ఈ పథకంలో నెలకి రూ.3000 పొదుపు చేస్తే చాలు.. 15 లక్షల నిధి మీ సొంతం..!

Sukanya Samriddhi Yojana: బాలికల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చాలా రకాల ప్రభుత్వ పథకాలని ప్రారంభించింది. అందులో ముఖ్యమైనది సుకన్య సమృద్ది యోజన పథకం.

ఈ పథకంలో నెలకి రూ.3000 పొదుపు చేస్తే చాలు.. 15 లక్షల నిధి మీ సొంతం..!
Money
Follow us
uppula Raju

|

Updated on: Mar 07, 2022 | 7:37 AM

Sukanya Samriddhi Yojana: బాలికల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చాలా రకాల ప్రభుత్వ పథకాలని ప్రారంభించింది. అందులో ముఖ్యమైనది సుకన్య సమృద్ది యోజన పథకం. దీనివల్ల ఆడపిల్లలు కలిగిన చాలామంది కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాయి. బాలికల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్ర సర్కార్‌ ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆడ పిల్లలున్న తల్లిదండ్రులకు ఈ పథకం ఒక వరమనే చెప్పాలి. ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేటు, పోస్టాఫీసుల్లో ఈ స్కీమ్‌ అందుబాటులో ఉంటుంది. 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికల పేరుతో ఈ ఖాతాను తెరవవచ్చు. ఈ పథకంలో ప్రతి నెలా డబ్బులు జమ చేస్తూ ఉండాలి. మెచ్యూరిటీపై ఒకేసారి మొత్తం అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్‌లో చేరితో కుమార్తెల విద్య, వివాహం వంటి ముఖ్యమైన పనులు సులువుగా జరుగుతాయి. సుకన్య పథకం కింద ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ రేటుపై నిర్ణయం తీసుకుంటుంది.

ఈ పథకంలో ఉన్న మంచి విషయం ఏంటంటే మొత్తం 21 సంవత్సరాలకు డబ్బు డిపాజిట్ చేయనవసరం లేదు. ఖాతా తెరిచినప్పటి నుంచి15 సంవత్సరాల వరకు మాత్రమే డబ్బు డిపాజిట్ చేస్తే చాలు. అయితే కుమార్తె 21 ఏళ్ల వయస్సుకు చేరుకున్నప్పుడు ఖాతా గడువు ముగుస్తుంది. అప్పటి వరకు ఆ డబ్బుపై వడ్డీ పెరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకంపై ఖాతాదారులకు ప్రభుత్వం 7.6 శాతం చొప్పున చక్రవడ్డీ ప్రయోజనాన్ని అందిస్తోంది. 3 నెలల తర్వాత ప్రభుత్వం ఈ పథకం వడ్డీ రేట్లను సవరిస్తుంది.

ఈ పథకంలో మీరు కనీసం రూ. 250 పెట్టుబడి పెట్టాలి. గరిష్టంగా రూ. 150,000 పెట్టుబడి పెట్టవచ్చు. దీని ద్వారా మీ కుమార్తె కోసం 15 లక్షల నిధిని సృష్టించవచ్చు. ఈ పథకంలో మీరు పోస్టాఫీసు లేదా ఏదైనా బ్యాంకుకు వెళ్లి ఈ ఖాతాను తెరవవచ్చు. దీని కోసం మీరు జనన ధృవీకరణ పత్రాన్ని మాత్రమే సమర్పించాలి. దీంతో పాటు పిల్లల, తల్లిదండ్రుల గుర్తింపు కార్డును కూడా సమర్పించాల్సి ఉంటుంది.

15 లక్షల రూపాయలు ఎలా పొందాలి..

ఈ ప్రభుత్వ పథకంలో మీరు ప్రతి నెలా కేవలం రూ. 3000 పెట్టుబడి పెడితే అంటే మీరు ప్రతి సంవత్సరం రూ. 36000 పెట్టుబడి పెడితే మీకు 7.6 శాతం వడ్డీ ప్రయోజనం లభిస్తుంది. ఈ విధంగా 21 సంవత్సరాలలో అంటే మెచ్యూరిటీకి ఈ మొత్తం దాదాపు రూ.15,22,221 అవుతుంది. దీంతో మీ కూతురి అన్ని అవసరాలు తీరుతాయి.

మ్యాచ్‌లో అభిమానుల ఘర్షణ.. దుస్తులు విప్పుతూ, గట్టిగా అరుస్తూ దాడి

Telangana Assembly: నేటి నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. అస్త్రశస్త్రాలతో సిద్ధమైన అధికార, ప్రతిపక్షాలు

DJ Tillu: అట్లుంటది మరి.. ఓటీటీలో దుమ్ము రేపుతోన్న డీజే టిల్లు.. కేవలం రెండు రోజల్లోనే..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!