AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మమ్మల స్టైల్‌లో వంకాయ ఊరగాయ పచ్చడి.. ఇలా పెడితే అదిరిపోద్దీ

చాలా మందికి ఊరగాయ పచ్చళ్లు తినడం అంతగా ఇష్టం ఉండదు. కానీ కూరగాయలతో చేసే ఏ చట్నీ అయినా సరే చాలా ఇష్టంగా తింటారు. అయితే ఇప్పుడు మనం వెరైటీగా వంకాయలతో ఊరగాయ చట్నీ పెడితే ఎలా ఉంటుంది. దీనిని ఇంట్లోనే సులభంగా ఎలా పెట్టుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Nov 08, 2026 | 11:30 AM

Share
కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. వంకాయలు: 1/2 kg,  చింతపండు: 100 గ్రాములు,   మెంతులు: 1 టీస్పూన్,   ఆవాలు: 1 టీస్పూన్ (వేయించడానికి) + 1 టీస్పూన్,   జీలకర్ర: 1 టీస్పూన్,   కారం: 100 గ్రాములు, ఉప్పు: 50 గ్రాములు,   పసుపు: 1/2 టీస్పూన్, నూనె: 1 కప్పు,   ఎండుమిరపకాయలు,   వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు, ఇంగువ

1 / 5
తయారీలోకి వెళ్లితే..  ముందుగా అర కిలో వంకాయలను శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో తడి లేకుండా బాగా తుడవాలి. తడి ఉంటే పచ్చడి పాడవుతుంది. తుడిచిన వంకాయలను ఫ్యాన్ కింద 15 నిమిషాలు ఆరనివ్వాలి. పూర్తిగా ఆరిన తర్వాత, వంకాయ తొడిమలను కొద్దిగా తీసి, గుత్తి వంకాయకు కట్ చేసినట్లుగా లేదా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్‌లో చింత పండు నానబెట్టాలి. . ఇప్పుడు స్ట ఆన్ చేసి పైన ఒక పాన్ పెట్టి, అందులో ఒక టీస్పూన్ మెంతులు, ఒక టీస్పూన్ ఆవాలు, ఒక టీస్పూన్ జీలకర్ర వేసి, మంటను తక్కువ మంటలో పెట్టి దోరగా ఎర్రగా వేయించుకోవాలి.  చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలి.

2 / 5
తర్వాత స్టవ్ ఆన్ మరొక పాన్ పెట్టి, చింత పండు గుజ్జు, స్పూన్ నూనె వేసి ఉడికించుకోవాలి.  మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. గుజ్జు బాగా చిక్కబడి, నూనె పైకి తేలేంత వరకు ఉడికించాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, గుజ్జును పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు వంకాయలను వేయించుకోవాలి.  అదే పాన్‌లో ఒక కప్పు నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత, కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసి, మంటను మధ్యస్థ మంటలో పెట్టి, వంకాయలు మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. వేగిన వంకాయలను తీసి ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకోవాలి.

3 / 5
ఇప్పుడు  వంకాయలు వేయించిన తర్వాత మిగిలిన నూనెలోనే ఒక టీస్పూన్ ఆవాలు, ఒక టీస్పూన్ జీలకర్ర వేయాలి. ఆవాలు చిటపటలాడగానే స్టవ్ ఆఫ్ చేయాలి. మిగిలిన వేడికి పోపు వేగుతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత తుంచి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు వేసి కలపాలి. ఇంగువ ఇష్టపడే వారు ఈ దశలో వేసుకోవచ్చు. ఈ పోపును కూడా పూర్తిగా చల్లారనివ్వాలి.

4 / 5
 పోపు, చింతపండు గుజ్జు రెండూ పూర్తిగా చల్లారిన తర్వాత, పోపు గిన్నెలో చింతపండు గుజ్జును వేయాలి. అందులో 1/2 టీస్పూన్ పసుపు, ముందుగా తయారు చేసుకున్న ఆవపిండి,మెంతిపిండి పొడి, 100 గ్రాముల కారం, 50 గ్రాముల ఉప్పు వేసి బాగా కలపాలి. ఉప్పు సరిపోకపోతే తర్వాత కలుపుకోవచ్చు, మొదట తక్కువ వేయడం మంచిది. చివరగా, వేయించిన వంకాయ ముక్కలను ఈ మిశ్రమంలో వేసి, వంకాయలు చిదరకుండా చేతితో నిదానంగా కలుపుకోవాలి. వంకాయల లోపలికి కూడా గుజ్జు వెళ్లేలా జాగ్రత్తగా కలపాలి.  అంతే వంకాయ పచ్చడి రెడీ.

5 / 5
Follow Us
అమ్మమ్మల స్టైల్‌లో వంకాయ ఊరగాయ పచ్చడి.. ఇలా పెడితే అదిరిపోద్దీ
అమ్మమ్మల స్టైల్‌లో వంకాయ ఊరగాయ పచ్చడి.. ఇలా పెడితే అదిరిపోద్దీ
ఇంట్లో కూరగాయలు లేవా? 5 నిమిషాల్లో ఈ పచ్చిమిర్చి పచ్చడి చేయండి

ఈ స్టేషన్‌ నుంచి ప్రయాణించాలంటే వీసా, పాస్‌పోర్ట్‌ ఉండాల్సిందే

కోహ్లీపైకి బ్యాట్ విసిరిన అభిమాని.. ఆ తర్వాత జరిగింది ఇదే..!

దొంగకు ప్రయాణికుల అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్..!

CAT 2026 హాల్‌టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

ముచ్చింతల్‌లో అంగరంగ వైభవంగా యతీంద్ర సప్తతి మహోత్సవాలు..

'రామాయణ'లో లక్ష్మణుడి పాత్ర మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరంటే?

బస్తర్‌కు పయనమైన ప్రధాని.. జవాన్లతో మోదీ దీపావళి

ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఏడ్చేశాడు..