AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brass Utensils: ఇత్తడి పాత్రలను కనుక ఇలా శుభ్రం చేస్తే.. తళతళమని మెరిసిపోతాయ్!

ప్రతీ ఒక్కరి ఇళ్లల్లో ఇత్తడి పాత్రలు అనేవి తక్కువో ఎక్కువో ఖచ్చితంగా ఉంటాయి. పూర్వం అయితే వీటి వాడకం ఎక్కువగా ఉండేవి. ఈ పాత్రల్లోనే వంటలు కూడా చేసేవారు. కానీ ఇప్పుడు వీటిని చాలా తక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇతర పాత్రలతో పోల్చితే ఇత్తడి పాత్రలు అనేవి చాలా త్వరగా మరకలు అయిపోవడం, నల్లగా మారడం జరుగుతూ ఉంటాయి. వీటిని శుభ్రం చేయలంటే.. చాలా కష్టం. ఇత్తడి పాత్రలను శుభ్రం చేయడానికి..

Brass Utensils: ఇత్తడి పాత్రలను కనుక ఇలా శుభ్రం చేస్తే.. తళతళమని మెరిసిపోతాయ్!
Brass Utensils
Chinni Enni
|

Updated on: Apr 05, 2024 | 6:43 PM

Share

ప్రతీ ఒక్కరి ఇళ్లల్లో ఇత్తడి పాత్రలు అనేవి తక్కువో ఎక్కువో ఖచ్చితంగా ఉంటాయి. పూర్వం అయితే వీటి వాడకం ఎక్కువగా ఉండేవి. ఈ పాత్రల్లోనే వంటలు కూడా చేసేవారు. కానీ ఇప్పుడు వీటిని చాలా తక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇతర పాత్రలతో పోల్చితే ఇత్తడి పాత్రలు అనేవి చాలా త్వరగా మరకలు అయిపోవడం, నల్లగా మారడం జరుగుతూ ఉంటాయి. వీటిని శుభ్రం చేయలంటే.. చాలా కష్టం. ఇత్తడి పాత్రలను శుభ్రం చేయడానికి మహిళలు నానా తంటాలు పడతూ ఉంటారు. ఈ పాత్రలను క్లీన్ చేయడానికి గంటలకు గంటలు పడుతూ ఉంటాయి. అయితే ఈ సారి ఇత్తడి పాత్రలు శుభ్రం చేసే ముందు ఈ చిట్కాలు ఫాలో అయి చూడండి. ఇత్తడి పాత్రలు తళతళమని మెరిసి పోవడమే కాకుండా.. మీకు పని కూడా చాలా త్వరగా అయిపోతుంది. ఇంట్లో ఉండే వాటితోనే ఇత్తడి పాత్రలను శుభ్రం చేసుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడాను ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తారు. బేకింగ్ సోడాతో వంటలే కాకుండా సామాన్లు కూడా క్లీన్ చేసుకోవచ్చు. బేకింగ్ సోడాను ఉపయోగించి ఇత్తడి పాత్రలను శుభ్ర పరిస్తే.. కొత్తవాటిలా తెల్లగా మెరుస్తాయి. దీంతో క్లీన్ చేయడం కూడా చాలా సులభం.

వెనిగర్:

వెనిగర్‌తో కూడా ఇత్తడి పాత్రలు, ఇత్తడి విగ్రహాల నలుపును వదిలించవచ్చు. వెనిగర్ ఉపయోగించడం వల్ల ఇత్తడి వస్తువులు కొత్త వాటిలా మెరుస్తాయి. ఇత్తడి పాత్రలో వెనిగర్ వేసి.. అందులో కొద్దిగా ఉప్పు వేసి తోమితే.. తెల్లగా వస్తాయి. మీకు పని కూడా ఫాస్ట్‌గా అయిపోతుంది.

ఇవి కూడా చదవండి

నిమ్మ కాయ – ఉప్పు:

ఇత్తడి పాత్రలను తెల్లగా మెరిపించేలా చేయడంలో నిమ్మకాయ – ఉప్పు కూడా ఎఫెక్టీవ్‌గా పని చేస్తాయి. నిమ్మ కాయ, ఉప్పులో ఉండే ఆమ్లాలు.. నల్లగా ఉన్న వాటిని తెల్లగా మార్చుతాయి. కాబట్టి వీటితో ఇత్తడి పాత్రలను కనుక శుభ్రం చేస్తే అవి కొత్త వాటిలా తెల్లగా మారతాయి. అంతే కాకుండా మెరుస్తాయి కూడా. కాబట్టి ఇత్తడి పాత్రలు క్లీన్ చేసేటప్పుడు ఈసారి ఈ చిట్కా ఉపయోగించండి. మీకు పని కూడా సులభంగా అవుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..