Health Tips: మీలో ఈ 4లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్‌తీసుకోవద్దు.. ఆ డేంజర్ వ్యాధికి సంకేతం కావచ్చు!
రోజురోజుకూ మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా జనాలు అనేక రకాల వ్యాధుల భారీన పడుతున్నారు. వాటిలో అధిక కొలెస్ట్రాల్ సమస్య కూడా ఒకటి. సాధారణంగా మనకు ఈ సమస్య ఉందా లేదా అనేది రక్త పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇది స్పష్టమైన లక్షణాలను చూపించదు. కానీ మన శరీరంలో జరిగే కొన్ని మార్పుల ద్వారా ఈ సమస్యను మనం గుర్తించవచ్చు. అదెలానో తెలుసుకుందాం పదండి.

చెడు కొలెస్ట్రాల్ (LDL) పెరిగి మంచి కొలెస్ట్రాల్ (HDL) తగ్గినప్పుడు, ధమనులలో కొవ్వు పేరుకుపోవడం స్టార్ట్ అవుతుంది.దీని వల్ల సిరలు ఇరుక్కామారుతాయి దీంతో రక్త ప్రవాహం తగ్గుతుంది. ఇది గుండెకు ఒత్తిడిని పెంచుతుంది. దీంతో గుండెపోటు, స్ట్రోక్, కాళ్ళ సిరల్లో అడ్డంకులు, అధిక రక్తపోటు వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. ఇది ప్రారంభంలో ఎటువంటి ప్రధాన లక్షణాలను చూపించదు కాబట్టి, దీనిని “సైలెంట్ కిల్లర్” అని పిలుస్తారు. చాలా మందిలో, దీని ప్రారంభ లక్షణాలు స్పష్టంగా కనిపించవు, కానీ ఇది శరీరానికి అంతర్గతంగా హాని చేస్తూనే ఉంటుంది. దీని ప్రారంభ సంకేతాలను గుర్తించినట్లయితే, గుండె సంబంధిత వ్యాధులను నివారించవచ్చు.
అధిక కొలెస్ట్రాల్‌ను తెలియజేసే నాలుగు లక్షణాలు ఇవే
అలసట, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది: ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు, రక్త ప్రవాహం తగ్గుతుంది. దీని వల్ల మన చిన్న పని చేసినా ఎక్కువ అలసట వస్తుంది. అలాగే శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది కలుగుతుంది. అలసటతో కలిపి శ్వాస ఆడకపోవడం ధమనులలో ప్రారంభ మార్పులకు సంకేతం కావచ్చునని NIH అధ్యయనం సూచిస్తుంది. ఇది గుండెపోటు అంత తీవ్రంగా ఉండదు, కానీ రక్త ప్రవాహం ఆగిపోవచ్చనే హెచ్చరికకు సంకేతం. దీనిఇన నిర్లక్ష్యం చేస్తే, అది క్రమంగా తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుంది.
కాళ్ళలో నొప్పి, తిమ్మర్లు: కొలెస్ట్రాల్ గుండె సిరలను మాత్రమే కాకుండా కాళ్ళలోని సిరలను కూడా అడ్డుకుంటుంది. ఇది నడుస్తున్నప్పుడు నొప్పి, మంట, బరువు లేదా లాగడం వంటి అనుభూతిని కలిగిస్తుంది, ఇది సాధారణంగా విశ్రాంతి తీసుకున్న తర్వాత తగ్గుతుంది. చాలా మంది దీనిని అలసట లేదా వృద్ధాప్యానికి సంకేతం అనుకుంటారు. కానీ ఇది చెడు కొలెస్ట్రాల్‌కు సంకేతం కూడా కావచ్చు.
గాయాలు నెమ్మదిగా మానడం: పాదాలకు రక్తం సరిగ్గా ప్రవహించనప్పుడు, చలి, తిమ్మిరి, చర్మం సన్నబడటం లేదా చిన్న గాయాలు నెమ్మదిగా మానడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇది ధమనులు ఇరుకుగా మారడానికి సంకేతం, ఇది తరువాత తీవ్రమైన సమస్యకు దారితీస్తుంది.
కళ్ళలో లేదా చుట్టూ పసుపు మచ్చలు: కొంతమందిలో, శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు, కళ్ళ దగ్గర పసుపు రంగు మచ్చలు, పసుపు రంగు గడ్డలు, కంటి కనుపాప చుట్టూ తెలుపు/బూడిద రంగు వలయం ఏర్పడుతుంది, అలాగే చేతులు, మడమలపై గడ్డలు వంటి స్పష్టంగా కనిపించే గుర్తులు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు చెడు కొలెస్ట్రాల్‌కు సంకేతం కావచ్చు. పైన పేర్కొన్న ఈ లక్షణాలు మీలో కినిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




