Love Proposal: పిచ్‌లో గ‌ర్ల్‌ఫ్రెండ్‌కి లవ్ ప్రపోజ్‌.. హోరెత్తిన స్టేడియం.. వైరల్‌గా మారిన వీడియో..

అమెరికన్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు హసాని డాట్సన్‌ స్టీఫెన్‌సన్‌ పిచ్‌లో ప్రపోజ్ చేసి తన గర్ల్‌ఫ్రెండ్‌కు షాకిచ్చాడు. మేజర్‌ లీగ్‌ సాకర్‌ టోర్నీలో భాగంగా..

Love Proposal: పిచ్‌లో గ‌ర్ల్‌ఫ్రెండ్‌కి లవ్ ప్రపోజ్‌.. హోరెత్తిన స్టేడియం.. వైరల్‌గా మారిన వీడియో..
Football Player
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 05, 2021 | 3:53 PM

అప్పుడెప్పుడో ఓ క్రికెట్ మ్యాచ్‌లో తన లవర్‌కు ఓ ప్రేక్షకుడు ప్రపోజ్ చేసిన వైరల్ వీడియోను మీరు చూసే ఉంటారు. సరిగ్గా అదే కోవలో తాజాగా ఓ ఫుట్‌బాల్ ప్లేయర్ తన ప్రేయసి‌కి ‘ఐ లవ్ యూ’ చెప్పి రింగ్ తొడిగాడు. ఈ లవ్లీ సీన్ మిన్నెసోటా ఎఫ్‌సీ, సాన్‌ హోజె ఎర్త్‌క్వేక్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ అనంతరం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఆదివారం మేజర్ లీగ్ సాకర్‌ టోర్నీలో భాగంగా మిన్నెసోటా ఎఫ్‌సీ, సాన్‌ హోజె ఎర్త్‌క్వేక్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఇక ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అనంతరం అమెరికన్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు హసాని డాట్సన్‌ స్టీఫెన్‌సన్‌ పిచ్‌లో తన గర్ల్‌ఫ్రెండ్‌ పెట్రా వుకోవిక్‌‌కు ‘విల్‌ యు మ్యారీ మీ’ అంటూ ఉంగరంతో ప్రపోజ్‌ చేశాడు. బాయ్‌ఫ్రెండ్‌ ఇచ్చిన సడన్ స‌ర్‌ప్రైజ్‌‌కు ఆమె కాసింత షాక్ అయినా.. ఆ తర్వాత తేరుకుని అతని ప్రపోజల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ లవ్లీ సీన్ జరుగుతున్నప్పుడు ప్రేక్షకులు గట్టిగా కేకలు వేశారు. దీనితో స్టేడియం మొత్తం హోరెత్తింది. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలను అటు స్టీఫెన్‌సన్.. ఇటు పెట్రా వుకోవిక్‌ తమ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లలో పోస్ట్ చేసుకున్నారు. “నా ఆనందాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవడం లేదు. నీలాంటి వ్యక్తి ప్రేమ దొరికినందుకు నేనెంతో అదృష్టవంతురాలిని. నా జీవితంలో ఈ అందమైన క్షణాలను మధుర జ్ఙాపకంగా ఉంచడంలో సహయపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అంటూ పెట్రా వుకోవిక్‌ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Also Read: 

మందుబాబులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గనున్న బీర్ల ధరలు.. వివరాలివే.!

మెడలో పాముతో వృద్ధుడు సైకిల్‌పై సవారీ.. వీడియో చూస్తే మీరూ ఔరా అనాల్సిందే!

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..