IPL 2022: వచ్చే సీజన్‌కు మరో రెండు జట్లు.. భారీ అంచాలతో రెడీ అవుతన్న కొత్త ఫ్రాంచైజీలు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2022 సీజన్‌కు బీసీసీఐ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది. రెండు కొత్త ఫ్రాంచైజీలు, ఆటగాళ్ల రీటెన్షన్‌ విధానం, భారీ వేలం, జీతాల పెంపుపై నిర్ణయం తీసుకుంది. కొత్త ఫ్రాంచైజీల కోసం ఆగస్టులో..

IPL 2022: వచ్చే సీజన్‌కు మరో రెండు జట్లు.. భారీ అంచాలతో రెడీ అవుతన్న కొత్త ఫ్రాంచైజీలు
Ipl 2021
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 06, 2021 | 6:25 AM

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2022 సీజన్‌కు బీసీసీఐ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది. రెండు కొత్త ఫ్రాంచైజీలు, ఆటగాళ్ల రీటెన్షన్‌ విధానం, భారీ వేలం, జీతాల పెంపుపై నిర్ణయం తీసుకుంది. కొత్త ఫ్రాంచైజీల కోసం ఆగస్టులో టెండర్లు పిలిచి సెప్టెంబర్లో విక్రయం పూర్తి చేయనుంది. డిసెంబర్లో భారీ వేలం నిర్వహించనుంది. IPL 2022కి బీసీపీఐ రెడీ అవుతోంది. కొత్త ఫ్రాంచైజీల కొనుగోలు కోసం సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌ (కోల్‌కతా), అదానీ గ్రూప్‌ (అహ్మదాబాద్‌), అరబిందో ఫార్మా (హైదరాబాద్‌), టొరెంట్‌ గ్రూప్‌ (గుజరాత్‌) సహా మరికొన్ని వ్యాపార సంస్థలు ఆసక్తిగా ఉన్నట్టు తెలిసింది. ఏదేమైనా అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీని అదానీ గ్రూప్‌ దక్కించుకోనే అవకావాలు కనిపిస్తున్నాయి.

ఇక ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడంపై బీసీసీఐ స్పష్టత ఇచ్చింది. 2022 సీజన్‌ వేలం ముందు గరిష్ఠంగా నలుగురిని రీటెయిన్‌ చేసుకోవచ్చు. ఐతే ఇందుకు కొన్ని పరిమితులు ఉన్నాయి. ముగ్గురు భారతీయులు, ఒక విదేశీ ఆటగాడిని తీసుకోవచ్చు. లేదా ఇద్దరు భారతీయులు, ఇద్దరు విదేశీ ఆటగాళ్లను అట్టిపెట్టుకోవచ్చు. ముగ్గురు ఆటగాళ్లను తీసుకుంటే 15 కోట్లు, 11 కోట్లు, 7 కోట్లు వారికి చెల్లించాలి. ఇద్దరిని తీసుకుంటే 12.5 కోట్లు, 8.5 కోట్లు, ఒక్కరినే తీసుకుంటే 12.5 కోట్లు ఇవ్వాలి.

ఆటగాళ్లకు చెల్లించే జీతాల నిధి మొత్తాన్ని 85 నుంచి 90 కోట్లకు పెంచింది. అంటే పది ఫ్రాంచైజీల నుంచి 50 కోట్లు జమ అవుతుంది. ఫ్రాంచైజీలు ఇందులో కనీసం 75% ఖర్చు చేయాలి. ఏటా రూ. 5 కోట్లు పెంచుతూ 2024కు ఈ జీతాల నిధిని 100 కోట్లకు చేరుస్తారని తెలిసింది. పది జట్లతో నిర్వహించే ఐపీఎల్‌ ప్రసార హక్కులు భారీ స్థాయిలో అమ్ముడు పోతాయని అంచనా.

ఇవి కూడా చదవండి: Modi Cabinet Expansion 2021: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్..! ప్రాబబుల్స్‌లో ఎవరున్నారంటే..!

Covid Victims Park: కోవిడ్ మృతుల స్మారక కట్టడం.. పార్కును నిర్మించే పనిలో రాష్ట్ర సర్కార్..