AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శనగపిండితో చర్మం మెరుస్తుంది..! ఇలా వాడితే మొటిమలు, ముడతలు మాయం..

ఒక గిన్నెలో శనగపిండి, అరకప్పు పెరుగు, కొన్ని చుక్కల నిమ్మరసం, చిటికెడు పసుపు కలిపి చిక్కటి మిశ్రమాన్ని తయారు చేయాలి. దీన్ని చర్మానికి అప్లై చేస్తే తక్షణ మెరుపు లభిస్తుంది. శనగపిండిలో కొంచెం రోజ్‌వాటర్‌, పెరుగు కలిపి ముఖానికి పట్టిస్తే ముఖం తాజాగా మారుతుంది. ఈ మిశ్రమాన్ని మెడ దగ్గర, మోచేతుల దగ్గర పట్టిస్తే నలుపుదనం తగ్గుతుంది.ఇలా రెగ్యులర్‌గా చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అయితే, అలా అని రోజూ చేయకూడదు. వారానికి ఒకసారి సరిపోతుంది.

శనగపిండితో చర్మం మెరుస్తుంది..! ఇలా వాడితే మొటిమలు, ముడతలు మాయం..
Besan Flour For Skin Beauty
Jyothi Gadda
|

Updated on: Jul 17, 2024 | 5:35 PM

Share

ముఖానికి శనగపిండి అప్లై చేయడం వల్ల ముఖం శుభ్రంగా మారుతుంది. చర్మం మెరుస్తుంది. శనగపిండిలో ఉండే ఎక్స్‌ఫోలియేట్ గుణాలు చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగిస్తాయి. దీంతో చర్మానికి సహజ మెరుపు వస్తుంది. చర్మ సౌందర్యాన్ని కాపాడటంలో శనగపిండి ఎంతగానో ఉపయోగపడుతుంది. మచ్చలు, మొటిమలు, ఎండ కారణంగా నల్లగా మారిన చర్మాన్ని, ఇతర చర్మ సంబంధమైన సమస్యలను తొలగించటంలో శనగపిండి దివ్యౌషధంగా పనిచేస్తుంది. చర్మంపై జిడ్డును నియంత్రించి, చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. శనగపిండిలో ఆల్కలైజింగ్ లక్షణాలు చర్మ సమతుల్యతను కాపాడుతుంది. చర్మం లోపల ఉండే దుమ్ము, విష పదార్థాలను తొలగిస్తుంది.

శనగపిండి, పెరుగుతో ఫేస్ ప్యాక్: స్కిన్ ఆయిలీగా ఉంటే శనగ పిండిని పెరుగుతో కలిపి చర్మానికి ప్యాక్‌లా వేసుకోవాలి. వారానికి ఓసారి ఇలా చేయడం వల్ల చర్మంలో అదనపు సెబమ్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఇది స్కిన్ టోన్‌ని మెరుగుపరుస్తుంది. శనగపిండిలో పెరుగు కలిపి ముఖానికి పట్టించటం వల్ల అది చక్కని స్క్రబ్‌లా పనిచేస్తుంది. దీనిని ముఖానికి ప్యాక్‌లా వేసి 15 నిమిషాల తర్వాత క్లీన్ చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై మచ్చలు, మొటిమలు తగ్గుతాయి.

శనగ పిండి సహజమైన క్లెన్సర్‌గా పనిచేస్తుంది. ఇది మీ చర్మం నుండి మొండిగా ఉన్న మురికిని తొలగిస్తుంది. ఇది ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలను కలిగి ఉంది. ఇది మీ చర్మం పైన ఉన్న మృతకణాల పొరను తొలగిస్తుంది. చర్మం లోపల రక్త ప్రసరణను పెంచుతుంది. ప్రతి కణానికి తగినంత ఆక్సిజన్‌ను అందిస్తుంది. కాబట్టి చర్మ సౌందర్యం చెక్కుచెదరకుండా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అలాగే, ఆరెంజ్ జ్యూస్‌లో శనగపిండిని మిక్స్‌ చేసిన ముఖానికి ప్యాక్‌లా వేసుకోవటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ రెండు కూడా చర్మ ఆరోగ్యానికి మంచివి. ఈ రెండింటిని కలిపి పేస్టులా చేసి ముఖానికి అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాల తర్వాత ఫేస్ క్లీన్ చేయాలి. దీని వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

ఇకపోతే, శనగపిండిలో పసుపు, రోజ్ వాటర్ కలపటం ద్వారా కూడా మంచి ఫేస్‌ప్యాక్‌ తయారుచెయొచ్చు. ఈ మిశ్రామాన్ని ముఖానికి పట్టించి 10 నుంచి 15 నిమిషాల పాటు ఆరిన తర్వాత కడిగేసుకుంటే చాలు.. ఇలా రెగ్యులర్‌గా చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అయితే, అలా అని రోజూ చేయకూడదు. వారానికి ఒకసారి సరిపోతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..