట్ సిరప్ లో చనిపోయిన ఎలుక ఉందని గ్రహించేలోపు కుటుంబంలోని ముగ్గురు సభ్యులు కలుషిత సిరప్‌ను తీసుకున్నారని వెల్లడించారు.

వామ్మో.. ఐస్‌క్రీమ్‌లో మొన్న చేతివేలు.. ఇప్పుడు చాక్లెట్ సిరప్‌లో చచ్చిన ఎలుక..
Mouse In Hersheys Chocolate SyrupImage Credit source: Instagram/@pramisridhar
Surya Kala
|

Updated on: Jun 19, 2024 | 7:00 PM

Share

ఇటీవల ఓ ముంబై వైద్యుడు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఐస్‌క్రీమ్‌లో తెగిపడిన మానవ వేలు కనిపించిందని చెప్పి అందరినీ షాక్‌కు గురిచేశాడు. ఇప్పుడు మరొక వీడియో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు మార్కెట్ లో దొరికే ఏ ఆహారం భద్రం అని ఆలోచించేలా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో శీఘ్ర ఇ-కామర్స్ కంపెనీ Zepto నుంచి ఆర్డర్ చేసిన హెర్షే కంపెనీకి సంబంధించిన చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక కనిపించింది అంటూ ఒక మహిళ పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో జెట్ స్పీడ్ తో వైరల్ అవుతోంది.

ప్రమీ శ్రీధర్ అనే ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు వీడియోను షేర్ చేశారు. తాము చాక్లెట్ సిరప్ లో చనిపోయిన ఎలుక ఉందని గ్రహించేలోపు కుటుంబంలోని ముగ్గురు సభ్యులు కలుషిత సిరప్‌ను తీసుకున్నారని వెల్లడించారు. అయితే వారిలో ఇద్దరికి ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించలేదని, కుమార్తెలలో ఒకరు అపస్మారక స్థితికి చేరుకుందని.. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి బాధితురాలు బాగానే ఉన్నట్లు సమాచారం. కంపెనీకి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా ఎలాంటి స్పందన లేదని మహిళ ఆరోపించింది.

ఇవి కూడా చదవండి

వీడియోలో మహిళ కుటుంబ సభ్యులు చాక్లెట్ సిరప్‌ని ఓ కప్పులో వేసి ఖాళీ చేస్తుంది. వీడియో క్లిప్ ముందుకు సాగుతున్నప్పుడు.. చాక్లెట్ సిరప్‌లో ఏదో ఉన్నట్లు కనిపిస్తుంది. అది ఏమిటో తెలుసుకోవడానికి.. కుటుంబ సభ్యులు ఆ కప్పుని కుళాయి కింద ఉంచి.. దానిపై నీటిని విడిచి పెట్టారు. అప్పుడు అది చనిపోయిన ఎలుక అని గుర్తించారు.

శ్రీధర్ తన పోస్ట్ చివరగా ఏదైనా ఉత్పత్తిని ఇంట్లో పిల్లలకు ఇచ్చే ముందు తప్పని సరిగా తనిఖీ చేయాలని ప్రజలను హెచ్చరించాడు. చాక్లెట్ సిరప్‌లో ఉన్న ఎలుక వంటివి కనిపిస్తే ఆరోగ్యం ఆందోళనకరంగా మారుతుందని .. ఇలాంటి సంఘటనలు ఆమోదయోగ్యం కాదని శ్రీధర్ చెప్పారు. ప్రస్తుతం ఆరోగ్య ప్రమాదాలు పెరిగిపోయాయని.. వస్తువులు నాణ్యత నియంత్రణ లేకపోవడం గురించి ఆందోళన చెందుతున్నామని తెలిపారు. దీనితో పాటు ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి.. ఇకపై ఇలాంటి సంఘటలు మళ్ళీ జరగకుండా హామీ ఇవ్వాలని సదరు కంపెనీని డిమాండ్ చేశారు.

ఇక్కడ వీడియో చూడండి, చాక్లెట్ సిరప్ బాటిల్‌లో చనిపోయిన ఎలుక

దీనిపై కంపెనీ స్పందించింది

వైరల్ వీడియోపై హర్షీ యాజమాన్యం స్పందిస్తూ.. ఇది చూసి మేము చాలా బాధపడ్డాము. మీరు UPC , తయారీ కోడ్‌ను బాటిల్ నుంచి [email protected] కి రిఫరెన్స్ నంబర్ 11082163తో పంపగలరా, తద్వారా మా బృందంలోని వారు ఎవరైనా మీకు సహాయం చేయగలరని రిక్వెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఆ మహిళ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మార్కెట్ లో దొరికిన సామానులో నాగుపామును, చనిపోయిన ఎలుకను చూస్తున్నామని ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు కొత్త భయం అన్‌లాక్ చేయబడింది అని వ్యాఖ్యానించారు. మరొకరు దీనిలో Zepto తప్పు లేదు.. ఎందుకంటే ఇది కేవలం డెలివరీ సేవను అందిస్తోంది.. కనుక ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న హర్షి వంటి కంపెనీపై కేసు పెట్టాలని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..