Cricket Record : ఇది ఆట కాదు తాండవం..17 సిక్సర్లు, 5 ఫోర్లతో 160..ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడు మామ
Cricket Record : టీ20 క్రికెట్‌లో 200 పరుగులు చేస్తేనే అది గెలుపు స్కోరుగా భావిస్తారు. అలాంటిది ఒక టీమ్ ఏకంగా 215 పరుగుల తేడాతో ఓడిపోవడమంటే ఆశ్చర్యకరం. ఈ ఫలితం ఏదో లీగ్ మ్యాచ్‌ది కాదు, స్వయంగా టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ది.

Cricket Record : టీ20 క్రికెట్‌లో 200 పరుగులు చేస్తేనే అది గెలుపు స్కోరుగా భావిస్తారు. అలాంటిది ఒక టీమ్ ఏకంగా 215 పరుగుల తేడాతో ఓడిపోవడమంటే ఆశ్చర్యకరం. ఈ ఫలితం ఏదో లీగ్ మ్యాచ్‌ది కాదు, స్వయంగా టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ది. డిసెంబర్ 7న స్పెయిన్, క్రొయేషియా మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో స్పెయిన్ జట్టు, క్రొయేషియాను 215 పరుగుల భారీ తేడాతో ఓడించింది. అసలు ఇది ఎలా జరిగిందో చూద్దాం.
మొదట బ్యాటింగ్ చేసిన స్పెయిన్ జట్టు రికార్డులు క్రియేట్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఏకంగా 290 పరుగులు చేసింది. టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఇది ఒక జట్టు చేసిన 5వ అతిపెద్ద స్కోరుగా నమోదైంది. ఈ భారీ స్కోరు సాధించడంలో స్పెయిన్ ఓపెనర్ మహ్మద్ ఇహ్సాన్ కీలక పాత్ర పోషించాడు. ఆయన ఒక్కడే క్రొయేషియా జట్టులోని 11 మంది ఆటగాళ్లపై భారీగా పైచేయి సాధించాడు.
మహ్మద్ ఇహ్సాన్ బ్యాటింగ్ విధ్వంసకరంగా సాగింది. క్రొయేషియా బౌలర్లకు చుక్కలు చూపిస్తూ అతను 253.96 స్ట్రైక్ రేట్‌తో చెలరేగిపోయాడు. ఇహ్సాన్ ఏకంగా 17 సిక్సర్లు మరియు 5 ఫోర్లు బాదాడు. మొత్తం 22 బౌండరీల సాయంతో కేవలం 63 బంతుల్లోనే 160 పరుగులు చేశాడు. ఒకే బ్యాట్స్‌మన్ ఇంత భారీ స్కోరు చేయడం వలన, సహజంగానే స్పెయిన్ స్కోరు బోర్డులో మంటలు చెలరేగాయి. క్రొయేషియా జట్టు మొత్తం చేసిన పరుగులు, మహ్మద్ ఇహ్సాన్ ఒక్కడే చేసిన 160 పరుగుల కంటే కూడా 85 పరుగులు తక్కువగా ఉండటం ఈ మ్యాచ్‌లో జరిగిన అతిపెద్ద విచిత్రం!
291 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన క్రొయేషియా జట్టుకు ఆరంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. క్రొయేషియా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 75 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఆ జట్టు 215 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది.ఇది పరుగుల పరంగా క్రొయేషియాకు లభించిన అత్యంత ఘోరమైన ఓటమి. అంతేకాకుండా, టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఒక జట్టుకు పరుగుల పరంగా లభించిన 5వ అతిపెద్ద ఓటమి ఇది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




