AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: తుపాకీ నక్సలిజం అంతమైంది.. ఇక మానసిక నక్సలైట్లను ఓడించాలి.. జవాన్లతో మోదీ దీపావళి వేడుకలు

ఒకప్పుడు తుపాకీ తూటాలతో దద్దరిల్లిన బస్తర్ గడ్డపై ఈసారి దీపాల పండుగ కాంతులు వెల్లివిరిశాయి. భద్రతా బలగాల సమక్షంలో దీపావళి వేడుకలు జరుపుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. నక్సలిజం రహితంగా దేశం జరుపుకుంటున్న తొలి పండుగ ఇదేనంటూ కీలక ప్రకటన చేశారు. అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ.. ‘‘తుపాకీ పట్టిన నక్సలిజం పోయింది సరే, సమాజంలో విషం చిమ్ముతున్న మానసిక నక్సలైట్లను కూడా ఖచ్చితంగా ఓడించాలి అంటూ పిలుపునిచ్చారు.

PM Modi: తుపాకీ నక్సలిజం అంతమైంది.. ఇక మానసిక నక్సలైట్లను ఓడించాలి.. జవాన్లతో మోదీ దీపావళి వేడుకలు
Pm Modi Bastar Diwali Celebration
Krishna S
|

Updated on: Nov 08, 2026 | 1:39 PM

Share

ఛత్తీస్‌గఢ్‌లోని సమస్యాత్మక ప్రాంతమైన బస్తర్‌లో భారత వీర జవాన్ల నడుమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా జవాన్లకు స్వీట్లు తినిపించారు. సరిహద్దుల్లో, అంతర్గత భద్రతలో ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని కాపాడుతున్న భద్రతా బలగాల సమక్షంలో పండుగ జరుపుకోవడం తనకు ఎంతో గర్వకారణమని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా నక్సలిజం నిర్మూలనలో సైనికులు సాధించిన చారిత్రక విజయాన్ని కొనియాడుతూనే, సమాజంలో తిష్టవేసిన మానసిక నక్సలైట్లపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బస్తర్‌లో విధులు నిర్వర్తిస్తున్న సైనికులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. ‘‘ ధైర్యవంతులైన సైనికులతో గడిపే ప్రతి దీపావళి నాకు చిరస్మరణీయం. ఈసారి మీ అందరితో కలిసి పండుగ చేసుకునేందుకు నేను బస్తర్ నేలకు వచ్చాను. ఒకప్పుడు నక్సలైట్ల భీభత్సానికి గురైన ఈ ప్రాంతంలో.. నేడు మీ త్యాగాలు, అచంచలమైన అంకితభావం వల్ల నక్సలిజం అంతమై, నూతన అభివృద్ధి తరంగం ప్రారంభమైంది. దేశం పూర్తిగా నక్సలిజం రహితంగా జరుపుకుంటున్న తొలి దీపావళి ఇదే’’ అని స్పష్టం చేశారు.

అమరవీరుల త్యాగాలకు దేశం సదా రుణపడి ఉంటుంది

దేశ అంతర్గత భద్రతను కాపాడే క్రమంలో ప్రాణాలర్పించిన అమరవీరులకు ప్రధాని ఘన నివాళులర్పించారు. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ, ఐఆర్బీతో పాటు రాష్ట్ర పోలీసు సిబ్బంది చేసిన త్యాగాలకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు. ఈ పోరాటంలో ప్రత్యేకించి బస్తర్ ఫైటర్స్ వంటి యూనిట్లకు చెందిన కమాండోలు, మహిళా సైనికులు కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. ఒకప్పుడు దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లోని దాదాపు 230కి పైగా జిల్లాలు నక్సలిజం కోరల్లో చిక్కుకుని, సాయంత్రం కాగానే జనజీవనం స్తంభించిపోయేదని, ప్రజలు ఓటు హక్కును సైతం వినియోగించుకోలేని దుస్థితి ఉండేదని గుర్తుచేశారు. ఆ క్లిష్ట పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని, దేశాన్ని సైనికులే గట్టెక్కించారని కొనియాడారు.

మానసిక నక్సలైట్లను కూడా ఓడించాలి

తుపాకీ పట్టిన నక్సలిజం క్షేత్రస్థాయిలో నిర్మూలించబడినప్పటికీ, సమాజంలో విద్వేషాలను రగిల్చే మానసిక నక్సలైట్లు ఇంకా మిగిలే ఉన్నారని ప్రధాని మోదీ హెచ్చరించారు. అమాయక ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నారని, అలాంటి మానసిక నక్సలైట్లను కూడా మనం ఏకతాటిపై నిలిచి ఓడించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

సైనికులే నా కుటుంబం

దీపావళి పండుగ నాడు ప్రజలంతా తమ కుటుంబ సభ్యులతో గడపడానికి ఇళ్లకు చేరుకుంటారని, తనకు మాత్రం దేశాన్ని కాపాడే సైనికులే కుటుంబమంటూ ప్రధాని భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘మాతృభూమి రక్షణ కోసం నిలబడిన ఈ వీర పుత్రులు, పుత్రికలైన మీరందరూ నా కుటుంబ సభ్యులు. అందుకే మీ మధ్యకు పండుగ జరుపుకోవడానికి వచ్చాను’’ అని మోదీ అన్నారు.

12 ఏళ్లలో పేదరికంపై చారిత్రక విజయం

గత 12 ఏళ్ల పాలనలో దేశం సాధించిన ప్రగతిని ప్రధాని వివరించారు. శాంతిభద్రతలు మెరుగుపడినప్పుడే అభివృద్ధి ఫలాలు పేదలకు అందుతాయని చెప్పారు. ‘‘గత 12 ఏళ్లలో నక్సలిజం, వేర్పాటువాదంపైనే కాకుండా పేదరికంపై కూడా దేశం చారిత్రక యుద్ధాన్ని గెలిచింది. ఇటీవల ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించినట్లుగా, గత 12 ఏళ్ల కాలంలో భారతదేశంలో ఏకంగా 50 కోట్ల మంది తీవ్ర పేదరికం నుంచి విముక్తి పొందారు. దశాబ్దాల తరబడి గరీబీ హటావో నినాదాలతో సాధించలేని అద్భుతాన్ని దేశం కేవలం 12 ఏళ్లలోనే చేసి చూపించింది’’ అని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. భద్రతా బలగాల పహారా వల్లే దేశంలో శాంతి, వికాసం సాధ్యమయ్యాయని ఆయన స్పష్టం చేశారు.

Follow Us
తుపాకీ నక్సలిజం అంతమైంది.. ఇక మానసిక నక్సలైట్లను ఓడించాలి..
తుపాకీ నక్సలిజం అంతమైంది.. ఇక మానసిక నక్సలైట్లను ఓడించాలి..
10 గ్రాముల బంగారం కొంటే 9 గ్రాములే వస్తాయా? ఈ లెక్కలు తెలుసా?
10 గ్రాముల బంగారం కొంటే 9 గ్రాములే వస్తాయా? ఈ లెక్కలు తెలుసా?
2 సార్లు విడాకులు.. బడా వ్యాపారవేత్తతో పెళ్లి.. కట్ చేస్తే..
2 సార్లు విడాకులు.. బడా వ్యాపారవేత్తతో పెళ్లి.. కట్ చేస్తే..
హార్దిక్ లేదా శ్రేయస్.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఎవరు..?
హార్దిక్ లేదా శ్రేయస్.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఎవరు..?
దీపావళి రాశిఫలాలు.. కష్టాలు ఎదుర్కునే రాశులివే!
దీపావళి రాశిఫలాలు.. కష్టాలు ఎదుర్కునే రాశులివే!
దీపావళి పూజ చేస్తున్నారా? ఇంట్లో గంటను ఎప్పుడు మోగించాలంటే
దీపావళి పూజ చేస్తున్నారా? ఇంట్లో గంటను ఎప్పుడు మోగించాలంటే
కమిన్స్‌కు కావ్య మారన్ షాక్.. హైదరాబాద్ నుంచి ఆ 8 మంది ఔట్?
కమిన్స్‌కు కావ్య మారన్ షాక్.. హైదరాబాద్ నుంచి ఆ 8 మంది ఔట్?
సుధీర్, వర్షిణీ సేఫ్.. బిగ్ బాస్10 ఎలిమినేషన్ లో ఊహించని ట్విస్ట్
సుధీర్, వర్షిణీ సేఫ్.. బిగ్ బాస్10 ఎలిమినేషన్ లో ఊహించని ట్విస్ట్
ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య.. కారణం ఏంటంటే..!
ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య.. కారణం ఏంటంటే..!
దీపావళీ బరిలో సూర్య సెన్సేషన్.. సీన్ సినిమాతో రికార్డులు..
దీపావళీ బరిలో సూర్య సెన్సేషన్.. సీన్ సినిమాతో రికార్డులు..