AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రి పదే పదే మెలుకువ వస్తుందా.. మంచి నిద్ర కోసం రాత్రి ఈ పానీయాలు బెస్ట్ మెడిసిన్

కొంతమంది నిద్ర లేమితో ఇబ్బంది పడుతూ ఉంటారు. నిద్ర పోతున్న సమయంలో పదే పదే మెలకువ వచ్చి.. నిద్రకు అంతరాయం కలుగుతుంది. ఇలా నిద్రకు అంతరాయం కలగడం వలన పొద్దున్న చాలా చికాకుగా ఉంటారు. అంతేకాదు ప్రతిరోజూ సరిగ్గా నిద్రపోకపోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

రాత్రి పదే పదే మెలుకువ వస్తుందా.. మంచి నిద్ర కోసం రాత్రి ఈ పానీయాలు బెస్ట్ మెడిసిన్
Natural Sleep Aids
Surya Kala
|

Updated on: Nov 14, 2024 | 4:31 PM

Share

మంచి నిద్ర.. మంచి ఆరోగ్యం.. ఈ రెండు విషయాలు ఒకదానికొకటి సంబంధించినవి. రోజంతా శారీరకంగా లేదా మానసికంగా పనిచేసిన తర్వాత.. శరీరంతో పాటు మెదడుకు విశ్రాంతి అవసరం. దీని కోసం మంచి నిద్ర పొందడం చాలా ముఖ్యం. సరిగ్గా నిద్ర పోక పొతే సరైన విశ్రాంతి లభించదు. దాని కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొందరికి రాత్రిళ్లు పదే పదే నిద్రలేచే సమస్య ఉంటుంది. దీని వెనుక అనేక కారణాలు ఉండవచ్చు. బెడ్ రూమ్ లో ఎక్కువ వెలుతురు లేకపోవటం లేదా ఉష్ణోగ్రత చాలా వేడిగా ఉండడం లేదా చల్లగా ఉండటం వంటివి ఉన్నాయి. బెడ్ రూమ్ లో ఇవన్నీ సరిగ్గా ఉన్నా నిద్రకు ఆటంకం ఏర్పడితే… నిద్ర లేమి సమస్యకు ఉపశమనం ఇచ్చే కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవచ్చు.

రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే.. ఉదయం మానసిక స్థితి చికాకుగా ఉంటుంది. ఈ సమస్య రోజూ కొనసాగితే ఒత్తిడి పెరిగి జీవక్రియ మందగిస్తుంది. దీని కారణంగా బరువు పెరిగే అవకాశం అధికంగా ఉంటుంది. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా మొదలవుతాయి. అందువల్ల ప్రతిరోజూ సరైన సమయానికి నిద్రపోవడం, మేల్కొనడం మంచిది. అంతేకాదు రాత్రి ఏడెనిమిది గంటల నిద్ర కూడా అవసరం. ఈ నేపధ్యంలో మంచి నిద్ర కోసం రాత్రి సమయంలో ఏ పానీయాలు తీసుకోవాలో తెలుసుకుందాం..

పసుపు లేదా జాజికాయ పాలు: మంచి నిద్ర కోసం రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో పసుపు లేదా చిటికెడు జాజికాయ పొడి కలిపి తాగాలి. కొంతమంది జాజికాయను తీసుకోకూడదు. అందుకే పసుపును మంచి ఎంపికగా భావిస్తారు. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది, నిద్రను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

చామంతి టీ: రాత్రి సమయంలో పదేపదే నిద్రలేచే సమస్య ఉంటే.. చామంతి టీ బెస్ట్ రెమిడీ. చామంతి టీలో ఎపిజెన్ అనే మూలకం ఉంది, ఇది ప్రశాంతమైన నిద్రను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.

తులసి టీ: రాత్రి నిద్ర పోయే ముందు తులసి ఆకులతో తయారు చేసిన టీని త్రాగవచ్చు. ఈ టీ మీ శరీరంతో పాటు మీ మనస్సును రిలాక్స్ చేస్తుంది. బాగా నిద్రపోగలుగుతారు. తులసి టీ తయారు చేయడం చాలా సులభం. ఒక కప్పు నీరు తీసుకుని 8 నుంచి 10 తులసి ఆకులను కడిగి..వాటిని ముక్కలుగా చేసి, ఈ నీటిలో వేసి బాగా మరిగించాలి. రంగు మారి నీరు తులసి వాసన రావడం ప్రారంభించినప్పుడు.. ఆ నీటిని ఫిల్టర్ చేసి త్రాగాలి.

ఈ విషయాలను గుర్తుంచుకోండి

మంచి నిద్ర కోసం సమయానికి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అంటే ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య రాత్రి భోజనం చేయడం మంచిది. అంతేకాదు ఆహారం తిన్న తర్వాత ఖచ్చితంగా 20 నిమిషాలు నడవాలి. నిద్రపోయే ముందు టీ లేదా కాఫీ తీసుకోవద్దు. నిద్రపోయే ముందు పాదాలను గోరువెచ్చని నీటిలో కాసేపు ఉంచి ఆపై అరికాళ్ళకు మసాజ్ చేసుకోవడం వల్ల కూడా మంచి నిద్ర వస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు పాదాలలో తిమ్మిరి కారణంగా మళ్లీ మళ్లీ మేల్కొంటారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)