Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mango Storage Tips: మామిడి ప్రియులకు అలర్ట్.. ఇలా నిల్వ చేశారంటే రుచి చెడకుండా ఏడాదంతా ఉంటాయ్‌!

కొన్నిసార్లు మార్కెట్ నుంచి చెట్టు నుంచి ఒకేసారి ఎక్కువ మామిడి పండ్లు తెచ్చుకుంటూ ఉంటాం. అటువంటి పరిస్థితిలో వాటిని సరిగ్గా నిల్వ చేయకపోతే కొన్ని రోజుల్లోనే అవి కుళ్ళిపోవడం ప్రారంభిస్తాయి. సరిగ్గా నిల్వ చేయకుంటే త్వరగా పాడైపోతాయి. దీంతో డబ్బును వృధా చేయడమే కాకుండా రుచి కూడా కోల్పోతాయి. అయితే మామిది కొనుగోలు చేసిన తర్వాత..

Mango Storage Tips: మామిడి ప్రియులకు అలర్ట్.. ఇలా నిల్వ చేశారంటే రుచి చెడకుండా ఏడాదంతా ఉంటాయ్‌!
Mangoes Storage Tips
Srilakshmi C
|

Updated on: Jul 04, 2025 | 8:47 PM

Share

వేసవి వచ్చిందంటే అందరి నోట ఒకే పేరు వినిపిస్తుంది.. అదే మామిడి పండ్లు. కానీ ఇవి ఏడాదంతా దొరకవు. ఒక్క వేసవి సీజన్‌లోనే మామిడి పండ్లు దొరుకుతాయి. మరో సమస్య ఏంటంటే.. వీటిని కొన్న తర్వాత పట్టుమని వారం రోజులు కూడా నిల్వ చేయలేం.. వెంటనే పాడైపోతాయి. కొన్నిసార్లు మార్కెట్ నుంచి చెట్టు నుంచి ఒకేసారి ఎక్కువ మామిడి పండ్లు తెచ్చుకుంటూ ఉంటాం. అటువంటి పరిస్థితిలో వాటిని సరిగ్గా నిల్వ చేయకపోతే కొన్ని రోజుల్లోనే అవి కుళ్ళిపోవడం ప్రారంభిస్తాయి. సరిగ్గా నిల్వ చేయకుంటే త్వరగా పాడైపోతాయి. దీంతో డబ్బును వృధా చేయడమే కాకుండా రుచి కూడా కోల్పోతాయి. అయితే మామిది కొనుగోలు చేసిన తర్వాత ఇంటికి తీసుకువచ్చాక ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి, వాటిని సరిగ్గా నిల్వ చేయడం చాలా ముఖ్యం. రుచి కోల్పోకుండా ఎక్కువ కాలం మామిడి పండ్లు నిల్వ ఉంచడానికి ఈ కింది చిట్కాలు పాటించండి..

పచ్చి, పండిన మామిడి పండ్లను విడిగా ఉంచాలి

పచ్చి, పండిన మామిడి పండ్లను ఎప్పుడూ కలిపి నిల్వ చేయకూడదు. పండిన మామిడికాయలు విడుదల చేసే వాయువు వల్ల పచ్చి మామిడికాయలు కూడా త్వరగా పక్వానికి వస్తాయి. దీనివల్ల అవి త్వరగా చెడిపోతాయి. పచ్చి మామిడికాయలను విడివిడిగా, కాగితం లేదా వార్తాపత్రికలో చుట్టి నిల్వ చేయాలి.

పేపర్ లేదా కాటన్ వస్త్రంలో చుట్టాలి

మామిడి పండ్లను నేరుగా ప్లాస్టిక్ సంచిలో నిల్వ చేయడం వల్ల అవి తేమగా మారుతాయి. దీంతో అవి త్వరగా కుళ్ళిపోతాయి. బదులుగా వాటిని వార్తాపత్రిక లేదా కాటన్ వస్త్రంలో చుట్టి పెట్టాలి. ఈ పద్ధతి మామిడి పండ్లను పొడిగా, తాజాగా ఉంచడానికి సహాయపడుతుంది. ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి కూడా.

ఇవి కూడా చదవండి

రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయొచ్చు

మామిడి పండ్లు పూర్తిగా పండిన తర్వాత, పాడైపోకుండా ఉండటానికి వాటిని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయాలి. వాటిని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడం వల్ల వాటి షెల్ఫ్ లైఫ్ 45 రోజుల వరకు పెరుగుతుంది. మామిడి పండ్లు ఎండిపోకుండా గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయాలి.

మామిడికాయ గుజ్జును తీసి నిల్వ చేయవచ్చు

మీ దగ్గర చాలా పండిన మామిడి పండ్లు ఉంటే, వాటిని తర్వాత ఉపయోగించాలని అనుకుంటే, వాటి గుజ్జును తీసి ఫ్రీజర్‌లో నిల్వ చేయవచ్చు. లేదంటే మామిడి పండ్లను కోసి ముక్కలను డీప్ ఫ్రీజ్ చేయవచ్చు. ఇలా చేస్తే ఏడాది పొడవునా మామిడి రుచులు ఆస్వాధించవచ్చు. అయితే వీటిని గాలి చొరబడని కంటైనర్, జిప్ లాక్ బ్యాగ్‌ వంటి వాటిని ఉపయోగించాలి.

చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి

మామిడి పండ్లను ఎక్కువ తేమ, వేడి ఉన్న ప్రదేశంలో ఉంచడం వల్ల అవి త్వరగా కుళ్ళిపోతాయి. ఎల్లప్పుడూ సరైన వెంటిలేషన్ ఉన్న, ఉష్ణోగ్రత సాధారణంగా లేదా కొద్దిగా చల్లగా ఉండే ప్రదేశంలో మామిడి పండ్లను నిల్వ చేయడానికి ప్రయత్నించాలి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.

హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో