AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Cooking Oil: బరువు తగ్గాలంటే ఏ నూనె వంటకు వాడాలి? నిపుణులు ఏం చెబుతున్నారంటే

ఊబకాయం సమస్యను నియంత్రించడానికి వంట కోసం ఉపయోగించే నూనె మొత్తాన్ని తగ్గించాలి. వంట నూనె కొనేటపుడు ఆరోగ్యానికి మేలు చేసే నూనెలను మాత్రమే కొనుగోలు చేయాలి. ఇది ఊబకాయాన్ని తగ్గించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు, ఆచరణాత్మక చర్య అవుతుంది. మన ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా, మన భవిష్యత్తును ఆరోగ్యంగా, వ్యాధి రహితంగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు..

Best Cooking Oil: బరువు తగ్గాలంటే ఏ నూనె వంటకు వాడాలి? నిపుణులు ఏం చెబుతున్నారంటే
నేటి కాలంలో తినే ఆహార పదార్థాలన్నీ కల్తీ మయం అవుతున్నాయి. అందువల్ల మార్కెట్లో ఆహార పదార్థాలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉంటే సరిపోదు.. మీ కిచెన్‌లో వినియోగించే వంట నూనె విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే నూనె కూడా కల్తీ అవుతోంది. కల్తీ వంట నూనెను ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరం. మరి మార్కెట్లో కొనుగోలు చేసే వంట నూనె యొక్క స్వచ్ఛతను ఎలా గుర్తించాలో ఇక్కడ తెలుసుకుందాం..
Srilakshmi C
|

Updated on: Feb 28, 2025 | 12:44 PM

Share

గత కొన్నేళ్లుగా దేశంలో ఊబకాయం సమస్య పెరగడం మరింత ఆందోళనకరంగా మారింది. ప్రతి యేట కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. ఊబకాయాన్ని అదుపులో ఉంచాలంటే ఆహారంలో నూనె వినియోగాన్ని తగ్గించడం నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వంట నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. అయితే మనం వంటలకు వినియోగించే అన్ని నూనెలు ఆరోగ్యానికి మేలు చేయవు. అయితే ఏ వంట నూనె మంచిది? వంట నూనెల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆహారంలో ఉపయోగించే నూనెను ఎంత పరిమాణంలో తీసుకోవాలి? వంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..

నేటి కాలంలో ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇటీవల కాలంలో ఊబకాయం కేసులు రెట్టింపు అయ్యాయి. ఇంకా ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. ఈ సమస్య పిల్లలలో నాలుగు రెట్లు పెరిగింది. అధిక బరువు లేదా ఊబకాయం ఉండటం వల్ల అనేక సమస్యలు, వ్యాధులు వస్తాయి. కాబట్టి ఊబకాయం సమస్యను తగిన స్థాయిలో నియంత్రించడానికి వంట కోసం ఉపయోగించే నూనెలపై తగిన శ్రద్ధ పెట్టాలి. వంట నూనె కొనేటపుడు ఆరోగ్యానికి మేలు చేసే వాటిని మాత్రమే జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ఇది ఊబకాయాన్ని తగ్గించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు. ఆచరణాత్మక చర్య అవుతుంది. మన ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా, మన భవిష్యత్తును ఆరోగ్యంగా, వ్యాధి రహితంగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

అవకాడో ఆయిల్, బాదం-సీడ్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ ఆరోగ్యానికి ఉత్తమమైనవి. వీటిలో మోనోఅన్‌శాచురేటెడ్, ఒలీక్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి బరువు తగ్గించడంలో సహాయపడతాయి. ఏ నూనె అయినా మితంగా తింటే ఆరోగ్యానికి మంచిది. అధిక నూనె తినడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు బదులుగా వివిధ ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. కార్డియాలజిస్టులు, డైటీషియన్లు, ఇతర ఆరోగ్య నిపుణులు చెబుతున్నదేంటంటే.. అనారోగ్యకరమైన నూనెలను అధికంగా తీసుకోవడం వల్ల అధిక బరువు, ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, అధిక రక్తపోటు, అసాధారణ లిపిడ్ స్థాయిలు, గుండెపోటు, స్ట్రోక్, కొన్ని క్యాన్సర్లు, అకాల మరణం వంటి ప్రమాదాలు పెరుగుతాయట. మన దేశంలో కూడా ఈ సమస్య పెరుగుతోంది. 2024లో ప్రచురించబడిన లాన్సెట్ అధ్యయనం ప్రకారం భారత్‌లో ఊబకాయం ప్రాబల్యం మహిళల్లో 1.2 శాతం నుంచి 9.8 శాతానికి, పురుషులలో 0.5 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగినట్లు వెల్లడించింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 ప్రకారం అఖిల భారత స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో ఊబకాయం గణనీయంగా పెరుగుతున్నట్లు నిర్ధారించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.