AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జిడ్డుగా ఉన్న స్టవ్ ను ఇలా చిటికెలో క్లీన్ చేయండి.. కొత్తదానిలా మెరిసిపోతుంది..!

వంట చేసిన తర్వాత స్టవ్‌ పై పడే నూనె, పాలు, జిడ్డు మచ్చలు తొలగించడం చాలా మందికి కష్టంగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ కొన్ని సులువైన ఇంటి చిట్కాలు ఉన్నాయి. ఇవి పాటిస్తే స్టవ్ ఎప్పుడూ కొత్తదానిలా మెరిసిపోతుంది. స్క్రబ్బింగ్ కష్టాలు లేకుండా చక్కగా శుభ్రం చేయవచ్చు.

జిడ్డుగా ఉన్న స్టవ్ ను ఇలా చిటికెలో క్లీన్ చేయండి.. కొత్తదానిలా మెరిసిపోతుంది..!
Cleaning Gas Stove
Prashanthi V
|

Updated on: Jul 29, 2025 | 6:14 PM

Share

వంటలు ఎక్కువ చేసినప్పుడు స్టవ్‌పై నూనె మరకలు, పాలు పొంగిన మచ్చలు, జిడ్డు పేరుకుపోతుంటాయి. వాటిని శుభ్రం చెయ్యడం చాలా మందికి కష్టంగా అనిపిస్తుంటుంది. కొన్ని సార్లు బాగా రుద్దాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు అలాంటి కష్టం అవసరం లేదు. ఈ సులభమైన చిట్కాలతో జిడ్డు మరకలను తక్కువ టైంలోనే పోయేలా చేయొచ్చు.

గోధుమ పిండి

ముందుగా స్టవ్‌పై ఉన్న బర్నర్‌ లు తీసేయాలి. తర్వాత స్టవ్ పైన కొద్దిగా గోధుమ పిండి లేదా మైదా పిండి చల్లాలి. ఇప్పుడు ఒక మెత్తటి బట్టని తీసుకొని స్టవ్ మీద నెమ్మదిగా రుద్దాలి. ఇలా చేస్తే స్టవ్‌ కి అంటుకున్న నూనె జిడ్డు ఈజీగా పోతుంది. ఇది మొదటి చిట్కా. తర్వాత ఒక చిన్న గిన్నెలో ఒక స్పూన్ ఉప్పు, సగం నిమ్మరసం, కొద్దిగా డిష్ వాష్ లిక్విడ్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నిమ్మకాయ తొక్కతో స్టవ్‌పై రుద్దితే మిగిలిన మచ్చలు కూడా చక్కగా పోతాయి.

ఈనో పౌడర్

కొన్ని మచ్చలు గట్టిగా పట్టి మామూలుగా క్లీన్ చేస్తే పోవు. అలాంటి వాటికి ఈనో పౌడర్ నిమ్మరసం కలిపి వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఒక చిన్న గిన్నెలో ఈనో వేసి దాంట్లో కొద్దిగా నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని స్టవ్‌ పై మచ్చలున్న చోట వేసి 10 నిమిషాలు ఉంచాలి. తర్వాత స్క్రబ్ చేస్తే అవి బాగా పోతాయి. ఇలా వారానికి ఒకసారి చేస్తే స్టవ్ ఎప్పుడూ కొత్తదానిలా మెరిసిపోతుంది.

నిమ్మరసం

నిమ్మరసం వాడటం వల్ల స్టవ్‌కి మంచి వాసన వచ్చి వంటగదిలో శుభ్రత, ఫ్రెష్‌నెస్ ఉంటాయి. అంతేకాదు ఇది పురుగులను కూడా దూరంగా ఉంచుతుంది. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌ లో వేసుకొని వాడినా ఇంకా సులభంగా ఉంటుంది. ప్రతివారం లేదా పది రోజులకు ఒకసారి ఈ చిట్కా పాటిస్తే మీ స్టవ్ ఎప్పుడూ మెరిసిపోతూ ఉంటుంది. గ్లాస్ టాప్ స్టవ్ ఉన్నవాళ్లు శుభ్రం చేసిన తర్వాత కొద్దిగా విభూదిని చల్లి ఒక శుభ్రమైన బట్టతో తుడిచి పెడితే మరింత మెరుస్తుంది.

బర్నర్‌ ల శుభ్రత

స్టవ్ బర్నర్లను శుభ్రం చేయాలంటే వాటిని గోరువెచ్చని నీటిలో.. ఉప్పు, నిమ్మరసం, డిష్ వాష్ లిక్విడ్ కలిపిన మిశ్రమంలో అరగంట పాటు నానబెట్టాలి. తర్వాత వాటిని నీటితో బాగా కడిగి చిన్న సూది సహాయంతో బర్నర్లకు ఉన్న హోల్‌ లను శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ సరిగ్గా వచ్చి వంట వేగంగా అవుతుంది. గ్యాస్ వృథా కూడా కాదు. ఈ సులభమైన చిట్కాలను మీరు కూడా ఈజీగా పాటించొచ్చు.