ఈ పువ్వును జుట్టుకు పట్టిస్తే.. బట్టతలపై సైతం జుట్టు రావాల్సిందే..! తప్పక ట్రై చేయండి..
బట్టతల సమస్య నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది ఎన్నో రకాల ప్రొడక్ట్స్ వినియోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ పోయిన జుట్టు తిరిగి రాక నిరాశ పడుతుంటారు. బట్టతలపై జుట్టు పెరిగేందుకు అనేక రెమిడీలు ఉన్నప్పటికీ..చాలామందికి వీటి గురించి సరిగ్గా తెలియదు.. ముఖ్యంగా బట్టతల మీద జుట్టు రప్పించే ఒక అద్భుతమైన హెయిర్ ప్యాక్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

చాలామంది ఎదుర్కొంటున్న జుట్టు సమస్యల్లో బట్టతల ఒకటి. చిన్న వయసులోనే ఇప్పుడు చాలామందిలో జుట్టు రాలిపోయి బట్ట తల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. బట్టతలతో బాధపడేవారు నలుగురిలోకి వెళ్లాలంటే..ఇబ్బందిపడుతుంటారు. ఏదో కోల్పోయినట్టుగా బాధపడుతూ ఉంటారు. బట్టతల సమస్య నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది ఎన్నో రకాల ప్రొడక్ట్స్ వినియోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ పోయిన జుట్టు తిరిగి రాక నిరాశ పడుతుంటారు. బట్టతలపై జుట్టు పెరిగేందుకు అనేక రెమిడీలు ఉన్నప్పటికీ..చాలామందికి వీటి గురించి సరిగ్గా తెలియదు.. ముఖ్యంగా బట్టతల మీద జుట్టు రప్పించే ఒక అద్భుతమైన హెయిర్ ప్యాక్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఔషధంగా ఉపయోగించే అనేక పువ్వులు, ఆకులు ఉన్నాయి. వాటిలో ఒకటి మందార పువ్వు. ఈ పువ్వులో ఉండే అమైనో ఆమ్లాలు, ఫ్లేవనాయిడ్లు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. అంతేకాదు.. ఇది సూర్యుని నుండి వెలువడే హానికరమైన కిరణాల నుండి కూడా జుట్టును రక్షిస్తుంది. మందార పువ్వు, ఆకులతో తయారు చేసిన ప్యాక్ జుట్టుకు చాలా ప్రయోజనకరంగా పనిచేస్తుందని నిపుణులు కూడా చెబుతున్నారు. బట్టతలపై జుట్టు రప్పించేందుకు మందారం పూలతో తయారు చేసిన హెయిర్ ప్యాక్ అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది బట్టతలపై జుట్టు రప్పించడమే కాకుండా జుట్టును మృదువుగా చేస్తుంది.
మందారం పువ్వు హెయిర్ ప్యాక్‌ను బట్టతల ఉన్నవారు రోజు వినియోగించడం వల్ల తిరిగి జుట్టు పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు సైతం చెబుతున్నారు. మందార పూలతో హెయిర్ ప్యాక్ తయారీ కోసం ముందుగా మందారం పువ్వును శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దానిని ఓ మిక్సీ జార్లో వేసుకోండి. అందులోనే తగినంత కొబ్బరి నూనె వేసి బాగా మిశ్రమంలా మిక్సీ పట్టుకోండి. ఇలా పట్టుకున్న మిశ్రమాన్ని బట్టతలకు పట్టిస్తే జుట్టు రావడం ఖాయం అంటున్నారు నిపుణులు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




