AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సగం కోసిన నిమ్మకాయ ముక్కను ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?

రోజూ వంటల్లోనో, సలాడ్లలోనో సగం నిమ్మకాయ వాడాక.. మిగిలిన సగాన్ని అలాగే ఫ్రిజ్‌లో పెట్టేస్తున్నారా? అయితే మరుసటి రోజు చూసేసరికి అది బండరాయిలా ఎండిపోయి, బొట్టు రసం కూడా రాకుండా పోతోందా? చాలా ఇళ్లలో నిత్యం ఎదురయ్యే ఈ సమస్యకు వంటింట్లోనే ఉండే చిన్న వస్తువులతో చెక్ పెట్టొచ్చు. సగం కోసిన నిమ్మకాయ రోజుల తరబడి తాజాగా, రసంతో నిండి ఉండాలంటే ఫ్రిజ్‌లో ఎలా పెట్టాలో తెలుసుకోండి..

సగం కోసిన నిమ్మకాయ ముక్కను ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
How To Store Half Cut Lemons In The Fridge
Krishna S
|

Updated on: Nov 08, 2026 | 2:03 PM

Share

నిమ్మకాయ మన రోజువారీ ఆహారంలో ముఖ్య భాగం. ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిలో కలుపుకోవడం మొదలుకుని.. లెమన్ టీ, నిమ్మకాయ పులిహోర, సలాడ్లు, కూరల్లో రుచి కోసం నిమ్మరసాన్ని విరివిగా వాడుతుంటారు. అయితే నిమ్మకాయను వాడే క్రమంలో చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్య.. సగం ముక్క మిగిలిపోవడం. అలా మిగిలిన సగం నిమ్మకాయను చాలామంది నేరుగా ఫ్రిజ్‌లో ఒక మూలన పెట్టేస్తుంటారు. కానీ మరుసటి రోజు చూసేసరికి అది పూర్తిగా ఎండిపోయి, పైభాగం గట్టిపడి, రసం పిండటానికి కూడా రాకుండా నిరుపయోగంగా మారుతుంది. ఈ చిన్న కిచెన్ సమస్యకు పరిష్కారంగా వంటింట్లో ఉండే వస్తువులతోనే నిమ్మకాయను ఎక్కువ రోజులు తాజాగా ఉంచే అద్భుతమైన చిట్కాలు అందుబాటులో ఉన్నాయి.

ఫ్రిజ్‌లో పెట్టినా నిమ్మకాయ ఎందుకు ఎండిపోతుంది?

నిమ్మకాయను కోసిన వెంటనే దాని లోపలి గుజ్జు భాగం నేరుగా గాలికి గురవుతుంది. రిఫ్రిజిరేటర్‌లో ఉండే చల్లని, పొడి గాలి నిమ్మకాయలోని సహజ తేమను వేగంగా పీల్చేస్తుంది. దీనివల్ల కోసిన భాగం క్రమంగా గట్టిగా మారిపోతుంది. అంతేకాకుండా ఫ్రిజ్‌లో నిల్వ ఉంచే ఉల్లిపాయలు, వెల్లుల్లి, మసాలా కూరల ఘాటైన వాసనలను కోసిన నిమ్మకాయ సులభంగా పీల్చుకుంటుంది. ఫలితంగా నిమ్మకాయ తన సహజ సువాసనను, నాణ్యతను కోల్పోతుంది.

అల్యూమినియం ఫాయిల్ మ్యాజిక్

సగం నిమ్మచెక్క మిగిలిపోతే దాన్ని పారేయకుండా, ఎండిపోకుండా కాపాడటానికి ఇంట్లో ఉండే అల్యూమినియం ఫాయిల్ చక్కగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయ కోసిన భాగాన్ని అల్యూమినియం ఫాయిల్ పేపర్‌తో పూర్తిగా, గట్టిగా కప్పేయాలి. ఇలా చుట్టడం వల్ల ఫ్రిజ్‌లోని పొడి గాలి నిమ్మ గుజ్జుకు నేరుగా తగలకుండా అడ్డుకట్ట పడుతుంది. ఫ్రిజ్‌లోని ఇతర పదార్థాల ఘాటైన వాసనలు నిమ్మకాయలోకి చేరకుండా రక్షణ లభిస్తుంది. ఈ పద్ధతి వల్ల నిమ్మకాయలోని రసం, తేమ ఆవిరి కాకుండా ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటాయి.

మరికొన్ని చిట్కాలు..

ఎయిర్‌టైట్ కంటైనర్: అల్యూమినియం ఫాయిల్ అందుబాటులో లేకపోతే, ఏదైనా చిన్న గాలి చొరబడని డబ్బాను ఎంచుకోవాలి. అందులో సగం కోసిన నిమ్మచెక్కను కోసిన భాగం కిందికి ఉండేలా బోర్లించి, మూత గట్టిగా పెట్టి ఫ్రిజ్‌లో భద్రపరచాలి.

సిలికాన్ కవర్లు: మార్కెట్లో లభించే రీయూజబుల్ సిలికాన్ ఫుడ్ కవర్లను కోసిన నిమ్మకాయపై గట్టిగా అమర్చి ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. వీటిని శుభ్రం చేసి మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు.

ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే వంటింట్లో సగం కోసిన నిమ్మకాయలు వృథా కాకుండా, ఎప్పుడు కావాలన్నా తాజా రసాన్ని సులభంగా పిండుకోవచ్చు.

Follow Us
సగం కోసిన నిమ్మకాయ ముక్కను ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
సగం కోసిన నిమ్మకాయ ముక్కను ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
ఓటీటీలోకి వస్తున్న రియల్ స్టోరీ..
ఓటీటీలోకి వస్తున్న రియల్ స్టోరీ..
మనవరాలి కోసం 90 ఏళ్ల బామ్మ ఆరాటం.. అండగా నిలిచిన సోనూసూద్..వీడియో
మనవరాలి కోసం 90 ఏళ్ల బామ్మ ఆరాటం.. అండగా నిలిచిన సోనూసూద్..వీడియో
7 వికెట్లు పడినా భారత్ ఎలా గెలిచింది.. డీఎల్‌ఎస్ పూర్తి లెక్క ఇదే
7 వికెట్లు పడినా భారత్ ఎలా గెలిచింది.. డీఎల్‌ఎస్ పూర్తి లెక్క ఇదే
తుపాకీ నక్సలిజం అంతమైంది.. ఇక మానసిక నక్సలైట్లను ఓడించాలి..
తుపాకీ నక్సలిజం అంతమైంది.. ఇక మానసిక నక్సలైట్లను ఓడించాలి..
10 గ్రాముల బంగారం కొంటే 9 గ్రాములే వస్తాయా? ఈ లెక్కలు తెలుసా?
10 గ్రాముల బంగారం కొంటే 9 గ్రాములే వస్తాయా? ఈ లెక్కలు తెలుసా?
2 సార్లు విడాకులు.. బడా వ్యాపారవేత్తతో పెళ్లి.. కట్ చేస్తే..
2 సార్లు విడాకులు.. బడా వ్యాపారవేత్తతో పెళ్లి.. కట్ చేస్తే..
హార్దిక్ లేదా శ్రేయస్.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఎవరు..?
హార్దిక్ లేదా శ్రేయస్.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఎవరు..?
దీపావళి రాశిఫలాలు.. కష్టాలు ఎదుర్కునే రాశులివే!
దీపావళి రాశిఫలాలు.. కష్టాలు ఎదుర్కునే రాశులివే!
దీపావళి పూజ చేస్తున్నారా? ఇంట్లో గంటను ఎప్పుడు మోగించాలంటే
దీపావళి పూజ చేస్తున్నారా? ఇంట్లో గంటను ఎప్పుడు మోగించాలంటే