రాత్రిళ్లు మీకూ నిద్రపట్టడంలేదా? ఈ ట్రిక్ ట్రై చేస్తే 2 నిమిషాల్లో గుర్రు పెడతారు..
ప్రతి రాత్రి మంచి నిద్ర మనల్ని ఆరోగ్యంగా, చురుగ్గా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీని కోసం రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి కారణంగా చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. మంచి నిద్ర పొందడానికి, కొంతమంది ధ్యానం, నిద్రపోతున్నప్పుడు..

ప్రతి రాత్రి మంచి నిద్ర మనల్ని ఆరోగ్యంగా, చురుగ్గా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీని కోసం రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి కారణంగా చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. మంచి నిద్ర పొందడానికి, కొంతమంది ధ్యానం, నిద్రపోతున్నప్పుడు కళ్ల మాస్క్ ధరించడం వంటి పద్ధతులను అనుసరిస్తుంటారు. దీనితో పాటు సాక్స్ ధరించడం కూడా మంచి నిద్ర పొందడానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. పడుకునే ముందు మీ పాదాలకు సాక్స్ ధరించడం వల్ల పాదాలు వెచ్చగా మారుతాయి. తద్వారా హాయిగా నిద్రపడుతుందట.
రాత్రిపూట సాక్స్ వేసుకుని పడుకుంటే ఏమవుతుంది?
వర్జీనియాలోని నేషనల్ స్లీప్ ఫౌండేషన్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. సాక్స్ ధరించి నిద్రపోయేవారు త్వరగా నిద్రపోతారు, ఎక్కువసేపు నిద్రపోతారని వెల్లడించింది. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన బయోమెడికల్ శాస్త్రవేత్త డాక్టర్ బీకిన్ లువో ప్రకారం నిద్రపోతున్నప్పుడు మీ పాదాలను వెచ్చగా ఉంచుకోవడం నిద్రపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు. మొత్తంమీద సాక్స్ ధరించడం వల్ల బాగా నిద్రపోతారన్నమాట. ఇందుకోసం, రాత్రి పడుకునే ముందు మీ పాదాలను బాగా శుభ్రం చేసుకుని, వాటిని పూర్తిగా ఆరబెట్టి మంచి మాయిశ్చరైజర్ రాసుకుని, ఆపై పడుకునే ముందు సాక్స్ ధరిస్తే మంచి నిద్ర వస్తుందని చెబుతారు.
సాక్స్ ధరించడం వల్ల నిద్రకు ఎలా సహాయపడుతుంది?
పడుకునే ముందు సాక్స్ ధరించడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. పాదాలు వెచ్చగా ఉన్నప్పుడు రక్త నాళాలు విస్తరిస్తాయి. ఇది మెరుగైన రక్త ప్రసరణ, విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది. అందువల్ల పడుకునే ముందు పాదాలకు సాక్స్ ధరించినట్లయితే మంచి నిద్ర వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతే కాదు దీని వల్ల ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయట. అవేంటంటే..
- ఇది పాదాలను చలి నుంచి రక్షించడమే కాకుండా, హాయిగా నిద్రపోవడానికి కూడా సహాయపడుతుంది.
- సాక్స్ ధరించడం వల్ల మడమల పగుళ్ల సమస్య రాకుండా ఉంటుంది.
- సాక్స్ ధరించడం వల్ల పాదాల వాపు, నొప్పి తగ్గుతాయి.
- క్రమం తప్పకుండా సాక్స్ ధరించడం వల్ల మీ పాదాలు అందంగా కనిపిస్తాయి.
మీరు గుర్తుంచుకోవలసిన విషయాలు
వైద్యుల అభిప్రాయం ప్రకారం.. మీ పాదాలను వెచ్చగా ఉంచుకోవడం వల్ల నిద్ర మెరుగుపడుతుంది. కానీ గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. సాక్స్ చాలా గట్టిగా లేదా మురికిగా ఉంటే చెమట పేరుకుపోతుంది. ఇది దురద, చర్మంపై దద్దుర్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. అలాగే బిగుతుగా ఉండే సాక్స్ ధరించడం వల్ల రక్త ప్రసరణకు అంతరాయం కలుగుతుంది. దీనివల్ల పాదాలు తిమ్మిరి అనుభూతి చెందుతాయి. కాబట్టి మీరు పడుకునే ముందు సాక్స్ ధరించాలనుకుంటే తేలికపాటి కాటన్ సాక్స్ ధరించాలి. మరీ బిగుతుగా ఉండే సాక్స్ ధరించవద్దు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.








