ఉదయం లేవగానే బ్రష్ చేయకుండా నీళ్లు తాగుతున్నారా?

08 November 2026

TV9 Telugu

TV9 Telugu

సాధారణంగా చాలామందికి ఉదయం లేవగానే నీళ్లు తాగడం అలవాటు. ఉదయాన్నే నీళ్లు తాగే అలవాటు మంచిది కూడా

TV9 Telugu

అయితే కొంతమంది బ్రష్ చేసి నీళ్లు తాగితే.. కొంతమంది మాత్రం బ్రష్ చేయకుండానే తాగుతారు. అయితే ఇలా బ్రష్ చేయకుండా నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు

TV9 Telugu

సాధారణంగా రాత్రికి పడుకుని ఉదయం లేచేసరికి నోటి నిండా బ్యాక్టీరియా ఫామ్‌ అవుతుంది. పళ్లపై, నాలుకపై సూక్ష్మ క్రిములు పేరుకుపోతాయి

TV9 Telugu

కాబట్టి లేవగానే నోరు శుభ్రం చేసుకోకుండా నీళ్లు తాగితే.. నీళ్లతోపాటు క్రిములు కూడా శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల అనేక వ్యాధులు వస్తాయి

TV9 Telugu

పళ్లు కూడా దెబ్బతింటాయి. అయితే పల్లు తోముకుని పరగడుపున నీటిని తాగవచ్చని నిపుణులు చెబుతున్నారు

TV9 Telugu

పరగడుపున ఒక గ్లాస్ లేదా రెండు గ్లాసుల నీళ్లు తాగడంవల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని, దానివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావట

TV9 Telugu

ఉదయం లేవగానే బ్రష్ చేసుకుని నీళ్లు తాగడంవల్ల శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో ఉన్న టాక్సిన్స్, మలిన పదార్థాలు బయటకు పోతాయి

TV9 Telugu

మల బద్ధకం, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తవు. శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే చర్మ సమస్యలు పోయి ఆరోగ్యంగా ఉంటుంది