Eye Glasses Cleaning: కళ్లద్దాలను శుభ్రం చేయడం ఎలా? ఈ టిప్స్ పాటించండి ఎప్పుడూ కొత్త అద్దాల్లానే కనిపిస్తాయి..

కళ్లద్దాలు ధరించే వారికి వాటిని శుభ్రం చేయడం ఎంత ముఖ్యమో తెలుస్తుంది. చాలా సార్లు మన అద్దాలు దుమ్ము, మట్టి లేదా నూనెతో తడిసి సరిగ్గా కనిపించవు. అటువంటి సమయంలో తరచుగా మనం చేసేది ఏదైనా వస్త్రాన్ని తీసుకొని దానితో అద్దాలు శుభ్రం చేస్తాం. అయితే అలా చేయడం సరికాదని నిపుణులు చెబుతున్నారు.

Eye Glasses Cleaning: కళ్లద్దాలను శుభ్రం చేయడం ఎలా? ఈ టిప్స్ పాటించండి ఎప్పుడూ కొత్త అద్దాల్లానే కనిపిస్తాయి..
Eyeglass Cleaner
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 22, 2023 | 12:45 PM

కళ్లద్దాలు.. ఈ రోజుల్లో అందరూ వాడుతున్నారు. కొందరు స్టైల్ కోసం వాటిని వాడుతుంటే.. మరికొందరూ కళ్ల సమస్యలతో వాడుతున్నారు. అయితే ఆ కళ్లద్దాలను శుభ్రం చేసే విషయంలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. దీని వల్ల వాటిపై గీతలు పడటం, త్వరగా మసకబారి పోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కళ్లద్దాలను సులభంగా శుభ్రం చేసుకునే విధానాల గురించి తెలుసుకుందాం..

చాలా ప్రాధాన్యం..

కళ్లద్దాలు ధరించే వారికి వాటిని శుభ్రం చేయడం ఎంత ముఖ్యమో తెలుస్తుంది. చాలా సార్లు మన అద్దాలు దుమ్ము, మట్టి లేదా నూనెతో తడిసి అద్దాలు సరిగ్గా కనిపించవు. అటువంటి సమయంలో తరచుగా మనం చేసేది ఏదైనా గుడ్డను తీసుకొని దానితో అద్దాలు శుభ్రం చేస్తాం. అయితే అలా చేయడం సరికాదని నిపుణులు చెబుతున్నారు. చాలా సార్లు గుడ్డతో శుభ్రం చేసినా అద్దాలు శుభ్రంగా మారవని.. ఆ గుడ్డలో కూడా ఉండే మురికి, మళ్లీ అద్దాలపై చేరుతుందని వివరిస్తున్నారు. అయితే కొన్ని చిట్కాలను ఉపయోగించి అద్దాలను శుభ్రం చేసుకోవచ్చు. ఆ చిట్కాలు ఇవి..

సబ్బు నీరు.. మీరు మీ అద్దాలను సబ్బు నీటితో కూడా శుభ్రం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మీ అద్దాలు నిమిషాల్లో శుభ్రం అవుతాయి. సబ్బు నీటిలో ఓ వస్త్రాన్ని తడిపి, ఆపై అద్దాలను శుభ్రం చేస్తే నూనె మరకలు కూడా పోతాయి.

ఇవి కూడా చదవండి

వైట్ వినిగర్.. దీని సహాయంతో మీ అద్దాలను సులభంగా శుభ్రం చేసుకోవచ్చు . ఒక గిన్నెలో నీరు, వైట్ వెనిగర్ వేసి బాగా కలపండి. ఆ తర్వాత ఓ బాటిల్ వేసుకొని దానిని అద్దాలపై స్ప్రే చేయండి. మీ అద్దాలు కొత్తవిలా మెరుస్తాయి. ఇలా మీ అద్దాలు మురికిగా ఉన్నప్పుడల్లా ఈ స్ప్రేతో మీ అద్దాలను శుభ్రం చేసుకోవచ్చు.

బేబీ వైప్స్.. ఇవి చాలా మృదువుగా ఉంటాయి. మీ అద్దాలపై దుమ్ము కూడా ఈ బేబీ వైప్స్ సహాయంతో శుభ్రం చేసుకోవచ్చు. మీరు ఎక్కడికి వెళ్లినా బేబీ వైప్‌లను తీసుకెళ్లవచ్చు. బేబీ వైప్స్‌తో శుభ్రం చేయడం సులభం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..