Food Labels: ప్యాకింగ్ ఫుడ్స్ కొనేటప్పుడు ఇవి చెక్ చేయకపోతే.. మీ హెల్త్ షెడ్డుకే..!
సూపర్ మార్కెట్‌కి వెళ్లినప్పుడు అక్కడ ఎన్నో రకాల గ్రాసరీ ఐటమ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ కనిపిస్తాయి. ప్యాకెట్‌పై ఉండే కవర్, బ్రాండ్ నేమ్ చూసి నచ్చితే కొనేస్తూ ఉంటారు చాలామంది. కానీ ఆ ప్యాకెట్ వెనుక రాసి ఉండే ఇంగ్రెడియంట్స్ లిస్ట్ మాత్రం ఎవ్వరూ చదవరు. అలా చదవకపోవడం వల్ల చాలా అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నారు. అసలు ప్యాక్డ్ ఫుడ్స్ కొనేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

ఏదైనా ప్యాక్డ్ ఫుడ్ కొనేముందు ప్యాకెట్ మీద ఉన్న ఇంగ్రెడియంట్స్ లిస్ట్ పూర్తిగా చదవాలి అని డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రతి ప్యాక్డ్ ఫుడ్ మీద అందులో ఉండే పదార్దాలు, కెమికల్స్ ఇతర సప్లిమెంట్స్ గురించి స్పష్టంగా రాసి ఉంటుంది. ఇంగ్రెడియంట్స్ లిస్ట్ పూర్తిగా చదివినప్పుడే అది అవసరమా కాదా? అనేది తెలుస్తుంది. అలాగే ఇంగ్రెడియంట్స్ లిస్ట్ ద్వారా ఆ ఫుడ్ లో కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ వంటివి ఉన్నాయా? అనే విషయాలు కూడా తెలుసుకోవచ్చు. అసలు లేబుల్స్ ఎలా చదవాలంటే..
నెంబర్స్ ఉంటే..
ఇంగ్రెడియంట్ పేరు చివర నెంబర్స్ ఉంటే ఆ పదార్థం కెమికల్ అని అర్ధం. అలాంటప్పుడు కెమికల్స్‌కి బదులు ఆర్గానిక్ పదార్థాలు ఎక్కువగా ఉండే ఫుడ్‌ను ఎంచుకోవాలి. ఉదాహరణకు ఆర్గానిక్ కోకోనట్ షుగర్, ఆర్గానిక్ పీనట్స్ అని రాసి ఉంటే అలాంటివి ఎంచుకోవడం మేలు. కెమికల్స్‌కి దూరంగా ఉంటేనే మంచిది.
ఆర్టిఫీషియల్ స్వీటెనర్స్
చాలా ప్యాక్డ్ ఫుడ్స్‌లో తీపి కోసం ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్స్‌ను వాడతారు. వీటి వల్ల డయేరియాతో పాటు బ్రెయిన్ సమస్యలు కూడా వచ్చే ప్రమాదముంది. అందుకే ఏదైనా కొనే ముందు ఇంగ్రెడియంట్స్‌లో ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్ అని ఉంటే దాన్ని పక్కకు పెట్టడమే మంచిది.
జెనెటిక్ మోడిఫైడ్
చాలారకాల ప్యాక్డ్ ఫుడ్స్‌లో ఫుడ్ పరిమాణాన్ని పెంచడానికి కొన్ని ఫిల్లర్స్‌ని వాడతారు. ఇవి షుగర్ పేషెంట్లకు చాలా ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది.అందుకే కొనేముందు ఇంగ్రెడియంట్స్ కింద ‘ప్రొడ్యూస్డ్ విత్ జెనెటిక్ ఇంజనీరింగ్’ లేదా ‘జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ (జియంఓ)’ అని ఉంటే మాత్రం దాన్ని కొనకపోవడమే మంచిది. దానికి బదులు ‘ఆర్గానిక్’ , ‘నాన్ జియంఓ లేబుల్స్’ ఉంటే అవి మంచివని అర్థం.
న్యూట్రిషన్ టేబుల్ కూడా..
వీటితో పాటు మరో ముఖ్యమైంది న్యూట్రిషన్ టేబుల్. న్యూట్రిషన్ టేబుల్‌ని కూడా పూర్తిగా చదవాలి. ప్రొడక్ట్‌లో ఉన్న కార్బోహైడ్రేట్స్, షుగర్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, కొలెస్ట్రాల్, ఫైబర్ వంటివి ఎంతెంత శాతం ఉన్నాయో ఆ పట్టిక చూపుతుంది. దాన్ని బట్టి ఎవరికి ఏది అవసరమో నిర్థారించుకోవచ్చు. ఉదాహరణకు షుగర్ పేషేంట్స్.. లో షుగర్ కంటెంట్ తీసుకోవాలి. ఆ పట్టికని బట్టి ఏది బెటర్ అనేది నిర్ణయించుకోవచ్చు.
NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్య రీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




