Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Marriage: ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే బంపర్ ప్రయోజనాలు.. తెలిస్తే నిజమే అంటారు..!

Marriage: వివాహం అనేది మనిషి జీవితంలో ఒక గొప్ప వేడుక. ఇది కొంతమందికి తొందరగా జరిగితే మరికొంతమందికి ఆలస్యంగా జరుగుతుంది. అయితే పెళ్లి వయసు వచ్చినప్పటి నుంచి

Marriage: ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే బంపర్ ప్రయోజనాలు.. తెలిస్తే నిజమే అంటారు..!
Representative image
Follow us
uppula Raju

|

Updated on: Mar 07, 2022 | 8:27 AM

Marriage: వివాహం అనేది మనిషి జీవితంలో ఒక గొప్ప వేడుక. ఇది కొంతమందికి తొందరగా జరిగితే మరికొంతమందికి ఆలస్యంగా జరుగుతుంది. అయితే పెళ్లి వయసు వచ్చినప్పటి నుంచి అందరి దృష్టి వీరిపైనే ఉంటుంది. చుట్టుపక్కల వారి నుంచి బంధువుల వరకు అందరు పెళ్లెప్పుడు అంటూ ప్రశ్నిస్తారు. వాస్తవానికి వయసు దాటిపోతే పెళ్లి కాదని చాలామంది పెద్దలు హెచ్చరిస్తారు. ఇందులో నిజం లేకపోలేదు కానీ తొందరగా పెళ్లి జంటలు కూడా విడిపోతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రస్తుత జీవన శైలిలో చాలామంది ముప్పై తర్వాతే పెళ్లి చేసుకుంటున్నారు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. అయితే ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం. వాస్తవానికి 20 నుంచి 25 సంవత్సరాల వయస్సు కెరీర్‌కు అత్యంత ముఖ్యమైనది. ఈ సమయంలో అతని దృష్టి మొత్తం కెరీర్‌పైనే ఉంటుంది. ఈ వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల బాధ్యతలు పెరిగి కెరీర్ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు. అందుకే చాలామంది పెళ్లిని వాయిదా వేస్తున్నారు.

వయస్సుతో పాటు ప్రతి మనిషిలో జ్ఞానం పెరుగుతుంది. 30 ఏళ్ల వయస్సులో ఒక వ్యక్తి పూర్తిగా పరిణతి చెందుతాడు ఏది మంచి ఏది చెడు అనేది కచ్చితంగా నిర్ధారించగలడు. అతను ఒకరి భావాలను బాగా అర్థం చేసుకోగలడు. క్లిష్ట పరిస్థితులను కూడా సులభంగా అధిగమించగలడు. ఈ వయస్సులో అతను మరొక వ్యక్తి బాధ్యతను చూసుకోవడానికి సంసిద్ధుడై ఉంటాడు. అందుకే ఎటువంటి అనర్థాలు ఉండవు. జీవితం సాఫీగా సాగుతుంది.

25 సంవత్సరాల వయస్సులో ఒక వ్యక్తి తన చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం చేస్తాడు. తర్వాత అతనిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వివాహానంతరం ఈ విషయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వయస్సులోనే సరైన జీవిత భాగస్వామిని ఎంచుకునే సామర్థ్యం కూడా వస్తుంది. 30 సంవత్సరాల వయస్సులో ఒక వ్యక్తి డబ్బును ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటాడు. 20-25 సంవత్సరాల వయస్సులో ఖర్చులు ఎక్కువ చేస్తారు. 30 సంవత్సరాల తర్వాత కంట్రోల్‌ చేస్తారు. మీరు ఆలస్యంగా వివాహం చేసుకుంటే ఇతరుల తప్పుల నుంచి నేర్చుకుంటూ జీవితాన్ని గొప్పగా ప్లాన్ చేసుకుంటారు.

7th Pay Commission: గుడ్‌న్యూస్‌.. వచ్చే నెల నుంచి వారి జీతాలు హైక్‌..!

ఈ పథకంలో నెలకి రూ.3000 పొదుపు చేస్తే చాలు.. 15 లక్షల నిధి మీ సొంతం..!

అమ్మాయిలకు గమనిక.. వేసవిలో అందంగా కనిపించాలంటే ఈ తప్పులు చేయకండి..!