AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చలికాలంలో డెడ్‌ సెల్స్‌ని తొలగించడానికి ఈ 3 పదార్థాలు సూపర్.. తక్కువ ఖర్చుతో మెరిసే చర్మం..

Beauty Tips: దుమ్ము ఇతర పర్యావరణ కారకాల వల్ల చాలా సార్లు చర్మంపై మురికి పేరుకుపోతుంది. ఈ పరిస్థితిలో చర్మాన్ని క్రమం తప్పకుండా ఎక్స్‌ఫోలియేట్ చేయడం అవసరం.

చలికాలంలో డెడ్‌ సెల్స్‌ని తొలగించడానికి ఈ 3 పదార్థాలు సూపర్.. తక్కువ ఖర్చుతో మెరిసే చర్మం..
Homemade Body Scrub
uppula Raju
|

Updated on: Jan 28, 2022 | 8:48 AM

Share

Beauty Tips: దుమ్ము ఇతర పర్యావరణ కారకాల వల్ల చాలా సార్లు చర్మంపై మురికి పేరుకుపోతుంది. ఈ పరిస్థితిలో చర్మాన్ని క్రమం తప్పకుండా ఎక్స్‌ఫోలియేట్ చేయడం అవసరం. ఇది మీ చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. మీ చర్మాన్ని అందంగా, ఆకర్షణీయంగా మార్చుకోవడానికి బాడీ స్క్రబ్‌ని ఉపయోగించడం ఉత్తమమైన మార్గాలలో ఒకటి. ప్రస్తుతం మార్కెట్లో చాలా బాడీ స్క్రబ్‌ అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని ఇంట్లోనే సిద్ధం చేసుకోవడం ఉత్తమ ఎంపిక. మీరు చక్కెర, కొబ్బరి నూనె, కాఫీని ఉపయోగించి ఇంట్లో స్క్రబ్ తయారు చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.

చక్కెర, కాఫీ స్క్రబ్

చక్కెర, తేనె రెండూ మీ చర్మానికి గొప్ప పదార్థాలు. కాఫీ చర్మానికి సహజమైన మెరుపును తెస్తుంది. చక్కెర చర్మానికి గొప్ప ఎక్స్‌ఫోలియేటర్. కాఫీ, చక్కెర మిశ్రమం మీ చర్మానికి చాలా మంచిది. రెండు పదార్థాలు మీ చర్మానికి బాగా పని చేస్తాయి. ఇది చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యవంతంగా చేస్తుంది. ఈ స్క్రబ్ చేయడానికి మీకు కప్పు గ్రౌండ్ కాఫీ, కప్పు చక్కెర, 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ అవసరం. ఈ పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలో బాగా కలపాలి. దీనిని మీ చర్మంపై అప్లై చేయాలి. కొద్దిసేపు మసాజ్ చేసి ఆపై గోరువెచ్చని నీటితో కడగాలి.

కొబ్బరి నూనె స్క్రబ్

కొబ్బరి నూనె మీ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మంచి ఎక్స్‌ఫోలియేటింగ్ పదార్థం. ఇది మీ ముఖాన్ని సహజంగా శుభ్రపరుస్తుంది. మాయిశ్చరైజ్ చేస్తుంది. కొబ్బరి నూనె మీ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. సమపాళ్లలో పంచదార కలిపి వాడాలి. ఈ రెండు పదార్థాలను కలిపి పేస్ట్‌లా చేసి మీ చర్మంపై అప్లై చేయండి. కొద్దిసేపు చర్మాన్ని సున్నితంగా మసాజ్ చేయండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

పెరుగు బాడీ స్క్రబ్

పెరుగు మీ శరీరానికి గొప్ప క్లెన్సింగ్ ఏజెంట్. పెరుగు మీ చర్మానికి గొప్ప మాయిశ్చరైజర్. మీకు పొడి చర్మం ఉంటే ఇది మీ చర్మానికి ఉత్తమమైన పదార్ధం. ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ పెరుగు, 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ తేనె, 3 టేబుల్ స్పూన్ల చక్కెర వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్‌ని మీ శరీరంపై అప్లై చేయాలి. ఈ మిశ్రమం మీ చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది.

Vivo నుంచి సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్‌.. తక్కువ ధరలో అదిరే ఫీచర్స్‌.. Samsung, Redmiలకు గట్టి పోటీ..

అంతరిక్షంపై ఆసక్తి ఉందా.. ఇస్రోలో జాబ్‌ చేయాలనుకుంటున్నారా.. అర్హతలు ఏంటో తెలుసుకోండి..?

చలికాలంలో క్యారెట్ చట్నీ సూపర్.. ఆరోగ్యంతో పాటు అదిరే టేస్ట్‌..ఇంట్లోనే తయారుచేయండి..?

Follow Us
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
పచ్చి కూరగాయల స్వీట్ హల్వా .. ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి
పచ్చి కూరగాయల స్వీట్ హల్వా .. ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం నుంచి సూపర్ న్యూస్
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం నుంచి సూపర్ న్యూస్
ఆ మూవీపై రామ్ చరణ్ ప్రశంసలు..
ఆ మూవీపై రామ్ చరణ్ ప్రశంసలు..
క్యాబేజీ, క్యాలీఫ్లవర్లలో పురుగులను ఎలా తొలగించాలి?
క్యాబేజీ, క్యాలీఫ్లవర్లలో పురుగులను ఎలా తొలగించాలి?