Jeera Water: జీలకర్ర నీళ్లు తాగితే అధిక బరువు సమస్యకు చెక్ పెట్టేయొచ్చని తెలుసా?
భారత్‌లో ప్రస్తుతం ప్రతి నలుగురిలో ఒకరు అధిక బరువు బారిన పడుతున్నారు. WHO డేటా ప్రకారం, భవిష్యత్తులో 27 కోట్ల మంది భారతీయులు ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది. జంక్ ఫుడ్, ఒత్తిడి, కదలిక లేని జీవితం, స్క్రీన్ టైమ్ పెరగడం.. ఇవే ప్రధాన ..

భారత్‌లో ప్రస్తుతం ప్రతి నలుగురిలో ఒకరు అధిక బరువు బారిన పడుతున్నారు. WHO డేటా ప్రకారం, భవిష్యత్తులో 27 కోట్ల మంది భారతీయులు ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది. జంక్ ఫుడ్, ఒత్తిడి, కదలిక లేని జీవితం, స్క్రీన్ టైమ్ పెరగడం.. ఇవే ప్రధాన కారణాలు. దీంతో డయాబెటిస్, గుండె జబ్బులు, ఒత్తిడి, జాయింట్ పెయిన్స్ వంటివి 30 ఏళ్లలోపే వస్తున్నాయి. అధిక బరువు సమస్యను తగ్గించుకోవడానికి జీలకర్ర బాగా పనిచేస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. బరువు నియంత్రణలో జీలకర్ర వాటర్ పాత్ర ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
జీలకర్ర నీళ్లను రోజూ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది మెటబాలిజాన్ని యాక్టివేట్ చేస్తూ, వెయిట్ లాస్ జర్నీని సపోర్ట్ చేస్తుంది. జీలకర్ర వాటర్ హెల్తీ డైట్, ఎక్సర్‌సైజ్‌తో కలిపినప్పుడే ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్స్ కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేస్తాయి, బ్లడ్ షుగర్‌ను స్థిరంగా ఉంచుతాయి, డైజెస్ట్‌షన్‌ను ఇంప్రూవ్ చేస్తాయి. ఫలితంగా, మెటబాలిక్ హెల్త్ మెరుగుపడి, క్యాలరీ బర్నింగ్ పెరుగుతుంది. లో-క్యాలరీ మీల్స్‌లో ఫ్లేవర్ యాడ్ చేసి, కడుపు నిండిన ఫీల్ రావడానికి సహాయపడుతుంది.
ఎలా చేయాలి..
1-2 టీస్పూన్ల హోల్ జీలకర్రను 1-2 కప్స్ (250-500 మి.లీ.) నీళ్లు పోసి రూమ్ టెంపరేచర్ వాటర్‌లో 8-10 గంటలు నానబెట్టాలి. ఉదయాన్నే 5-10 నిమిషాలు మరిగించి ఆ నీటిని వడగట్టాలి. ఈ జీలకర్ర నీళ్లను గోరువెచ్చగా ఉండగా తాగితే మంచి ఫలితం ఉంటుంది. రెండు చుక్కల నిమ్మరసం జోడించుకుంటే మరింత ప్రయోజనకరంగా ఉంది. పరగడపునే రోజుకు 1-2 గ్లాసుల జీలకర్ర నీళ్లు తాగితే మెటబాలిజం మెరుగవుతుంది.
జీలకర్ర వాటర్ అధిక బరువు తగ్గించుకోవడానికి మ్యాజిక్ డ్రింక్ కాదు, కానీ శాస్త్రీయంగా దీనివల్ల మంచి ఫలితం ఉంటుందని నిరూపితమైంది. దీనిలోని థైమోక్వినోన్, యాంటీఆక్సిడెంట్స్ జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి, మెటబాలిజాన్ని బూస్ట్ చేస్తాయి. ఉదయం ఖాళీ కడుపున ఒక గ్లాసు వెచ్చని జీలకర్ర వాటర్ తాగితే రోజంతా క్యాలరీ బర్నింగ్ రేటు పెరుగుతుంది.
భోజనానికి 20-30 నిమిషాల ముందు తాగితే ఆకలి నియంత్రణలో ఉంటుంది, ఎక్కువ తినే అలవాటు తగ్గుతుంది. ఇది బ్లడ్ షుగర్‌ను స్థిరంగా ఉంచి, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గిస్తుంది. రోజుకు 1-2 గ్లాసుల జీలకర్ర నీళ్లు, ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు రోజూ 30 నిమిషాల వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు కచ్చితంగా కనిపిస్తాయి. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి!
