Smriti Mandhana: ఈ రెండు షరతులు నెరవేర్చితే.. స్మృతి మంధనా జీవిత భాగస్వామిగా అర్హత సాధించినట్లే..! గతేడాది ట్వీట్ వైరల్

భారత మహిళా జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధనా ప్రేమ వివాహంతోపాటు పెద్దలు కుదిర్చిన వివాహం పై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది.

Smriti Mandhana: ఈ రెండు షరతులు నెరవేర్చితే.. స్మృతి మంధనా జీవిత భాగస్వామిగా అర్హత సాధించినట్లే..! గతేడాది ట్వీట్ వైరల్
Smriti Mandhana
Follow us
Venkata Chari

|

Updated on: Jul 05, 2021 | 9:16 PM

Smriti Mandhana: భారత మహిళా క్రికెట్ జట్టులో ఇద్దరు బలమైన ఓపెనర్లు ఉన్నారు. ఒకరు షెఫాలి వర్మ.. వీరేందర్ సెహ్వాగ్ తరహాలో దూకుడుగా బ్యాట్ ఝులింపిచేస్తుంది. మరొకరు స్మృతి మంధనా.. అద్భుతమైన బ్యాటింగ్ స్టైల్ కోసం సౌరవ్ గంగూలీని ఫాలో చేస్తోంది. మైదానంలో తన బ్యాటింగ్ తో పరుగుల సునామీ సృష్టించగల సత్తా స్మృతి మంధనా సొంతం. మైదానం వెలుపల ఏ విషయమైనా సూటిగా మాట్లాడడం ఈ అమ్మడికి కొట్టిన పిండి లాంటిది. సోషల్ మీడియాలో తరుచుగా ఫొటోలు షేర్ చేస్తూ.. ఫ్యాన్స్ ను పిచ్చెక్కించడంలోనూ దిట్ట. ఆటలోనే కాదు అందంలోనూ ఏమాత్రం తగ్గేదేలే అంటూ.. నెటిజన్లను షాక్ కు గురి చేస్తుంటుంది. తాజాగా స్మృతి ఓ విషయంలో వైరల్ గా మారింది. గతేడాది ట్విట్టర్లో ఫాలోవర్స్ తో #AskSmriti పేరుతో చిట్ చాట్ చేసింది. ఆ చిట్ చాట్ లో లైఫ్ పార్టనర్ గురించి అడిగిన ఓ ప్రశ్నకు తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చింది. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయానికి వస్తే… ట్విట్టర్ లో ఓ యూజర్ మీకు ఎలాంటి లక్షణాలు ఉన్న లైఫ్ పార్టనర్ కావాలని అడిగాడు. దీంతో ఈ అమ్మడు తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చింది. ‘నాకు కాబోయే జీవిత భాగస్వామికి రెండు లక్షణాలు తప్పకుండా ఉండాలి. అందులో ఒకటి నన్ను కచ్చితంగా ప్రేమించాలి. రెండవది మొదటి రూల్ ని తప్పకుండా ఫాలో చేయాలి అంటూ’ నవ్వులు పూయించింది.

అదే తరహాలో అభిమానులు చాలా ప్రశ్నలు అడిగారుు. అప్పుడప్పుడూ ఇలాంటి చిట్ చాట్ చేసి అభిమానులను ఉత్సాహపరుస్తూ ఉంటోంది. మరో అభిమాని ప్రేమ వివాహం ఇష్టమా? లేక పెద్దలు కుదిర్చిన వివాహం ఇష్టమా? అంటూ ప్రశ్నించాడు. దీనికి కూడా తనదైన శైలిలో హస్యాన్ని జోడించి లవ్-రేంజ్ అంటూ సమాధానమిచ్చింది. ఎలాంటి ప్రశ్న వేసినా భయపడకుండా ఆన్సర్ చేస్తూ.. ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తోంది. ఈ ఎడమచేతి వాటం అమ్మడికి హ్యూమర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఎలాంటి ప్రశ్ననైనా తన హస్యాన్ని జోడించి బదులు ఇవ్వడంతో.. ఈమె ట్వీట్లు వైరల్ గా మారుతాయి. ఇవేకాక తన ఆహారం, ఇష్టమైన క్రీడాకారుల గురించి ఇంకా ఎన్నో ప్రశ్నలు ఆమెకు సంధించారు. ప్రస్తుతం ఈ ఆన్సర్ మాత్రం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కరోనా లాక్ డౌన్ సమయంలోనూ ఇలాంటి చిట్ చాట్ తో తన ఫ్యాన్స్ కి తగినంత ఎంటర్టైన్మెంట్ అందించింది.

Also Read:

Tokyo Olympics 2020: ఒలింపిక్ పతకాల కోసం 15 మంది భారత షూటర్లు సిద్ధం; ఫేవరెట్ గా బరిలోకి దిగేది ఎవరో తెలుసా..?

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో మువ్వన్నెల పతకాధారులుగా వీరే..! భారత బృందాన్ని నడిపించే అరుదైన అవకాశం

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..