AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యోగాతో గుండెపోటుకు చెక్.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన అద్భుత ఆసనాలు ఇవే..

ఆధునిక జీవనశైలి కారణంగా యువతలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. శారీరక శ్రమ లేకపోవడం, జంక్ ఫుడ్, ఒత్తిడి ప్రధాన కారణాలు. గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి యోగా, జీవనశైలి మార్పులు అవసరం. స్వామి రామ్‌దేవ్ సూచించిన సూర్య నమస్కారం, భుజంగాసనం వంటి ఆసనాలతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, తగిన నిద్ర గుండెపోటును నివారించడంలో సహాయపడతాయి.

యోగాతో గుండెపోటుకు చెక్.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన అద్భుత ఆసనాలు ఇవే..
Yoga For Heart Health
Krishna S
|

Updated on: Dec 08, 2025 | 9:57 AM

Share

ఈ ఆధునిక కాలంలో యువత గుండెపోటుకు బలవడం ఆందోళన కలిగిస్తుంది. గతంలో పెద్దలకే పరిమితమైన గుండపోట్లు ఇప్పుడు పిల్లలు, యవతను కబళిస్తుంది. దీనికి అనారోగ్యకరమైన జీవనశైలి కారణమని నిపుణులు అంటున్నారు. ఎక్కువసేపు కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. జంక్ ఫుడ్, అధిక ఉప్పు, వేయించిన ఆహారాలు రక్త నాళాలలో కొవ్వును పెంచుతాయి. దీర్ఘకాలిక ఒత్తిడి, ఆందోళన, ధూమపానం, నిద్ర లేకపోవడం కూడా గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి.

యోగాతో గుండె ఆరోగ్యం

ఇలాంటి సమయంలో చిన్న జీవనశైలి మార్పులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. యోగా అనేది శరీరం, మనస్సు, గుండెపై సానుకూల ప్రభావాన్ని చూపగల అద్భుతమైన మార్గం. క్రమం తప్పకుండా యోగాభ్యాసం చేయడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. శరీరంలో సహజ సమతుల్యత కాపాడుతుంది. యోగా ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి స్వామి రామ్‌దేవ్ కొన్ని ముఖ్యమైన ఆసనాలను సూచించారు.

సూర్య నమస్కారం – భుజంగాసనం

స్వామి రామ్‌దేవ్ సూచించిన ఆసనాలలో సూర్య నమస్కారం ప్రధానమైనది. ఇది మొత్తం శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీని ద్వారా గుండె కండరాలు బలపడతాయి. ఆక్సిజన్ శోషణ పెరుగుతుంది. అలాగే భుజంగాసనం ఛాతీని విస్తరించి గుండె కండరాలను బలోపేతం చేస్తుంది. ఇది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి, గుండెకు ఎక్కువ ఆక్సిజన్‌ను అందిస్తుంది.

పశ్చిమోత్తనాసనం దండాసనం

పశ్చిమోత్తనాసనం శరీరాన్ని, నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించి, హృదయ స్పందనను నియంత్రించడంలో సహాయపడుతుంది. దండాసనం సరైన భంగిమను నిర్వహించడం ద్వారా శ్వాస సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది రక్త ప్రవాహాన్ని సమతుల్యం చేసి, గుండెపై అనవసరమైన ఒత్తిడిని తగ్గిస్తుంది.

గుండె ఆరోగ్యానికి జీవనశైలి చిట్కాలు

యోగతో పాటు గుండె ఆరోగ్యానికి మరికొన్ని జీవనశైలి మార్పులు అవసరం. ప్రతిరోజూ 30 నిమిషాలు చురుకైన నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయాలి. ఉప్పు, చక్కెర, వేయించిన ఆహార పదార్థాల తీసుకోవడం తగ్గించాలి. తగినంత నిద్ర పొందడం, ధూమపానం, మద్యం నుండి దూరంగా ఉండటం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఈ మార్పులను పాటించడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

యోగాతో గుండెపోటుకు చెక్.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన అద్భుత ఆసనాలు
యోగాతో గుండెపోటుకు చెక్.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన అద్భుత ఆసనాలు
రూ.10,000 EMIతో టాటా నెక్సాన్ కొనొచ్చు.. ఎన్నేళ్లు చెల్లించాలి?
రూ.10,000 EMIతో టాటా నెక్సాన్ కొనొచ్చు.. ఎన్నేళ్లు చెల్లించాలి?
హాట్ చాక్లెట్ తాగితే వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసా
హాట్ చాక్లెట్ తాగితే వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసా
ఆర్ఆర్ఆర్‌లో ఈ గొండు జాతి మహిళ గుర్తుందా.?
ఆర్ఆర్ఆర్‌లో ఈ గొండు జాతి మహిళ గుర్తుందా.?
హైదరాబాదులోని ఆ రోడ్డుకి డోనాల్డ్ ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్
హైదరాబాదులోని ఆ రోడ్డుకి డోనాల్డ్ ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్
శింబు, ధృవ్​ రిజెక్ట్​ చేసిన కథను ఓకే చేసిన స్టార్​ హీరో!
శింబు, ధృవ్​ రిజెక్ట్​ చేసిన కథను ఓకే చేసిన స్టార్​ హీరో!
17 సిక్సర్లు, 5 ఫోర్లతో 160..ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడు మామ
17 సిక్సర్లు, 5 ఫోర్లతో 160..ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడు మామ
మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. 48గంటల్లోనే అకౌంట్‌లో రూ.8లక్షల
మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. 48గంటల్లోనే అకౌంట్‌లో రూ.8లక్షల
ఒక మంచి మనిషి పాత్ర చేస్తున్నందుకు సంతోషంగా ఉంది
ఒక మంచి మనిషి పాత్ర చేస్తున్నందుకు సంతోషంగా ఉంది
కాలుష్యం బారి నుంచి శరీరాన్ని కాపాడే సూపర్​ డ్రింక్స్​!
కాలుష్యం బారి నుంచి శరీరాన్ని కాపాడే సూపర్​ డ్రింక్స్​!