Viral Photo: వింబుల్డన్ లో సచిన్, విరాట్ జంటలు.. వైరలవుతోన్న ఆనాటి ఫొటో!

ప్రస్తుతం నెట్టింట్లో ఎలాంటి ఫొటో, వీడియో అయినా వైరల్ గా మారడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే, ఈ కోవిడ్ కాలంలో ఎప్పుడు ఎలాంటి ఫొటో లేదా వీడియో ఎందుకు వైరల్ చేస్తున్నారో మాత్రం తెలియడం లేదు.

Viral Photo: వింబుల్డన్ లో సచిన్, విరాట్ జంటలు.. వైరలవుతోన్న ఆనాటి ఫొటో!
Sachin Tendulkar And Virat Kohli Spotted On 2015 Wimbledon Semi Finals
Follow us
Venkata Chari

|

Updated on: Jul 05, 2021 | 5:55 PM

Viral Photo: ప్రస్తుతం నెట్టింట్లో ఎలాంటి ఫొటో, వీడియో అయినా వైరల్ గా మారడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే, ఈ కోవిడ్ కాలంలో ఎప్పుడు ఎలాంటి ఫొటో లేదా వీడియో ఎందుకు వైరల్ చేస్తున్నారో మాత్రం తెలియడం లేదు. పాత వాటిని కూడా వదలకుండా సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసేస్తున్నారు నెటిజన్లు. ఈ విషయంలో సెలబ్రిటీలు ముందంజలో ఉంటారనడంలో సందేహం లేదు. వారి ఫొటోలు, వీడియోలు పాతవైనా, కొత్తవైనా సరే తెగ సందడి చేస్తుంటాయి. తాజాగా అలాంటి ఓ పాత ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తోంది. టీమిండియా లెంజండ్రీ క్రికెటర్ సచిన్, ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ కలిసి ఉన్న ఓ ఫొటో తెగ సందడి చేస్తోంది. అయితే ఈ ఫొటోలో ఈ స్టార్ క్రికెటర్ల భార్యలు కూడా ఉండడంతో.. మరింతగా ఆకట్టుకుంటోంది. ఈ ఫొటో 2015 వింబుల్డన్ ఎడిషన్ సందర్భంగా జరిగిన ఓ మ్యాచ్ లో వీరంతా కనిపించి సందడి చేశారు. ప్రస్తుతం వింబుల్డన్ ఛాంపియన్స్ సందడి చేస్తోంది. కాబట్టి ఇదే అదనుగా ఈ టీమిండియా స్టార్ ల ఫొటోలు వైరల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరంతా ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో అభిమానులకు కనుల పండువగా మారింది. సచిన్ టెండూల్కర్ భార్య అంజలి, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ వింబుల్డన్ ఛాంపియన్స్ లో ప్రేక్షకులుగా హాజరయ్యారు.

స్విస్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ అంటే సచిన్ కు ఎంతో ఇష్టం. దీంతో 2015 వింబుల్డన్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల సెమీ-ఫైనల్స్‌ లో ఫెదరర్ ఆటను చూసేందుకు సచిన్ తన భార్యతో హాజరయ్యాడు.అలాగే విరాట్ కోహ్లీ జంట కూడా ఆసీనులయ్యారు. వీరితో పాటు ఆర్సెనల్ లెజెండ్ థియరీ హెన్రీ, మాజీ మాంచెస్టర్ యునైటెడ్ మేనేజర్ సర్ అలెక్స్ ఫెర్గూసన్ కూడా ఉన్నారు. హెన్రీ, ఫెర్గూసన్ లు సచిన్ టెండూల్కర్ ఎడమ వైపు కూర్చొని ఉన్నారు.

2015 వింబుల్డన్ ఛాంపియన్‌షిప్‌లో సెమీ-ఫైనల్ మ్యాచ్‌ లో ప్రపంచ నంబర్ 1 నోవాక్ జొకోవిచ్.. ఫ్రాన్స్‌కు చెందిన రిచర్డ్ గ్యాస్కెట్‌తో తలపడ్డాడు. మరో సెమీ ఫైనల్ లో ప్రపంచ నంబర్ 2 రోజర్ ఫెదరర్.. మూడవ సీడ్ ఆండీ ముర్రేతో తలపడ్డాడు. గ్రాండ్‌స్లామ్ ఈవెంట్ ఫైనల్‌లో జొకోవిచ్‌తో ఫెదరర్ తలడ్డాడు. జొకోవిచ్ 7–6 (7–1), 6–7 (10–12), 6–4, 6–3తో ఫెదరర్‌ను ఓడించి పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.

Also Read:

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ లో అథ్లెట్స్ కరోనా పాజిటివ్ గా తేలితే ఏం చేస్తారో తెలుసా..?

Anil kumble Meets YS Jagan: ఏపీ సీఎం జగన్ ను కలిసిన టీమిండియా మాజీ క్రికెటర్..!

Love Proposal: పిచ్‌లో గ‌ర్ల్‌ఫ్రెండ్‌కి లవ్ ప్రపోజ్‌.. హోరెత్తిన స్టేడియం.. వైరల్‌గా మారిన వీడియో..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే