Vitamin D : కరోనా కాలంలో పెరుగుతున్న విటమిన్ డి బాధితులు..! మీకు ఈ లక్షణాలు ఉన్నాయో చెక్ చేసుకోండి..

Vitamin D : COVID-19 వల్ల చాలామంది రెండు సంవత్సరాలుగా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో ఉండటం వల్ల ఎంత సంతోషంగా ఉన్నా అప్పుడప్పుడు కొన్ని

Vitamin D : కరోనా కాలంలో పెరుగుతున్న విటమిన్ డి బాధితులు..! మీకు ఈ లక్షణాలు ఉన్నాయో చెక్ చేసుకోండి..
Vitamin D
Follow us
uppula Raju

| Edited By: Ravi Kiran

Updated on: Jul 06, 2021 | 7:47 AM

Vitamin D : COVID-19 వల్ల చాలామంది రెండు సంవత్సరాలుగా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో ఉండటం వల్ల ఎంత సంతోషంగా ఉన్నా అప్పుడప్పుడు కొన్ని కొన్ని ప్రమాదాలు కూడా ఉంటాయి. సూర్యరశ్మికి దూరంగా ఇంట్లో ఉండటం వల్ల విటమిన్ డి లోపం ఏర్పడుతోంది. అంతేకాదు శరీరం, మనస్సుపై చాలాకాలంగా ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. ప్రజలు విటమిన్ లోపం మాత్రమే కాదు అధిక బరువు పెరగడం, కీళ్ల నొప్పి, ఇతర విటమిన్ల లోపం, మరెన్నో ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు.

విటమిన్ డి ఒక వ్యక్తి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. కనుక ఈ విటమిన్ లోపం క్లిష్ట సమయాల్లో ఆందోళనకు ప్రధాన కారణం. విటమిన్ డి మీ రోగనిరోధక శక్తిని చెక్కుచెదరకుండా ఉంచడం ద్వారా శరీరం చక్కగా పనిచేస్తుంది. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. క్యాన్సర్‌ను నివారిస్తుంది. గుండె జబ్బులు, అధిక రక్తపోటు, డయాబెటిస్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, రోగనిరోధక శక్తి లోపాలు, వేగంగా వృద్ధాప్యం, కొన్ని క్యాన్సర్లు, మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి ఆరోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది. ప్రారంభంలో విటమిన్ డి లోపం గుర్తించదగిన లక్షణాలను చూపించదు కానీ తీవ్రమైన లోపం కండరాల తిమ్మిరి, వెన్నునొప్పి, అలసట, నిరాశ, నిద్ర రుగ్మతలు రావొచ్చు.

విటమిన్ డి ఉత్తమ మూలం సూర్యరశ్మి. ఉదయాన్నే నిద్రలేచి వారానికి కనీసం రెండుసార్లు 15 నుంచి 20 నిమిషాలు ఎండలో ఉండటానికి ప్రయత్నించాలి. కాడ్ లివర్ ఆయిల్, కొత్తిమీర, నారింజ, పెరుగు, పన్నీర్, వెల్లుల్లి, డార్క్ చాక్లెట్, బ్లాక్ ఆవాలు, పుట్టగొడుగులు, పసుపు, కాశ్మీరీ వెల్లుల్లి వంటి విటమిన్ డి అధికంగా లభించే ఆహార పదార్థాలు మీ రోగనిరోధక శక్తిని సహజంగా పెంచడానికి సహాయపడతాయి. మెడికల్ స్టోర్ వద్ద లభించే విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవచ్చు అయినప్పటికీ మోతాదు తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

Andhrapradesh: ‘జగనన్న హౌసింగ్ కాలనీలకు ఇసుక కొరత లేనే లేదు’.. వారికి ఫ్రీగానే ఇస్తున్నామన్న ద్వివేది

Andhra Pradesh: కరోనా బాధిత గవర్నమెంట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్..!

Yuga Tulasi: గోహత్యలకు వ్యతిరేకంగా యుగతులసి ఫౌండేషన్ పోరాటం.. గోహత్యలు జరక్కుండా చూడాలని DGPకి వినతిపత్రం