AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DIY Cleaning: పాత వస్తువులను పారేయకండి: ఈ 10 చిట్కాలతో వాటి జీవితకాలం పెంచండి!

మనం మన రోజువారీ వస్తువులను, గృహోపకరణాలను కొంతకాలం గమనించకుండా వదిలేస్తాము. అవసరమైనప్పుడు వాటిని బయటకు తీస్తే చాలా సమస్యలు వస్తాయి. ఉదాహరణకు, గొడుగు రంధ్రాలు పడటం, మిక్సీ బ్లేడ్లు పదును కోల్పోవడం. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే, ఆ వస్తువులను సరైన పద్ధతిలో నిర్వహించడం, రక్షించడం చాలా ముఖ్యం. వాటి జీవితకాలం పెంచడానికి, పనిని సులభతరం చేయడానికి కొన్ని ఉపయోగకరమైన చిట్కాలు ఇక్కడ చూద్దాం.

DIY Cleaning: పాత వస్తువులను పారేయకండి: ఈ 10 చిట్కాలతో వాటి జీవితకాలం పెంచండి!
Home Appliances Maintenance Tips
Bhavani
|

Updated on: Nov 17, 2025 | 4:37 PM

Share

ప్రస్తుత కాలంలో ఇంటి నిర్వహణ అంటే కేవలం శుభ్రత మాత్రమే కాదు. మనం ప్రతిరోజూ వాడే గృహోపకరణాలు, చిన్నచిన్న వస్తువుల జీవితకాలం పెంచడం కూడా ముఖ్యమే. చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల గొడుగుకు రంధ్రాలు పడటం, సింక్ పైపులు మూసుకుపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యల నివారణకు ఖరీదైన ఉత్పత్తులు అవసరం లేదు. ఇంట్లో ఉండే టూత్‌పేస్ట్, బేకింగ్ సోడా లాంటి సాధారణ వస్తువులతోనే అద్భుతాలు చేయవచ్చు. మీ వస్తువులు కొత్తవాటిలా మెరిసేలా, ఎక్కువ కాలం మన్నేలా చేసేందుకు నిపుణులు సూచించిన 15 సూపర్ DIY చిట్కాలు ఇక్కడ అందిస్తున్నాం.

సామాను భద్రత, శుభ్రత

గొడుగు రక్షణ: వర్షాకాలంలో మనం గొడుగును ఎక్కువగా ఉపయోగిస్తాము. ఆ తర్వాత దాన్ని అలాగే ఉంచుతాము. మళ్లీ ఉపయోగించే సమయానికి అందులో చాలా రంధ్రాలు ఉండవచ్చు. దీనిని నివారించడానికి, గొడుగులో నాఫ్తలీన్ బంతులను ఉంచవచ్చు.

వెండి సామాను: వెండి సామానుకు పాలిష్ పోతే, టూత్‌పేస్ట్ రాసి రుద్దండి. పాలిష్ చేసినట్లుగా మెరుస్తుంది.

చెమట మరకలు: చెమట పట్టిన బట్టలను వెంటనే ఉతకడం ద్వారా, లేదా వెంటనే చల్లటి నీటిలో నానబెట్టడం ద్వారా బట్టలపై పసుపు మరకలు రాకుండా నివారించవచ్చు.

బిగుతు మూత: బాటిల్ మూత తెరవడం కష్టంగా అనిపిస్తే, మెడ ప్రాంతంలో కొద్దిగా నూనె, ఉప్పు రుద్దితే అది సులభంగా తెరుచుకుంటుంది.

తుప్పు పట్టిన వస్తువులు: తుప్పు పట్టిన కొడవళ్లు, కత్తులపై వాడిన నూనెను రుద్దడం వల్ల తుప్పు తొలగిపోయి, అవి మెరుస్తాయి.

ఎలక్ట్రానిక్స్, వంటగది ఉపకరణాలు

ఫ్లాస్క్ జాగ్రత్త: వేడిగా లేదా చల్లగా ఏదైనా ఫ్లాస్క్‌లో పోయడానికి ముందు, కొద్దిగా నీరు పోసి శుభ్రం చేసుకోండి. ఫ్లాస్క్ ఎక్కువసేపు వేడి/చల్లదనాన్ని నిలబెడుతుంది.

మిక్సర్ బ్లేడ్లు: మిక్సర్ బ్లేడ్లు పదును కోల్పోతే, ఒక గుప్పెడు సున్నం వేసి, బ్లేడ్లను పదును పెట్టడానికి మిక్సర్‌ను ఒకటి లేదా రెండు నిమిషాలు నడపండి.

కుక్కర్ సేఫ్టీ: కుక్కర్‌లోని సేఫ్టీ వాల్వ్‌ను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. అది మురికితో మూసుకుపోతే, పేలుడు ప్రమాదం ఉంది.

కిచెన్ సింక్ నిర్వహణ: సింక్ హోల్‌లో టీ ఫిల్టర్ పెడితే, దానిలో దుమ్ము పేరుకుపోతుంది. దానిని తొలగించడం సులభం అవుతుంది. అప్పుడు పైపులు మూసుకుపోవు.

ఫ్యాన్ బ్లేడ్లు: స్టీల్ బ్లేడ్లు ఉన్న ఫ్యాన్ల లాగా కాకుండా, అల్యూమినియం, ఫైబర్‌గ్లాస్ బ్లేడ్లు ఉన్నవి తుప్పు పట్టవు. వాటి నిర్వహణ సులభం.

వాటర్ హీటర్: మీరు స్టెయిన్‌లెస్ స్టీల్ ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ ఉన్న వాటర్ హీటర్‌ను కొనుగోలు చేస్తే, నిర్వహణ ఖర్చులను ఆదా చేయవచ్చు.

మరకల తొలగింపు

బాత్రూమ్ టైల్స్: టైల్స్ పై మరకలు ఉంటే, బేకింగ్ సోడాను శుభ్రమైన నీటిలో కరిగించి, మరకను తొలగించడానికి దానిపై రుద్దండి.

మొండి మరకలు: కొన్ని మరకలు ఎంత చేసినా పోవు. బేకింగ్ సోడా పౌడర్‌ను వెనిగర్‌లో కరిగించి మరకలు ఉన్న ప్రదేశాల్లో రుద్దితే తక్కువ సమయంలోనే మరక కరిగిపోతుంది.