నెమలి ఈకను పుస్తకంలో పెట్టుకోవడం వలన కలిగే ఫలితాలు ఇవే!
samatha
Pic credit - Instagram
నెమలి ఈకలను చాలా మంది పుస్తకంలో పెట్టుకుంటారు. చిన్న పిల్లలు నెమలి ఈకలను చాలా ఇష్టపడుతారు. అంతే కాకుండా శ్రీ కృష్ణుడికి కూడా నెమలి ఈక చాలా ఇష్టమైనది.
అదే విధంగా నెమలి ఈక సరస్వతి దేవి చిహ్నం కూడా కావడంతో దీనిని పుస్తకంలో పెట్టుకుంటే సరస్వతీ దేవి ఆశీర్వాదం లభిస్తుందని అనుకుంటారు.
పుస్తకాలలో నెమలి ఈకలను పెట్టుకోవడం వలన అదృష్టం కలిసి రాదు కానీ, ఇది శుభప్రదం అంట. దీని వలన పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది.
ఎవరైతే తమ పుస్తకంలో నెమలి ఈకను పెట్టుకుంటారో, వారి మనసు చాలా ప్రశాతంగా ఉంటుందంట. అంతే కాకుండా ఏకాగ్రత పెరుగుతుంది.
పుస్తకంలో నెమలి ఈకను పెట్టుకోవడం వలన ఇది సానుకూల శక్తిని గ్రహించి, ప్రతికూలతను దూరం చేస్తుంది. అలాగే మీలో తెలివిని పెంచుతుంది.
నెమలి ఈక చెడు దృష్టి నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. చేతబడి ప్రభావాల నుంచి కూడా ఇవి మిమ్మల్ని రక్షిస్తాయి. మీలోని నెగిటివ్‌ను దూరం చేస్తుంది.
పరీక్షల్లో భయం, పనిలో భయం, ఆందోళన, టెన్షన్ వంటి వాటిని తగ్గించడానికి కూడా నెమలి ఈక ఉపయోగపడుతుందంట. అలాగే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
అయితే నెమలి ఈకలను పుస్తకంలో పెట్టుకునే సమయంలో తప్పక కొన్ని నియమాలు పాటించాలంట. పూర్తిగా చెక్కు చెదరకుండా ఉన్న వాటిని మాత్రమే బుక్‌లో పెట్టుకోవాలి అంటున్నారు పండితులు.