Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో మువ్వన్నెల పతకాధారులుగా వీరే..! భారత బృందాన్ని నడిపించే అరుదైన అవకాశం
టోక్యో ఒలింపిక్స్ జులై 23 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 8 వరకు జరగనున్న ఈ క్రీడల్లో భారత్ నుంచి దాదాపు 117 మంది అథ్లెట్లు పాల్గొననున్నారు.
Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ జులై 23 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 8 వరకు జరగనున్న ఈ క్రీడల్లో భారత్ నుంచి దాదాపు 117 మంది అథ్లెట్లు పాల్గొననున్నారు. ఈమేరకు భారత ఒలింపిక్స్ సంఘం అథ్లెట్ల లిస్టును విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ లో భారత జెండాను చేతబూని భారత బృందాన్ని నడిపించే అవకాశం ఇద్దరికి దక్కింది. వీరిలో మహిళల నుంచి ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్ కాగా, పురుషుల నుంచి హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌లకు ఈ ఛాన్స్ దక్కింది. అలాగే ఆగస్టు 8న నిర్వహించే ముగింపు కార్యక్రమంలో రెజ్లర్ బజరంగ్ పూనియాకు కూడా మువ్వెన్నల జెంగాను మోసే అవకాశం దక్కింది. భారత ఒలింపిక్ అసోసియేషన్ ఒలింపిక్స్ నిర్వాహక కమిటీకి ఈమేరకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. క్రీడల్లో లింగ వివక్షకు ఛాన్స్ లేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐఓఏ తెలిపింది.
కాగా, భారత్ స్టార్ షట్లర్ పీవీ సింధు కి ఈ అవకాశం వస్తుందని వార్తలు వచ్చాయి. కానీ, చివరకు మహిళల నుంచి మేరీకోమ్ కు ఈ అవకాశం దక్కింది. అలాగే 2016లో రియో డి జెనీరోలో జరిగిన ఒలింపిక్స్‌లో ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా భారల పతాకాన్ని చేతబూని భారత బృందాన్ని ముందుకు నడిపించాడు. ఈ సారి టోక్యోలో జరిగే ఒలింపిక్స్ లో మాత్రం లింగ వివక్షకు తావు లేకుండా మహిళలు, పురుషుల నుంచి ఇద్దరిని ఎంచుకున్నారు. గతేడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్.. కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ప్రస్తుతం జులై 23 నుంచి నిర్వహించేందుకు ఐఓసీ, జపాన్ ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి.
Also Read:
Anil kumble Meets YS Jagan: ముఖ్యమంత్రి జగన్ తో మాజీ క్రికెటర్ అనిల్‌కుంబ్లే భేటీ..!
HBD PV Sindhu: భారత బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు గురించి మీకు తెలియని 5 విషయాలు..!
Viral Photo: వింబుల్డన్ లో సచిన్, విరాట్ జంటలు.. వైరలవుతోన్న ఆనాటి ఫొటో!