Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ లో అథ్లెట్స్ కరోనా పాజిటివ్ గా తేలితే ఏం చేస్తారో తెలుసా..?

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ లో అథ్లెట్స్ కరోనా పాజిటివ్ గా తేలితే ఏం చేస్తారో తెలుసా..?
Covid 19 In Tokyo Olympics

Tokyo Olympics: గతేడాది జరగాల్సిన ఒలింపిక్ క్రీడలు.. కరోనాతో ఈ ఏడాదికి వాయిదా పడిన విషయం తెలిసిందే. టోక్యో వేదికగా జులై 23 నుంచి ఒలింపిక్స్ ప్రారంభం కానున్న నేసథ్యంలో.. కోవిడ్ ఫ్రీగా ఒలింపిక్స్ ను ఎలా నిర్వహించనున్నారు అనే సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి.

Venkata Chari

|

Jul 20, 2021 | 11:59 AM

Tokyo Olympics: గతేడాది జరగాల్సిన ఒలింపిక్ క్రీడలు.. కరోనాతో ఈ ఏడాదికి వాయిదా పడిన విషయం తెలిసిందే. టోక్యో వేదికగా జులై 23 నుంచి ఒలింపిక్స్ ప్రారంభం కానున్న నేసథ్యంలో.. కోవిడ్ ఫ్రీగా ఒలింపిక్స్ ను ఎలా నిర్వహించనున్నారు అనే సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి. ఇప్పటికైతే విదేశీ అభిమానులకు ప్రవేశం లేదని టోక్యో ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, జపాన్ అభిమానులకు మాత్రమే స్టేడియంలోకి అనుమతిని ఇచ్చింది. అయితే ఇంతవరకు దీనికి సంబధించిన ఎలాంటి ప్రక్రియ మొదలు కాలేదంట. టోక్యోలో గత పది రోజులుగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), జపాన్ ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో ఒలింపిక్స్ నిర్వహించడమంటే కత్తి మీద సాము లా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుంచి ఎంతో మంది క్రీడాకారులు పోటీలకు రానుండడంతో.. మరిన్ని కొత్త వేరియంట్ లు పుట్టుకొస్తాయని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డెల్లా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో.. ముందుముందు పరిస్థితి ఎలా ఉండనుందో చూడాలి మరి. ప్రపంచ వ్యాప్తంగా ఆటగాళ్లతో పరిస్థితి రానున్న రోజుల్లో ఎలా మారనుందోనని అక్కడి వైద్య సంఘాలు కూడా ఆందోళన చెందుతున్నాయి.

ఒలింపిక్స్ సందర్భంగా అథ్లెట్స్ కోవిడ్-19 పాజిటివ్ గా తేలితే ఏం చేస్తారు.?

ఇదే ప్రశ్న ప్రస్తుతం ప్రతీ క్రీడాభిమాని మనసులో ఉంది. ఎందుకంటే ఎంతో మంది ఉన్న ఒలింపిక్ విలేజ్ లో ఒక్క ఆటగాడికి పాజిటివ్ గా తేలినా.. అది చాలా ప్రమాదకరంగా మరనుంది. అది ఒక్కరితో ఆగిపోకుండా… చాలామంది వైరస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఒక్క అథ్లెట్ పాజిటివ్ గా తేలినా… అది పతకాలపై కూడా చాలా ప్రభావం చూపనుంది. టోక్యో చేరుకున్న నాటి నుంచి పోటీలు ముగిసే దాక ఆటగాళ్లు పాటించాల్సిన నియమాలతో ఐఓసీ ఇప్పటికే మూడు వెర్షన్ లతో ప్లేబుక్ లను విడుదల చేసింది. అయితే, ఇలాంటి వాటితో కరోనా వ్యాప్తిని మాత్రం అడ్డుకోవడం సాధ్యంకాదనేది ఎక్కుమందిని మరింత భయభ్రాంతులకు గురిచేస్తోంది.

ఈ ఏడాది ప్రారంభంలో అంటే ఫిబ్రవరిలో విడుదల చేసిన మొదటి ప్లేబుక్ లో టోక్యో క్రీడల సమయంలో అథ్లెట్లు లేదా అధికారులు కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయితే ఏమి జరగనుంది? అలాగే ఎలాంటి చర్యలు తీసుకోవాలో అందులో రూపొందించారు. ప్లేబుక్ లో రూపొందించిన రూల్స్ ప్రకారం, ఎవరైనా అథ్లెట్ కరోనా పాజిటివ్ గా తేలితే.. వారు ఒలింపిక్స్ నుంచి పూర్తిగా వైదొలగాల్సిందే. తరువాతి పోటీలకు అనుమతించరు. అంతేకాకుండా, పాజిటివ్ గా తేలిన అథ్లెట్ తో క్లోజ్ గా ఉన్నవారికి కోవిడ్ పరీక్షలు చేస్తారు. 15 నిమిషాలపాటు క్లోజ్ గా ఉన్నవారికి తప్పకుండా కోవిడ్ పరీక్షలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ నిబంధనలను పాటించడంలో విఫలమైన అథ్లెట్లు.. తమ ఐఓసీ అక్రిడిటేషన్‌ను కోల్పోయే ప్రమాదం ఉందని ప్లేబుక్ పేర్కొంది. అంతేకాకుండా, పాజిటివ్ పరీక్షించిన అథ్లెట్‌ కు రెండవ సారి కూడా కోవిడ్ పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షల్లో నెగిటివ్ గా తేలితే మాత్రం.. వారు ఒలింపిక్స్ లో ఆడేందుకు అనుమతిస్తారు.

Also Read:

Anil kumble Meets YS Jagan: ఏపీ సీఎం జగన్ ను కలిసిన టీమిండియా మాజీ క్రికెటర్..!

Love Proposal: పిచ్‌లో గ‌ర్ల్‌ఫ్రెండ్‌కి లవ్ ప్రపోజ్‌.. హోరెత్తిన స్టేడియం.. వైరల్‌గా మారిన వీడియో..

ENG vs SL: శ్రీలంకను వెంటాడిన పవర్ ప్లే గండం.. 11 వికెట్లతో లంకేయుల తాటతీసిన ఇంగ్లండ్ బౌలర్లు..!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu