విండ్ చైమ్ లు ఇంట్లో ఉంచేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి..! ఇంటికి అస్సలు మంచిది కాదు..!
ఇల్లు అందంగా ఉండాలని చాలా మందికి ఆకాంక్ష ఉంటుంది. కానీ అలంకరణలో వాస్తు నియమాలను పాటించకపోతే శాంతి, ఆనందం లోపించవచ్చు. ముఖ్యంగా విండ్ చైమ్‌లు ఎక్కడ ఉంచాలో తెలుసుకుని వాస్తు ప్రకారం ఏర్పాటు చేయాలి. తగిన దిశలో ఉంచినప్పుడు ఇంట్లో శుభశక్తి పెరుగుతుంది.

ప్రతి ఒక్కరి కల ఒక అందమైన ఇల్లు కలగటం. ఇల్లు సుందరంగా కనిపించేందుకు చాలా మంది డిజైన్ వస్తువులు, అలంకరణ సామగ్రి కొనుగోలు చేస్తారు. వాటిలో వాల్ హ్యాంగింగ్స్, లైట్స్, ఫర్నిచర్, విండ్ చైమ్‌లు ముఖ్యమైనవి. అయితే ఇల్లు అందంగా ఉండాలనే తపనతో వాస్తు నియమాలను విస్మరించడం వల్ల కొన్ని ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశం ఉంది. అలంకరణ సమయంలో చిన్న చిన్న విషయాలను పట్టించుకోకపోతే అవి మన జీవితం మీద కూడా ప్రభావం చూపవచ్చు.
వాస్తు అనేది పూర్వీకులు అందించిన గొప్ప శాస్త్రం. ఇది కేవలం ఇంటి నిర్మాణానికి సంబంధించినది కాదు.. మన జీవనశైలికి కూడా మార్గనిర్దేశనం చేసే శాస్త్రం. వాస్తు ప్రకారం ప్రతి వస్తువు, దిశకు ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఈ శక్తులు సమతుల్యంలో లేకపోతే మనసు అయోమయంలోకి వెళ్లిపోతుంది.. ఆరోగ్య సమస్యలు, కుటుంబ విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అందుకే ప్రతి వస్తువు ఎక్కడ పెట్టాలో స్పష్టతగా నిర్ణయించుకోవడం అవసరం.
ఇటీవల విండ్ చైమ్‌లు చాలా మంది ఇళ్లలో కనిపిస్తున్నాయి. ఇవి గాలిలో ఊగే ప్రతి సారి చక్కటి శబ్దాన్ని చేస్తాయి. ఈ శబ్దం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. వాస్తు ప్రకారం విండ్ చైమ్‌లు మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగించి శుభశక్తిని వ్యాప్తి చేస్తాయి. అయితే వాటిని సరైన ప్రదేశంలో ఉంచినపుడే ఫలితం లభిస్తుంది. వాటిని పెట్టే స్థలం వాటి తయారీ పదార్థాన్ని బట్టి మారుతుంది. మెటల్‌తో తయారైనవి ఉత్తర లేదా పడమర దిశలో ఉంచితే మంచిది. చెక్కతో తయారైనవి తూర్పు లేదా దక్షిణ దిశలో ఉంచాలి. ఈ దిశలు వాస్తు ప్రకారం శక్తి ప్రవాహానికి అనుకూలంగా ఉంటాయి.
విండ్ చైమ్‌లను కొన్ని ప్రదేశాల్లో పెట్టడం మంచిది కాదు. ఉదాహరణకు వంటగదిలో విండ్ చైమ్ పెట్టినట్లయితే అది శుభతను తగ్గించే ప్రమాదం ఉంది. ప్రార్థన గదిలో కూడా వాటిని పెట్టకపోవడం మంచిది.. ఎందుకంటే అక్కడ శబ్దం కన్నా నిశ్శబ్దత ముఖ్యమైనది. బెడ్‌రూమ్‌లో ఉంచాలంటే 9 రాడ్లతో ఉండే విండ్ చైమ్ ఉపయోగించాలి.. ఇది శక్తుల సమతుల్యతను కలిగించగలదు.
ఇల్లు అందంగా కనిపించాలనుకోవడం తప్పేమీ కాదు. కానీ అందంగా కనిపించడమే కాదు.. అక్కడ శాంతి, శుభశక్తి ఉండాలంటే వాస్తు సూచనలు పాటించాలి. అలంకరణ వస్తువులు ఎంత చిన్నవైనా.. అవి పెట్టే ప్రదేశాన్ని జాగ్రత్తగా ఎంపిక చేయాలి. వాస్తు ప్రకారం ప్లాన్ చేసుకున్న ఇంట్లో ఆనందం పెరుగుతుంది, కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగవుతుంది. శుభశక్తి వ్యాప్తి చెందుతుంది. అందుకే అలంకరణలో అందాన్ని మాత్రమే కాకుండా వాస్తుపై కూడా శ్రద్ధ పెట్టాలి. వాస్తు పద్ధతిలో ఉంచిన విండ్ చైమ్‌లు ఇంటిని శాంతిగా, శుభంగా మార్చే సాధనంగా మారుతాయి.