India vs Sri Lanka: ప్రాక్టీస్ మ్యాచ్ లో తలపడిన శిఖర్, భువనేశ్వర్..! ఆటగాళ్ల క్వారంటైన్ పూర్తి

టీమిండియా రెండవ జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ లో తలపడేందుకు శ్రీలంక వెళ్లింది. ఈ టూర్ కి శిఖర్ ధవన్ సారథిగా వ్యవరించనున్నాడు. రాహుల్ ద్రవిడ్ కోచ్ గా నియమించిన సంగతి తెలిసిందే. భారత జట్టు క్వారంటైన్ పూర్తి చేసుకుంది. ఈమేరకు సన్నాహకాలు ప్రారంభించింది.

India vs Sri Lanka: ప్రాక్టీస్ మ్యాచ్ లో తలపడిన శిఖర్, భువనేశ్వర్..! ఆటగాళ్ల క్వారంటైన్ పూర్తి
Team India
Follow us
Venkata Chari

|

Updated on: Jul 05, 2021 | 10:25 PM

India vs Sri Lanka: టీమిండియా రెండవ జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ లో తలపడేందుకు శ్రీలంక వెళ్లింది. ఈ టూర్ కి శిఖర్ ధవన్ సారథిగా వ్యవరించనున్నాడు. రాహుల్ ద్రవిడ్ కోచ్ గా నియమించిన సంగతి తెలిసిందే. భారత జట్టు క్వారంటైన్ పూర్తి చేసుకుంది. ఈమేరకు సన్నాహకాలు ప్రారంభించింది. టీమిండియా జట్టు శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని జట్టు ఇంగ్లండ్ లో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. అందుకే భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రయోగాత్మకంగా యువ జట్టును శ్రీలంకకు పయనం చేయించింది. ఐపీఎల్, భారత్ ఏ తరఫున ఆడిన ఆటగాళ్లను శ్రీలంక టూర్‌కు ఎంపిక చేసింది. ఈ మేరకు శ్రీలంకకు చేరుకుని క్వారంటైన్ పూర్తి చేసుకున్న ఆటగాళ్లనై ఒత్తిడి తగ్గించేందుకు బీసీసీఐ సరికొత్త ప్రయోగాలు చేస్తోంది. మొన్నటి వరకు సరదాగా ఇండోర్ లో గేమ్స్ ఆడించిన మేనేజ్మెంట్.. తాజాగా ప్రాక్టీస్ మ్యాచులు ఆడించింది. శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం 20 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేశారు. ఇందులో ఐదుగురిని నెట్ బౌలర్లుగా ఎంపిక చేసింది. విరాట్ సేన తరహాలోనే శ్రీలంకకు వెళ్లేముందు ముంబైలో 15 రోజుల క్వారంటైన్‌లో ఉంచింది బీసీసీఐ. అనంతరం శ్రీలంకకు చేరుకున్న ఆటగాళ్లు.. మరో మూడు రోజులు క్వారంటైన్‌లో ఉన్నారు.

ఈ మేరకు సోమవారం రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. భారత ఆటగాళ్లను రెండు జట్లుగా విభజించారు. ఓ జట్టుకు కెప్టెన్ గా శిఖర్ ధావన్, మరో జట్టుకు కెప్టెన్ గా భువనేశ్వర్ కుమార్‌లు వ్యవహరించారు. ఈ మేరకు మ్యాచ్ ఫొటోలను బీసీసీఐ ట్విట్టర్లో పంచుకుంద. అయితే స్కోర్ బోర్డును మాత్రం వెల్లడించలేదు. ఈ ఫొటోల్లో శిఖర్ ధావన్, మనీష్ పాండే, రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ చేస్తూ కనిపించారు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ చేశాడు. ఇషాన్ కిషన్ కీపర్‌గా కనిపించాడు. పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్ ఫీల్డింగ్ చేస్తూ ఫొటోల్లో కనిపించారు.

Also Read:

Smriti Mandhana: ఈ రెండు షరతులు నెరవేర్చితే.. స్మృతి మంధనా జీవిత భాగస్వామిగా అర్హత సాధించినట్లే..! గతేడాది ట్వీట్ వైరల్

Tokyo Olympics 2020: ఒలింపిక్ పతకాల కోసం 15 మంది భారత షూటర్లు సిద్ధం; ఫేవరెట్ గా బరిలోకి దిగేది ఎవరో తెలుసా..?