Women’s Day 2022: ఉమెన్స్ డేకి మీ భార్యకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా..ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టండి.. వివరాల్లోకి వెళ్తే..

International Women's Day 2022:అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా మీ ప్రియబాంధవి భార్యకు మరపురాని గిఫ్ట్ ను కానుకగా ఇవ్వాలనుకుంటున్నారా.. అయితే బెస్ట్ ఆప్షన్ జీవితానికి భరోసానిచ్చే ..

Women's Day 2022: ఉమెన్స్ డేకి మీ భార్యకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా..ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టండి.. వివరాల్లోకి వెళ్తే..
Husband Invested Money In Y
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 07, 2022 | 12:46 PM

International Women’s Day 2022:అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా మీ ప్రియబాంధవి భార్యకు మరపురాని గిఫ్ట్ ను కానుకగా ఇవ్వాలనుకుంటున్నారా.. అయితే బెస్ట్ ఆప్షన్ జీవితానికి భరోసానిచ్చే విధంగా ఏదైనా మంచి పథకంలో పెట్టుబడి పెట్టడం. అయితే ఇలా పెట్టుబడి పెట్టేముందు ఆ  స్కీం గురించి.. పన్ను వెసులు బాటుతో సహా అన్ని విషయాలు తెలుసుకోవడం తప్పనిసరి.  దీంతో రేపు(మార్చి 8వ తేదీ) అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా భార్యకు గిఫ్ట్ ఇచ్చే పెట్టుబడిపై పన్నుల(IT)ను ఏ విధంగా వేస్తారు.. ఏ విధమైన రాయతీలు లభిస్తాయో చూద్దాం. ఆదాయపన్ను చట్టం ప్రకారం.. భార్య పేరు మీద భర్త చేసే ఏదైనా పెట్టుబడిని పెడితే.. దానిని గిప్ట్ గా పరిగణలోకి తీసుకుంటారు. అంతేకాదు ఈ పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయానికి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫారమ్‌లోని షెడ్యూల్ EI లో ఆఫ్ రిటర్ను(ITR) ఫామ్‌లో మినహాయింపు ఆదాయంగా చూపించుకోవచ్చు.

  1. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లో భార్య పేరుతో భర్త సీనియర్ సేవింగ్స్ స్కీమ్ లో పెట్టుబడి పెడితే.. వడ్డీ ఆదాయం ITR లోని షెడ్యూల్ SPIలో మొత్తం ఆదాయంలో చూపించుకోవచ్చు. ఇలా ఈ  స్కీమ్ లో పెట్టుబడి పెట్టినప్పుడు భార్య తన ఆదాయాన్ని వెల్లడించాల్సి అవసరం లేదు.
  2. బంధువులు, స్నేహితులు వంటి వారి నుంచి అందుకున్న నగదు: ఐటీ నిబంధనల ప్రకారం బంధువుల నుంచి లేదా తమ సన్నిహితుల నుంచి వచ్చే బహుమతులు పన్ను మినహాయింపు ఉంటుంది. అంటే.. భర్త, లేదా భార్య, అక్క చెల్లెలు, అన్నదమ్ములను బంధువులుగా పేర్కొన్నారు. అంతేకాదు.. వంశాపారంపర్యంగా ఉన్న బంధువులను కూడా పరిగణలోకి తీసుకున్నారు.
  3. ఇతరుల నుంచి వచ్చే నగదుకి పన్ను… ఆదాయపు పన్ను చట్టం ప్రకారం..  1961 సెక్షన్ 56(2)(x) ప్రకారం… ఒక వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో ఎటువంటి పరిగణన లేకుండా పొందే మొత్తం కానుకలు రూ.50,000 దాటితే పన్ను విధిస్తారు. అటువంటి  మొత్తాలపై పన్ను విధించబడుతుంది. కనుక ఇటువంటి కానుకల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏడాదికి రూ. 50వేలు మించకుండా చూసుకోవాలి. అలా కానుకగా ఇచ్చే మొత్తానికి “ఇతర వనరుల నుండి వచ్చే ఆదాయం”గా పన్ను విధిస్తారు.
  4. ఆర్‌ఎస్‌ఎమ్ ఇండియా వ్యవస్థాపకుడు డాక్టర్ సురేశ్ సురానా ప్రకారం.. ఆర్థిక సంవత్సరంలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల నుండి అందుకున్న మొత్తం నగదు రూ. 50,000దాటకుండా చూసుకోవాలి.

Also Read:

ఊరిస్తున్న డార్లింగ్ సినిమా రాధేశ్యామ్ సినిమా పై రోజురోజుకు పెరుగుతున్న అంచనాలు..