Happy Foods: ఈ ఫుడ్స్ తింటే ఆనందంగా ఉంటారట.. అవేంటో తెలుసుకోండి!
ఆనందంగా ఉండటానికి ఫుడ్స్ తింటారు కానీ.. ఫుడ్స్ తింటే ఆనందం కలుగుతుందని ఎప్పుడైనా విన్నారా. అవును నిజమే. ఇటీవల జరిగిన అధ్యయనంలో ఇదే తేలింది. కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల ఆనందం కలుగుతుందట. ఇవి సెరటోనిన్ హార్మోన్లను ఉత్పత్తి చేసి.. ఆనందాన్ని పెంచుతుందట. కాబట్టి తినడం వల్ల ఆనందంగా ఫీల్ అవుతారు. ఒత్తిడి, ఆందోళనగా ఉన్నప్పుడు ఇలాంటి ఆహారాలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి ఆనందాన్ని..

ఆనందంగా ఉండటానికి ఫుడ్స్ తింటారు కానీ.. ఫుడ్స్ తింటే ఆనందం కలుగుతుందని ఎప్పుడైనా విన్నారా. అవును నిజమే. ఇటీవల జరిగిన అధ్యయనంలో ఇదే తేలింది. కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల ఆనందం కలుగుతుందట. ఇవి సెరటోనిన్ హార్మోన్లను ఉత్పత్తి చేసి.. ఆనందాన్ని పెంచుతుందట. కాబట్టి తినడం వల్ల ఆనందంగా ఫీల్ అవుతారు. ఒత్తిడి, ఆందోళనగా ఉన్నప్పుడు ఇలాంటి ఆహారాలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి ఆనందాన్ని కలిగితే ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కిచిడి:
కిచిడి గురించి అందరికీ తెలుసు. దీన్ని పప్పులు, కూరగాయలు, అన్నం కలిపి చేస్తారు. ఇది చేయడం కూడా చాలా సులభం. కిచిడి ఒక సాంప్రదాయ వంటకంగా చెప్తారు. ఇది తినడం వల్ల జీర్ణ సమస్యలు ఏమీ రావు. సాఫీగా ఉంటుంది. ఈ కిచిడి తింటే సులువుగా జీర్ణం అవుతుంది. మెదడుకు కూడా హాయిగా ఉంటుంది. కిచిడి తిన్నప్పుడు ఆనంద హార్మోన్ ఉత్పత్తి అవుతుందని పోషకాహార నిపుణులు వెల్లడించారు.
మసాలా టీ:
ఎప్పుడైనా ఒత్తిడి, నీరసంగా ఉన్నప్పుడు ఒక్క టీ తాగితే సెట్ అవుతుంది. అలాంటప్పుడు మసాలా టీ తాగితే శరీరానికి సంతోషంగా అనిపిస్తుంది. ఇందులో పాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలు కలిపి ఉంటాయి. ఈ టీ తాగడం వల్ల మెదడు కూడా రిలీఫ్ నెస్ పొందుతుంది. దీంతో ఈ టీ తాగితే ఆనందంగా ఉంటుంది.
పెరుగన్నం:
చాలా మందికి పెరుగన్నం చాలా ఇష్టం. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఏ భోజనం తిన్నా చివరిలో పెరుగన్నం తింటే.. చాలా తృప్తిగా ఉంటుంది. పెరుగన్నం చాలా రుచిగా ఉంటుంది. ఇది తింటున్నంత సేపు మెదడుకు హాయిగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. కాబట్టి పెరుగున్నం తిన్నా హ్యాపీగా అనిపిస్తుంది.
బిర్యానీ:
చాలా మందికి బిర్యానీ అంటే చాలామందికి ఇష్టం. ఇందులో ఇప్పటికే ఎన్నో వందల రెసిపీలు ఉన్నాయి. బిర్యానీ వాసన వస్తేనే చాలా మందికి ఎనర్జీ వస్తుంది. బిర్యానీ తింటే శరీరంలో హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అందుకే బిర్యానీ కూడా సంతోషాన్ని ఇచ్చే ఆహారాల్లో ఒకటిగా చెప్తారు.
ఆలూ పరాఠా:
ఆలూ పరాఠా తిన్నా కూడా ఆనందం కలుగుతుంది. గోధుమ పిండి, ఆలు గడ్డలతో తయారు చేసే ఈ పరాఠా చాలా రుచిగా ఉంటుంది. ఇది తిన్న తర్వాత పొట్ట కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. చాలా మంది దీన్ని పెరుగుతో తింటారు. ఇలా తినడం వల్ల మెదడుకు, ఉత్తేజాన్ని, ప్రశాంతతను అందిస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.








