Holi Skincare Tips: హోలీ ఆడిన తర్వాత స్కిన్ అలెర్జీతో సమస్యలా ఉపశమనం కోసం సింపుల్ చిట్కాలు మీ కోసం..
హిందువులు ఘనంగా జరుపుకునే పండగలలో హోలీ ముక్యమైన పండగ. హోలీ పండగ కోసం చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎదురుచుస్తారు. రంగుల పండుగ అయిన హోలీని ఈ సంవత్సరం మార్చి 14న జరుపుకుంటారు. చాలా మందికి హోలీ ఆడటం ఇష్టం. అయితే సహజ రంగులతో కొంత మంది రసాయన రంగులతో కూడా హోలీ వేడుకను జరుపుకుంటారు. దీంతో ఆ రంగులు చర్మంపై చికాకు, దురదను కలిగిస్తాయి. కొన్ని సహజ చిట్కాల సహాయంతో ఇటువంటి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

హోలీ రోజున చాలా మంది రంగు రంగుల గులాల్ ను ఉపయోగిస్తారు. చాలా మంది హోలీని ముదురు రంగులతో ఆడతారు. ఆ రంగులను ముఖానికి పూసుకుంటారు. రసాయన రంగులు చర్మంపై అలెర్జీలకు కారణమవుతాయి. అంతేకాదు చర్మంపై దద్దుర్లు, దురద వంటి అనేక సమస్యలు వస్తాయి. ఈ రంగులు చర్మానికి చాలా నష్టం కలిగిస్తాయి. ఒకొక్కసారి ముఖంపై ఉన్న రంగును తొలగించిన తర్వాత చర్మం ఊడిపోవడం ప్రారంభమవుతుంది. మీరు కూడా హోలీ రోజున ఇలాంటి సమస్యను ఎదుర్కొంటే.. ఈ సమస్యను నివారించడానికి హోలీ వేడుకలను జరుపుకునే ముందు.. ముఖంతో సహా శరీరానికి నూనెను అప్లై చేయండి. అంతేకాదు హోలీ జరుపుకున్న తర్వాత కూడా కొన్ని చిట్కాల సహాయంతో రంగుల వల్ల కలిగే చికాకు, దద్దుర్లు, దురద సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
హోలీ సమయంలో చర్మాన్ని రసాయన రంగుల నుంచి రక్షించుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవారు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. రంగుల వల్ల కలిగే చర్మ అలెర్జీల నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని చిట్కాల గురించి తెలుసుకోండి.. వీటిని ప్రయత్నించండి.
దేశీ నెయ్యి లేదా కొబ్బరి నూనె
రంగులను తొలగించిన తర్వాత చర్మంపై దద్దుర్లు కనిపించినా, చర్మం పొడిబారినట్లనా లేదా మొటిమలు కనిపించినట్లయితే వెంటనే దేశీ నెయ్యి లేదా కొబ్బరి నూనె రాయండి. ఇది మీకు చాలా ఉపశమనం ఇస్తుంది. చర్మానికి అలేర్జీలు నయం అవుతాయి.
కలబంద
ముఖం మీద రంగు కారణంగా చికాకు అనిపిస్తే.. ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత కలబంద జెల్ అప్లై చేయండి. ఇది స్కిన్ అలర్జీల నుంచి తక్షణ ఉపశమనం ఇస్తుంది. అలోవెరా జెల్‌ను తేనె , రోజ్ వాటర్‌తో కలిపి కూడా అప్లై చేయవచ్చు. కలబందలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్లు, దద్దుర్లు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. చర్మాన్ని నయం చేస్తాయి.
పెరుగు
చికాకు, దద్దుర్లు, మొటిమల నుండి ఉపశమనం పొందడానికి పెరుగు కూడా మంచిగా ఉపయోగ పడుతుంది. పెరుగులో చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. పసుపు ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం కలిగేలా పనిచేస్తుంది. పెరుగు చర్మాన్ని చల్లబరుస్తుంది. పొడిబారడాన్ని తగ్గిస్తుంది.
ముల్తానీ మిట్టి
రసాయన రంగుల వల్ల దెబ్బతిన్న చర్మాన్ని బాగుచేయడానికి ముల్తానీ మిట్టి, రోజ్ వాటర్, తేనె, గంధపు పొడి, పెరుగుతో చేసిన ఫేస్ ప్యాక్‌ను అప్లై చేయవచ్చు. ఈ సహజ వస్తువులన్నీ చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ ఫేస్ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు క్రమం తప్పకుండా అప్లై చేయాలి.
వేప ఫేస్ ప్యాక్
హోలీ రంగులతో స్కిన్ అలెర్జీతో బాధపడే వారికి ఉపశమనం కోసం వేప ఫేస్ ఫ్యాక్ మంచి మెడిసిన్. చర్మంపై చికాకు, దద్దుర్లు, మొటిమల నుంచి ఉపశమనం పొందడానికి వేప ఆకులను రుబ్బి ముఖానికి అప్లై చేయండి. ఈ పేస్ట్ కు ముల్తానీ మట్టిని కూడా జోడించవచ్చు. ఈ మిశ్రమం చికాకు నుంచి ఉపశమనం కలిగించడమే కాదు దద్దుర్లు, మొటిమలను కూడా తగ్గిస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)








