- Telugu News Photo Gallery Sports photos 15 indian shooters ready for olympic medals do you know who are know the favorites for medal
Tokyo Olympics 2020: ఒలింపిక్ పతకాల కోసం 15 మంది భారత షూటర్లు సిద్ధం; ఫేవరెట్ గా బరిలోకి దిగేది ఎవరో తెలుసా..?
Tokyo Olympics 2020: ఇప్పటి వరకు జరిగిన ఒలింపిక్ క్రీడల్లో షూటింగ్ విభాగంలో భారత్ 4 పతకాలు సాధించింది. షూటింగ్ విభాగంలో భారత్ ఎప్పుడూ ఓ పతకాన్ని ఆశిస్తుంటుంది. దీంతో ఈసారి కూడా టోక్యో ఒలింపిక్స్‌లో షూటర్లపై ప్రత్యేక దృష్టి ఉంది.
Updated on: Jul 20, 2021 | 11:58 AM

Tokyo Olympics 2020: ప్రతీ ఒలింపిక్స్ లో భారత్ ఆశలు పెట్టుకునే విభాగం అంటూ ఉందంటే మాత్రం అది షూటింగ్ ఒక్కటే. ఈ సారి భారత్ నుంచి ఎక్కువ మంది ఈ విభాగంలో పోటీపడనున్నారు. 15 మంది ఆటగాళ్లను షూటింగ్ విభాగంలో భారత్ పంపనుంది. వీరిలో కొంతమందిపై మాత్రం చాలా ఆశలు ఉన్నాయి.

ఈ ఏడాది ఒలింపిక్స్‌లో పతకం సాధించే లిస్టులో మొదటి వాడుగా సౌరభ్ చౌదరి పేరుగాంచాడు. ఈ యువ ఆటగాడు ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ లో వ్యక్తిగత, టీం ఈవెంట్లలో దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇప్పటికే ISSF ప్రపంచ కప్, ప్రపంచ ఛాంపియన్‌షిప్, యూత్ ఒలింపిక్స్, ఆసియా క్రీడలలో పతకాలు సాధించాడు. క్రొయేషియాలో ఇటీవల ముగిసిన ప్రపంచ కప్‌లో సౌరభ్ ఆట దేశాన్ని ఆకట్టుకుంది.

20 ఏళ్ల మను భాకర్ 2018 కామన్వెల్త్ క్రీడల నుంచి ఒలింపిక్స్‌లో పతకం సాధించే లిస్టులో ఉంటాడని భావిస్తున్నారు. అనుకున్నట్లుగా టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించింది. టోక్యో ఒలింపిక్స్‌లో 3 ఈవెంట్లలో పాల్గొనే ఏకైక షూటర్ గాను రికార్డు క్రియోట్ చేసింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో సౌరబ్‌తో పాటు 25 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీ ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్లలో ఆమె పోటీపడనుంది. గతేడాది అర్జున అవార్డు గ్రహీత మను ఈ మూడు ఈవెంట్లలోనూ పతకాన్ని సాధించేందుకు ప్రధాన పోటీదారుగా ఉంటుందని భావిస్తున్నారు.

రాహి సర్నోబాత్ దేశానికి చెందిన అనుభవజ్ఞురాలైన షూటర్. ఒలింపిక్స్‌లో 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్‌లో ఆమె పోటీపడనుంది. మ్యూనిచ్‌లో జరిగిన 2019 ప్రపంచ కప్ పోటీల్లో స్వర్ణం సాధించడంతో టోక్యో ఒలింపిక్స్ కు ఎన్నికైంది. ఇటీవల ముగిసిన క్రొయేషియా ప్రపంచ కప్‌లో బంగారు పతకం సాధించడంతో పతకాన్ని సాధించే లిస్టులోనూ చేరిపోయింది. కామన్వెల్త్ క్రీడల్లో దేశానికి బంగారు పతకం సాధించడంతో.. రాహి పేరు మారుమోగిపోయింది.

అభిషేక్ వర్మ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో ప్రపంచ నంబర్ వన్ షూటర్‌గా ఒలింపిక్స్ బరిలోకి దిగనున్నాడు. 2018 లో జకార్తాలో జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని సాధించాడు. 2019 లో రియో ప్రపంచ కప్‌లో బంగారు పతకం సాధించి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

టోక్యో ఒలింపిక్స్‌లో ఎలవేనిల్ వలరివన్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ ఈవెంట్లలో పోటీపడనుంది. రెండు కోటాల్లో ఆడనున్న ఏకైక భారత షూటర్ ఎలవేనిల్ వలరివన్ మాత్రమే. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో ప్రపంచ నంబర్ వన్ తోపాటు ఆమె ప్రదర్శనతో ఒలిపింక్స్ లో అర్హత సాధించింది. ISSF ప్రపంచ కప్‌లో దేశానికి అనేక పతకాలు సాధించింది. దీంతో టోక్యో ఒలింపిక్సలో పతకం సాధించే లిస్టులో ఈమె పేరు కూడా చేరింది.

భారత షూటింగ్ జట్టులో అత్యంత అనుభవజ్ఞులైన ఆటగాళ్లలో అంజుమ్ మోడ్గిల్ ఒకరు. ఇటీవల ఖేల్ రత్న అవార్డుకు నామినేట్ అయింది. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి షూటర్ కూడా అంజుమ్ మోడ్గిల్ నిలిచారు.
