AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knee pain: మోకాళ్ల నొప్పులు తట్టుకోలేక పోతున్నారా? అయితే ఈ చికిత్సా విధానాలు ఓ సారి ట్రై చేయండి

ఇది మిమ్మల్ని కదలకుండా కట్టిపడేస్తుంది. అడుగేస్తే సలుపుతో చంపేస్తుంది. దీనివల్ల మీ మానసికంగా కూడా కుంగుబాటును అనుభవిస్తారు.ఈ నేపథ్యంలో ఈ మోకాళ్ల నొప్పులకు అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలపై కూడా అవగాహన అవసరం. అందుకే వైద్య నిపుణుల సూచనలతో మోకాళ్ల నొప్పి, వాపులకు ప్రాథమికంగా అందించే చికిత్స గురించి..

Knee pain: మోకాళ్ల నొప్పులు తట్టుకోలేక పోతున్నారా? అయితే ఈ చికిత్సా విధానాలు ఓ సారి ట్రై చేయండి
Knee Pain
Madhu
| Edited By: |

Updated on: Jan 22, 2023 | 12:47 PM

Share

మోకాళ్ల `నొప్పి.. ఒక్కసారి ప్రారంభం అయ్యిందంటే ఒక పట్టాన వదిలిపోదు. ముఖ్యంగా వయసు పెరుగుతున్న కొద్దీ మోకాళ్ల నొప్పులు బాధిస్తూ ఉంటాయి. ఈ నొప్పి దీర్ఘకాలికంగా ఉండే బాధాకరమైన పరిస్థతి. ఇది మిమ్మల్ని కదలకుండా కట్టిపడేస్తుంది. అడుగేస్తే సలుపుతో చంపేస్తుంది. దీనివల్ల మీ మానసికంగా కూడా కుంగుబాటును అనుభవిస్తారు. ఇక శీతాకాలంలో చలి వాతావరణంలో ఈ నొప్పి మరింత తీవ్రంగా ఉంటుంది. ఈ సమయంలో మోకాళ్ల నొప్పిని నియంత్రించడం కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ మోకాళ్ల నొప్పులకు అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలపై కూడా అవగాహన అవసరం. అందుకే వైద్య నిపుణుల సూచనలతో మోకాళ్ల నొప్పి, వాపులకు ప్రాథమికంగా అందించే చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

నాన్ శస్త్ర చికిత్సా విధానాలు..

నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్‌(NSAID).. ఈ మందులు సాధారణంగా మోకాలి నొప్పికి చికిత్స చేయడానికి వైద్యులు సూచించే మొదటి విధానం. ఇవి మోకాలి నొప్పిని తగ్గించడంతో పాటు అసౌకర్యాన్ని నిరోధిస్తాయి.

ఇంజెక్షన్లు.. మోకాలి అసౌకర్యానికి మరొక ప్రభావవంతమైన చికిత్స ఇంజెక్షన్ థెరపీ. ఇంజెక్షన్లలో తరచుగా స్టెరాయిడ్లు లేదా శోథ నిరోధక మందులు ఉంటాయి. ఇవి తాత్కాలికంగా నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. హైలురోనిక్ యాసిడ్, లూబ్రికెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు తరచుగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంజెక్షన్లలో కలిపి వినియోగిస్తారు.

ఇవి కూడా చదవండి

ప్లేట్‌లెట్-రిచ్ ప్లాస్మా (PRP).. కొంతకాలంగా, కీళ్ల సమస్యలు, క్రీడా గాయాలకు చికిత్స చేయడానికి ఈ సాంకేతికత విధానం బాగా వినియోగిస్తున్నారు. రోగి రక్తం నుంచే ప్లేట్‌లెట్ అధికంగా ఉండే ప్లాస్మాను తీసి గాయపడిన ప్రదేశంలోకి ఇంజెక్ట్ చేస్తారు. దీని ద్వారా నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

బ్రేసింగ్.. మోకాలికి బయట వైపు నుంచి పట్టును అందించేందుకు అమర్చేది మోకాలి బ్రేసెస్. ఇది మోకాలి కండరాలను బలోపేతం చేయడానికి, పట్టును పెంచడానికి అసౌకర్యం, వాపు నుండి ఉపశమనం పొందడానికి వీటిని వాడుతారు. ఇది నొప్పిని తగ్గించడంతో పాటు నడుస్తున్నా ఇబ్బంది లేకుండా చూస్తుంది.

ఫిజికల్ థెరపీ.. మోకాలి నొప్పికి చికిత్సగా ఫిజికల్ థెరపీని ఉపయోగించవచ్చు. ఫిజికల్ థెరపిస్ట్ ఆధ్వర్యంలో మోకాలి, దాని చుట్టుపక్కల కండరాలను బలోపేతం చేయడానికి కొన్ని వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. వివిధ రకాల స్ట్రెచ్‌లు ఇందులో ఉంటాయి. మసాజ్ థెరపీ కూడా ఉంటుంది. ఇది ప్రస్తుత కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతున్న చికిత్స.

జీవనశైలి మార్పులతో.. మీ మోకాళ్ల స్థితిని బట్టి, మీరు మీ బరువును తగ్గించుకోవాల్సి ఉంటుంది. అలాగే పరుగెత్తడం, అధిక బరువులతో వ్యాయామం చేయడం మానేయాలి. అలాగే నొప్పిని తగ్గించేందుకు కొన్ని ఆహార అలవాట్లలో కూడా మార్పులు చేసుకోవడం ఉత్తమం.

పలు శస్త్ర చికిత్సలు కూడా..

ఈ సాధారణ చికిత్సలతో నొప్పి అదుపులోకి రాకపోతే వైద్యులు కొన్ని శస్త్ర చికిత్సలు సూచిస్తారు. వాటిల్లో మొత్తం మోకాలి మార్పిడి శస్త్రచికిత్స, పాక్షిక మోకాలి మార్పిడి శస్త్రచికిత్స, ఆర్థ్రోస్కోపిక్ విధానాలు, ఆస్టియోటమీ వంటి శస్త్ర చికిత్సా విధానాలను అవలంభిస్తారు. అయితే మోకాలి నొప్పికి చికిత్స విధానాలు ఆ వ్యక్తి స్థితిని బట్టి మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఏ చికిత్స విధానంలో మీకు ఉత్తమమైన ఉపశమనం లభిస్తుందో ఆర్థోపెడిక్ నిపుణుల సూచనలను బట్టి నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!