AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vegetable Cleaning Hacks: కూరగాయలపై ఉండే రసాయనాలను ఎలా తొలగించాలి..?

రోజూ మనం తీసుకునే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను శుభ్రంగా ఉంచడం ఆరోగ్య పరిరక్షణకు చాలా అవసరం. వాటిపై ఉండే మట్టి, పురుగుమందులు శరీరానికి హానికరం కావచ్చు. సహజ పదార్థాలతో వాటిని ఎలా సురక్షితంగా శుభ్రం చేయాలో తెలుసుకోవడం, అనుసరించడం ద్వారా అనారోగ్యాన్ని నివారించవచ్చు.

Vegetable Cleaning Hacks: కూరగాయలపై ఉండే రసాయనాలను ఎలా తొలగించాలి..?
Vegetables
Prashanthi V
|

Updated on: Jun 30, 2025 | 5:26 PM

Share

మన ఆహారంలో నిత్యం వాడే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. పొలాల్లో వాడే పురుగుమందులు, మట్టి, ఇతర మలినాలు వాటిపై చేరి మన ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. వీటిని సరిగ్గా శుభ్రం చేయకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలను ఎలా సమర్థవంతంగా శుభ్రం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆకుకూరల శుభ్రత

కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరలకు సాధారణంగా పొలాల్లో పురుగు మందులు ఎక్కువగా స్ప్రే చేస్తారు. వీటిని శుభ్రం చేయడానికి ముందుగా.. ఒక లీటరు నీటిలో రెండు చెంచాల వెనిగర్ లేదా అరచెంచా పసుపు కలిపి ఒక ద్రావణాన్ని తయారు చేయండి. ఈ ద్రావణంలో ఆకుకూరలను 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత సాదా నీటితో బాగా కడిగి పూర్తిగా ఆరబెట్టాలి. అనంతరం టిష్యూ లేదా కాటన్ బట్టతో చుట్టి డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌ లో నిల్వ చేసుకోవచ్చు.

దోసకాయ, బొప్పాయి, బెండకాయ

దోసకాయ, బొప్పాయి, బెండకాయ లాంటి కూరగాయలకు పొరలు ఎక్కువగా ఉండటం వల్ల మలినాలు సులభంగా అంటుకుంటాయి. వీటిని శుభ్రం చేయడానికి ముందుగా డిష్ బ్రష్ లేదా మెత్తని బ్రష్‌ తో మృదువుగా రుద్దాలి. ఆ తర్వాత చాలా సార్లు నీటితో కడగాలి. అనంతరం పసుపు, ఉప్పు కలిపిన నీటిలో 10 నిమిషాల పాటు నానబెట్టి.. చివరగా మిగిలిన తేమను కాటన్ బట్టతో తుడిచి నిల్వ చేసుకోవాలి.

టమోటా, పచ్చిమిర్చి, బీన్స్

టమోటా, పచ్చిమిర్చి, బీన్స్ వంటి కూరగాయలు తేలికగా పాడయ్యేవి కాబట్టి వాటిని శుభ్రంగా నిల్వ చేయడం చాలా ముఖ్యం. వాడకానికి ముందు వాటిని వెనిగర్ లేదా పసుపు ద్రావణంలో 10 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత శుభ్రంగా కడగాలి. పూర్తిగా ఆరబెట్టిన తర్వాత గాలి తగిలే డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

క్యారెట్, బీట్‌ రూట్, ముల్లంగి

క్యారెట్, బీట్‌ రూట్, ముల్లంగి వంటివి నేలలో పెరుగుతాయి కాబట్టి వాటికి మట్టితో పాటు రసాయనాలు అంటుకునే అవకాశం ఉంటుంది. వీటిని శుభ్రం చేయడానికి ముందుగా వాటిని బాగా బ్రష్ చేసి కొన్ని సార్లు నీటితో కడగాలి. ఆ తర్వాత వెనిగర్ లేదా పసుపు ద్రావణంలో నానబెట్టి మళ్ళీ కడగాలి. తేమను పూర్తిగా తుడిచి కవర్‌ లో చుట్టి ఫ్రిజ్‌ లో నిల్వ చేయాలి.

గూస్బెర్రీ, అరటిపండ్లు

కొన్ని పండ్ల మీద వాక్సింగ్ లేదా పొడి రసాయనాలు పూస్తారు.. అవి తేలికగా కనిపించవు. ఉదాహరణకు గూస్బెర్రీ, అరటిపండ్లను శుభ్రం చేయడానికి ముందుగా మెత్తని స్క్రబ్ ప్యాడ్‌ తో మెల్లగా రుద్దండి. ఆ తర్వాత పసుపు లేదా వెనిగర్ నీటిలో నానబెట్టి శుభ్రం చేయండి. చివరిగా తేమను పూర్తిగా తీసేసి తడిగా ఉండకుండా చూసి నిల్వ చేయాలి.

బయటి నుంచి కొనే కూరగాయలు ఎంత ఆరోగ్యకరంగా కనిపించినా.. వాటిపై కనిపించని ప్రమాదాలు ఉండవచ్చు. పైన చెప్పిన పద్ధతులు చాలా తేలికైనవి.. ఆరోగ్య పరిరక్షణలో ఎంతో సహాయపడుతాయి.