Get Rid of Lice: తలపై ఒక్క పేను కూడా ఉండకూడదంటే.. నూనెలో ఈ పొడి కలపండి..

చాలా మంది పేల సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. తలపై పేలు ఉన్నాయంటే ఇతర పనులపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఎప్పుడూ దురద పెడుతూ ఉంటుంది. తలపైకి కూడా పేలు వస్తూ ఉంటాయి. ఇలా బయటకు వెళ్లినప్పుడు కూడా ఉంటే ఇతరుల ముందు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. తలంతా చికాకుగా ఉండటమే కాకుండా వాపు, చిన్న గడ్డలుగా కూడా ఏర్పతాయి. పేలు ఎక్కువగా ఉంటే జుట్టు కూడా రాలిపోతూ ఉంటుంది. శరీరంలో ఉండే రక్తాన్ని పేలు పీల్చుతూ..

Get Rid of Lice: తలపై ఒక్క పేను కూడా ఉండకూడదంటే.. నూనెలో ఈ పొడి కలపండి..
Get Rid Of Lice (1)
Follow us

|

Updated on: Sep 27, 2024 | 3:17 PM

చాలా మంది పేల సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. తలపై పేలు ఉన్నాయంటే ఇతర పనులపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఎప్పుడూ దురద పెడుతూ ఉంటుంది. తలపైకి కూడా పేలు వస్తూ ఉంటాయి. ఇలా బయటకు వెళ్లినప్పుడు కూడా ఉంటే ఇతరుల ముందు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. తలంతా చికాకుగా ఉండటమే కాకుండా వాపు, చిన్న గడ్డలుగా కూడా ఏర్పతాయి. పేలు ఎక్కువగా ఉంటే జుట్టు కూడా రాలిపోతూ ఉంటుంది. శరీరంలో ఉండే రక్తాన్ని పేలు పీల్చుతూ ఉంటాయి. దీని వల్ల రక్త హీనత సమస్య కూడా ఏర్పడుతుంది. ఈ పేలను ఎప్పటికప్పుడు వదిలించుకుంటూ ఉండాలి. ఇలా పేల సమస్యతో బాధ పడేవారు ఇప్పుడు చెప్పే కొన్ని రకాల చిట్కాలను ఫాలో చేస్తే ఎంతో ఎఫెక్టీవ్‌గా పని చేస్తాయి. మరి చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

సీతాఫలం గింజల పొడి:

పేల సమస్యతో ఇబ్బంది పడేవారికి సీతా ఫల గింజల పొడి ఎంతో చక్కగా సహాయ పడుతుంది. సీతా ఫల గింజల్ని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టి.. ఆ తర్వాత వీటిని కొట్టి పొడిలా చేసుకోవాలి. ఇందులో కొద్దిగా శనగ పిండి కలిపి.. పేస్టులా తయారు చేసి తలపై అప్లై చేయాలలి. ఇలా ఓ 20 నిమిషాలు ఉంచి.. ఆ తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే పేలు పోతాయి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

నిమ్మ – వెల్లుల్లి:

పేల సమస్యను తగ్గించడంలో నిమ్మ, వెల్లుల్లి ఎంతో చక్కగా పని చేస్తాయి. ఎందుకంటే వీటి నుంచి గాఢమైన వాసన వస్తుంది. ఈ వాసనకు పేలు చనిపోతాయి. ఓ రెండు లేదా మూడు వెల్లుల్లిని మెత్తగా దంచుకోవాలి. ఇందులో కొద్దిగా నిమ్మరసం కలిపి పేస్టులా చేసుకోవాలి. దీన్ని తలపై మొత్తం రాసి.. ఓ 15 నిమిషాలు అలానే వదిలేయాలి. ఆ తర్వాత షాంపైతో హెయిర్ వాష్ చేసుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే.. పేలు అనేవి ఉండవు.

ఇవి కూడా చదవండి

కర్పూరం:

కర్పూరంతో కూడా తలపై ఒక్క పేను కూడా లేకుండా చేసుకోవచ్చు. కొబ్బరి నూనెలో కర్పూరాన్ని పొడిలా చేసి కలుపుకోవాలి. దీని తలపై మొత్తం అప్లై చేయాలి. ఇలా రాత్రంతా ఉంచుకున్నా పర్వాలేదు. లేదంటే ఓ గంట లేదా రెండు గంటల తర్వాత షాంపూతో తల స్నానం చేస్తే పేలు మొత్తం పోతాయి. కర్పూరం నుంచి వచ్చే వాసనుకు పేలు రాలిపోతాయి. జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

తలపై ఒక్క పేను కూడా ఉండకూడదంటే.. నూనెలో ఈ పొడి కలపండి..
తలపై ఒక్క పేను కూడా ఉండకూడదంటే.. నూనెలో ఈ పొడి కలపండి..
దుర్గాదేవి ఏ ఆయుధాలను ధరిస్తుంది? ఎవరు ఏ ఆయుధాన్ని ఇచ్చారంటే
దుర్గాదేవి ఏ ఆయుధాలను ధరిస్తుంది? ఎవరు ఏ ఆయుధాన్ని ఇచ్చారంటే
ఎగ్ కుర్మా ఎప్పుడైనా ట్రై చేశారా.. తిన్నవాళ్లు ఫ్యాన్ అయిపోతారు..
ఎగ్ కుర్మా ఎప్పుడైనా ట్రై చేశారా.. తిన్నవాళ్లు ఫ్యాన్ అయిపోతారు..
జగన్‌ తిరుమల పర్యటన రద్దు.. కాసేపట్లో మీడియా ముందుకు..
జగన్‌ తిరుమల పర్యటన రద్దు.. కాసేపట్లో మీడియా ముందుకు..
కన్వీనర్ కోటా MBBS వెబ్‌ఆప్షన్లు ప్రారంభం.. ఈ నెల 29 వరకు అవకాశం
కన్వీనర్ కోటా MBBS వెబ్‌ఆప్షన్లు ప్రారంభం.. ఈ నెల 29 వరకు అవకాశం
గ్యాస్‌ సిలిండర్‌ ఎక్కువ రోజులు రావాలంటే ఈ ట్రిక్స్‌ పాటించండి!
గ్యాస్‌ సిలిండర్‌ ఎక్కువ రోజులు రావాలంటే ఈ ట్రిక్స్‌ పాటించండి!
వెల్లుల్లి కోడిగుడ్డు పచ్చడి ఇలా తిన్నారంటే.. అస్సలు వదిలిపెట్టరు
వెల్లుల్లి కోడిగుడ్డు పచ్చడి ఇలా తిన్నారంటే.. అస్సలు వదిలిపెట్టరు
గేట్‌ 2025 దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే
గేట్‌ 2025 దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే
ఈ ఫేస్ ప్యాక్స్‌ వేసుకుంటే ముఖంపై ఒక్క వెంట్రుక కూడా ఉండదు..
ఈ ఫేస్ ప్యాక్స్‌ వేసుకుంటే ముఖంపై ఒక్క వెంట్రుక కూడా ఉండదు..
అకాల మరణం పొందిన వ్యక్తులకు మోక్షాన్ని ఇచ్చే ప్రాంతం..
అకాల మరణం పొందిన వ్యక్తులకు మోక్షాన్ని ఇచ్చే ప్రాంతం..