Feeling Tired In Office: ఆఫీసులో పనిచేసేప్పుడు ఊరికే అలిసిపోతున్నారా..? పరిశోధకులు ఏం సలహాలిస్తున్నారో చూడండి..
Feeling Tired In Office: ఆఫీసుల్లో పనిచేసే క్రమంలో చాలా మంది ఊరికే అలసిపోతుంటారు. కాస్త పని ఎక్కువయ్యేసరికి ఎక్కడలేని అలసట వచ్చేస్తోంది. దీంతో ఈ ప్రభావం పనిపై కచ్చితంగా పడుతుంది. ఆఫీసుల్లో ఉద్యోగులు సరిగ్గా పనిచేయకపోతే పనిలో నాణ్యత తగ్గిపోతుంది. అయితే...
Feeling Tired In Office: ఆఫీసుల్లో పనిచేసే క్రమంలో చాలా మంది ఊరికే అలసిపోతుంటారు. కాస్త పని ఎక్కువయ్యేసరికి ఎక్కడలేని అలసట వచ్చేస్తోంది. దీంతో ఈ ప్రభావం పనిపై కచ్చితంగా పడుతుంది. ఆఫీసుల్లో ఉద్యోగులు సరిగ్గా పనిచేయకపోతే పనిలో నాణ్యత తగ్గిపోతుంది. అయితే అలసిపోయిన వారిలో ఉత్సాహం పెంచుతూ జోష్‌గా పని చేసుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని పరిశోధకులు చెబుతున్నారు. ఒకవేళ ఆఫీసు పనివేళల్లో బాగా అలసటకు లోనవుతున్నట్లు భావన కలిగితే వెంటనే మీ పక్కన ఉన్న సహోద్యోగితో ఓ నాలుగు మాటలు మాట్లాడాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఏదో ఒక ఆహార పదార్థాన్ని స్నాక్స్ రూపంలో తీసుకుంటే వెంటనే అలసట పరార్ అయిపోయి మళ్లీ కొత్త ఉత్తేజం వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. పనిలో చిన్న చిన్న బ్రేక్స్ (మైక్రోబ్రేక్స్) తీసుకోవడం ద్వారా మీలోని ఎనర్జీ స్థాయిలు పెరడంతో పాటు పనిలో నాణ్యత కూడా మెరుగు పడుతుందని చెబుతున్నారు. కేవలం పక్కవారితో మాట్లాడడం, స్నాక్స్ తీసుకోవడమే కాకుండా మెదడుకు మేతగా పనిచేసే కొన్ని రకాల పజిల్ గేమ్స్ ఆడడం ద్వారా కూడా పని ప్రదేశాల్లో చురుకుగా మారుతారని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అయితే శాస్త్రవేత్తలు ఇదేదో ఆశామాషీగా చెబుతోన్న విషయం కాదు. పరిశోధనలు నిర్వహించి మరీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందుకోసం నిర్వహించిన సర్వేలో భాగంగా.. అమెరికాకు చెందిన 100 ఉద్యోగులను పరిగణలోకి తీసుకొని 10 రోజులపాటు ఉదయం, సాయంత్రం షిఫ్టుల్లో పనిచేసిన వారి నుంచి కొన్ని విషయాలను అడిగితెలుసుకున్నారు. అలాగే రెండో సర్వేలో సౌత్ కొరియాకు చెందిన మరో 222 మందిని పరిగణలోకి తీసుకొని వారి నిద్ర నాణ్యత, ఆరోజు ఆఫీసులో ఎలా గడిచింది, ఏ స్థాయిలో అలసటగా భావించారులాంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఉదయం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో ఉద్యోగుల ఆలోచన తీరును దీని ద్వారా బేరీజు వేశారు.