Sopore Encounter: బారాముల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

భారత సైన్యం, CRPF, జమ్మూ కాశ్మీర్ పోలీసుల సంయుక్త బృందం ఈ ఆపరేషన్‌ను నిర్వహిస్తోంది. ఆపరేషన్ కొనసాగుతోందని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. జిల్లాలోని సోపోర్‌లోని హడిపోరా ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి ఇన్‌పుట్ అందిందని పోలీసు అధికారి తెలిపారు. దీంతో ఆర్మీ, సీఆర్పీఎఫ్, పోలీసుల సంయుక్త బృందం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. సైనికులు తమను చుట్టుముట్టడం చూసి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సైనికులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు ప్రారంభించారని వెల్లడించారు. 

Sopore Encounter: బారాముల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
Sopore Encounter
Follow us

|

Updated on: Jun 19, 2024 | 5:25 PM

కశ్మీర్ లోయలోని బారాముల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఎస్‌ఓజీ (జమ్మూ కాశ్మీర్ పోలీస్) సైనికుడు గాయపడడంతో అతన్ని ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ సైనికుడు మరణించాడు. భారత సైన్యం, CRPF, జమ్మూ కాశ్మీర్ పోలీసుల సంయుక్త బృందం ఈ ఆపరేషన్‌ను నిర్వహిస్తోంది. ఆపరేషన్ కొనసాగుతోందని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.

జిల్లాలోని సోపోర్‌లోని హడిపోరా ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి ఇన్‌పుట్ అందిందని పోలీసు అధికారి తెలిపారు. దీంతో ఆర్మీ, సీఆర్పీఎఫ్, పోలీసుల సంయుక్త బృందం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. సైనికులు తమను చుట్టుముట్టడం చూసి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సైనికులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు ప్రారంభించారని వెల్లడించారు.

గాయపడిన సైనికుడికి ఆసుపత్రిలో చికిత్స

ఉగ్రవాదుల మీద భద్రతా దళాలు ప్రతీకార కాల్పులు జరిపాయని.. దీంతో ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని అధికారి తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఉగ్రవాదులను ఇంకా గుర్తించాల్సి ఉందని వెల్లడించారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక SOG సైనికుడు అమరుడయ్యాడు. అతని మృతదేహం ప్రస్తుతం ఆసుపత్రిలో ఉంది.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఇటీవల దోడాలో జరిగిన దాడులకు సంబంధించి ముగ్గురిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. జిల్లాలోని కొండ ప్రాంతాల్లో ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. జూన్ 11 రాత్రి భదర్వా-పఠాన్‌కోట్ రహదారిపై ఉన్న పోస్ట్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు రాష్ట్రీయ రైఫిల్స్ సైనికులు, ఎస్పీవోలకు గాయాలయ్యాయి.

దోడా జిల్లాలోని జై ప్రాంతానికి చెందిన భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్న ముగ్గురి ఉగ్రవాదుల్లో ఒక జంట కూడా ఉంది. ఈ జంట ఉగ్రవాదులకు ఆహారం అందిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. రియాసి జిల్లాలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై ఇటీవల జరిగిన దాడికి సంబంధించి 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముందుగా ముగ్గురిని విచారిస్తున్న విషయం వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇదేందిది.. రోడ్డుపై రయ్యిమని వచ్చి.. అడ్డంగా బుక్కై ఒక్కటే ఏడుపు.
ఇదేందిది.. రోడ్డుపై రయ్యిమని వచ్చి.. అడ్డంగా బుక్కై ఒక్కటే ఏడుపు.
మళ్ళీ క్షీణించిన అద్వానీ ఆరోగ్యం.. అపోలో ఆసుపత్రిలో చికిత్స
మళ్ళీ క్షీణించిన అద్వానీ ఆరోగ్యం.. అపోలో ఆసుపత్రిలో చికిత్స
హమ్మయ్య..! దిగివచ్చిన పసిడి ధరలు.. తులంపై ఎంత తగ్గిందంటే..
హమ్మయ్య..! దిగివచ్చిన పసిడి ధరలు.. తులంపై ఎంత తగ్గిందంటే..
వర్షాకాలంలో వంట గదిని ఇలా శుభ్రం చేస్తే దుర్వాసన, పురుగులు ఉండవు!
వర్షాకాలంలో వంట గదిని ఇలా శుభ్రం చేస్తే దుర్వాసన, పురుగులు ఉండవు!
Horoscope Today: ఆ రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..
Horoscope Today: ఆ రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..
ఎల్‌కే అద్వానీకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
ఎల్‌కే అద్వానీకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
పిఠాపురంలో 3 ఎకరాలు కొన్నా.. ఇక నుంచి ఇదే నా ఇల్లు
పిఠాపురంలో 3 ఎకరాలు కొన్నా.. ఇక నుంచి ఇదే నా ఇల్లు
కల్కి పార్ట్ 2లో ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేసిన నాగ్ అశ్విన్..
కల్కి పార్ట్ 2లో ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేసిన నాగ్ అశ్విన్..
గ్యాస్‌ నొప్పిని చిటికెలో మాయం చేసే అద్భుత చిట్కా..
గ్యాస్‌ నొప్పిని చిటికెలో మాయం చేసే అద్భుత చిట్కా..
పవన్ కళ్యాణ్ సినిమాతో తెలుగులో ఎంట్రీ.. వరుస హిట్స్ అందుకున్న తార
పవన్ కళ్యాణ్ సినిమాతో తెలుగులో ఎంట్రీ.. వరుస హిట్స్ అందుకున్న తార