Viral News: డెస్టినేషన్ వెడ్డింగ్‌లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన వధువు.. పెళ్లింట విషాదం
మృతురాలిని శ్రేయ జైన్ (28) గా గుర్తించారు. ఢిల్లీకి చెందిన శ్రేయ కుటుంబం డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం డెహ్రాడూన్‌లోని విలాసవంతమైన రిసార్ట్‌ను బుక్ చేసుకుంది. అందుకు తగ్గట్టుగానే పెళ్లికి రెండు రోజుల ముందు శ్రేయా జైన్ కుటుంబం, స్నేహితులతో కలిసి నకుచియాటల్‌లోని విలాసవంతమైన రిసార్ట్‌కు చేరుకున్నారు. మృతురాలు BTech తర్వాత MBA పూర్తి చేసింది. వరుడు లక్నోలోని ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు.
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని ఘట్టం. అందమైన జీవితాన్ని ఊహించుకుంటూ.. భవిష్యత్ గురించి కలలు కంటూ వధూవరులు కొత్త జీవితంలోకి అడుగు పెడతారు. వివాహ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే ఇక్కడ ఓ యువతి కొత్త జీవితం గురించి కలలు కంటూ వేడుకలు జరుపుకుంటుండగానే ఆమె తుది శ్వాస విడిచింది. వివాహ వేడుకల్లో జరిపే కార్యక్రమాల్లో భాగంగా పెళ్లి ముందు రోజు జరిపే మెహందీ కార్యక్రమంలో డ్యాన్స్ చేస్తూ ఓ యువతి కుప్పకూలి మృతి చెందింది. అంటే ఆదివారం వివాహం జరగాల్సి ఉండగా శనివారం సాయంత్రం మెహందీ వేడుక జరుగుతుండగా ఆమె డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో చోటుచేసుకుంది. పెళ్లి సందడి తో ఆనందోత్సాహాలతో నిండిన ఆ ఇల్లు వధువు మరణంతో ఇప్పుడు నిశ్శబ్ధంగా మారింది.
మృతురాలిని శ్రేయ జైన్ (28) గా గుర్తించారు. ఢిల్లీకి చెందిన శ్రేయ కుటుంబం డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం డెహ్రాడూన్‌లోని విలాసవంతమైన రిసార్ట్‌ను బుక్ చేసుకుంది. అందుకు తగ్గట్టుగానే పెళ్లికి రెండు రోజుల ముందు శ్రేయా జైన్ కుటుంబం, స్నేహితులతో కలిసి నకుచియాటల్‌లోని విలాసవంతమైన రిసార్ట్‌కు చేరుకున్నారు. మృతురాలు BTech తర్వాత MBA పూర్తి చేసింది. వరుడు లక్నోలోని ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు.
పెళ్లి సందర్భంగా ఘనంగా మెహందీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందుకు తగ్గట్టుగానే సంగీత కార్యక్రమాలతో మెహందీ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే మెహందీ రోజు డ్యాన్స్ చేస్తూ వధువు కుప్పకూలి చనిపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే యువతి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కార్డియోపల్మోనరీ సమస్యతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..