AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghee Benefits : సహజ సిద్దమైన నెయ్యితో ఎన్నో ప్రయోజనాలు..! పొడి బారిన చర్మం, పెదాలకి చక్కటి పరిష్కారం..

Ghee Benefits : నెయ్యి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నెయ్యిని ఔషధంగా కూడా

Ghee Benefits : సహజ సిద్దమైన నెయ్యితో ఎన్నో ప్రయోజనాలు..! పొడి బారిన చర్మం, పెదాలకి చక్కటి పరిష్కారం..
Dry Skin 1
uppula Raju
| Edited By: Rajitha Chanti|

Updated on: Jul 06, 2021 | 10:05 AM

Share

Ghee Benefits : నెయ్యి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నెయ్యిని ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. ఇది మీ చర్మానికి చాలా మేలు చేస్తుంది. నెయ్యి వాడటం వల్ల ముఖం మెరుస్తుంది. ఇది కాకుండా ఇది మీ జుట్టుకు షైనింగ్‌ని కూడా అందిస్తుంది. వేసవిలో పొడి చర్మం వల్ల మీకు ఇబ్బంది ఉంటే అప్పుడు నెయ్యి వాడండి. ఇది మీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది.

ఇది కాకుండా మీరు ఫేస్ ప్యాక్లను తయారు చేయడానికి నెయ్యిని ఉపయోగించవచ్చు. చర్మాన్ని తేమగా ఉంచడానికి ప్రతిరోజూ 2 నుంచి 3 చుక్కల నెయ్యితో ముఖానికి మసాజ్ చేయండి. నెయ్యి ఒక అద్భుత ఏజెంట్. ఇది కొవ్వు ఆమ్లాలతో నిండి ఉంటుంది. పగిలిన పెదాలకు, పొడిబారిన చర్మం, జుట్టు సమస్యలకు చక్కగా పనిచేస్తుంది. అందమైన ముఖం కోసం నెయ్యితో ఫేస్ మాస్క్ కూడా తయారుచేసుకోవచ్చు.

1. పొడి చర్మం కోసం.. 1/2 టేబుల్ స్పూన్ సేంద్రీయ నెయ్యి 2 టేబుల్ స్పూన్లు కలబంద జెల్ ఒక చిటికెడు పసుపు (సహజ కాంతి కోసం) మూడు పదార్థాలను కలపండి. ముఖం, మెడపై అప్లై చేయండి. చర్మం పొడిబారకుండా ఉండటానికి వారానికి రెండుసార్లు ఇలా చేయండి.

2. నల్లటి వలయాల కోసం 1 స్పూన్ నెయ్యి 1/2 స్పూన్ బంగాళాదుంప రసం కాటన్ తీసుకొని ఈ మిశ్రమంలో ముంచండి. దీన్ని మీ కళ్ల కింద సున్నితంగా రుద్దండి. 20 నిమిషాల తర్వాత కడిగేయండి.

3. పొడి పెదవుల కోసం 1 స్పూన్ నెయ్యి 1/2 స్పూన్ దుంప రసం 2 చుక్కలు జోజోబా ఆయిల్ ఈ మూడింటిని కలపాలి. వేళ్లతో నెమ్మదిగా పెదవులపై రుద్దాలి. కనీసం 2 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తద్వారా మీ పెదవులు మృదువుగా ఉంటాయి. మంచి ఫలితాల కోసం వారానికి రెండుసార్లు చేస్తే సరిపోతుంది.

4. పోషక జుట్టు కోసం 2 టేబుల్ స్పూన్ నెయ్యి 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పాలు 2 టేబుల్ స్పూన్లు కలబంద జెల్ ఈ మూడు పదార్థాలను కలపాలి. పేస్ట్‌గా చేసి హెయిర్‌కి అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. చక్కటి ఫలితం ఉంటుంది.

Andhrapradesh: ‘జగనన్న హౌసింగ్ కాలనీలకు ఇసుక కొరత లేనే లేదు’.. వారికి ఫ్రీగానే ఇస్తున్నామన్న ద్వివేది

India vs Sri Lanka: ప్రాక్టీస్ మ్యాచ్ లో తలపడిన శిఖర్, భువనేశ్వర్..! ఆటగాళ్ల క్వారంటైన్ పూర్తి

Karan Johar: ఇంట్రెస్టింగ్ అనౌన్స్ మెంట్ చేయనున్న స్టార్ ప్రొడ్యూసర్.. వైరల్ అవుతున్న ట్వీట్