AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onion Juice for Hair Growth: ఉల్లి రసాన్ని ఇలా వాడితే.. జుట్టు ఒత్తుగా, నడుము దాకా పెరగడం పక్కా..!

ఉల్లిపాయ రసాన్ని 72 గంటలు అంటే మూడు రోజుల పాటు దాన్ని పులియబెడితే అది మ్యాజిక్ లాగా పనిచేస్తుందని చెబుతున్నారు. ఇలా పులియబెట్టడం వల్ల ఆ ఉల్లిపాయ రసంలో క్వెర్సెటిన్ స్థాయిలు పెరుగుతాయట, PH తల చర్మానని అసమతుల్యం చేస్తుందట. కొత్త విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు.

Onion Juice for Hair Growth: ఉల్లి రసాన్ని ఇలా వాడితే..  జుట్టు ఒత్తుగా, నడుము దాకా పెరగడం పక్కా..!
Onion Juice
Jyothi Gadda
|

Updated on: Jun 28, 2025 | 11:39 AM

Share

ఉల్లిపాయలో ఎన్నో గొప్ప గుణాలు ఉంటాయి. అందుకే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని పెద్దలు తరచూ చెబుతుంటారు. ఉల్లిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ పారాసిటిక్, యాంటీ ఫంగల్ ఏజెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది స్కాల్ప్‌పై అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. చుండ్రుని తొలగించడంలో ఉల్లి బాగా పనిచేస్తుంది. ఉల్లిపాయలలో సల్ఫర్ అధికంగా ఉంటుంది. ఇది జుట్టు ఫోలికల్స్‌ని ఉత్తేజపరుస్తుంది. ఈ కారణంగా జుట్టు బాగా పెరిగేందుకు సాయపడుతుంది. అయితే, జుట్టు సమస్యలకు ఉల్లిపాయ బాగా పనిచేస్తుంది.

అయితే, దాదాపుగా చాలా మంది ఉల్లిపాయను గ్రైండ్ చేసి రసాన్ని ఫిల్టర్ చేసి, ఆ రసాన్ని నేరుగా తలకు అప్లై చేస్తుంటారు. అయితే ఇది కరెక్ట్ పద్దతి కాదని బ్యూటిషన్లు చెబుతున్నారు. ఇందుకోసం ఉల్లిపాయ రసాన్ని 72 గంటలు అంటే మూడు రోజుల పాటు దాన్ని పులియబెడితే అది మ్యాజిక్ లాగా పనిచేస్తుందని చెబుతున్నారు. ఇలా పులియబెట్టడం వల్ల ఆ ఉల్లిపాయ రసంలో క్వెర్సెటిన్ స్థాయిలు పెరుగుతాయట, PH తల చర్మానని అసమతుల్యం చేస్తుందట. కొత్త విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు.

ఉల్లిపాయ రసాన్ని పులియబెట్టడం ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా తరిగి ఒక సీసాలో వేసుకోవాలి. సీసాను నీటితో నింపి, గాలి చొరబడని మూతతో మూసివేయండి. 2-3 రోజులు లేదా ఉల్లిపాయ రసం పులియబెట్టే వరకు సీసాను అలాగే ఓ పక్కన పెట్టేసుకోండి. ఆ తరువాత పులియబెట్టిన రసాన్ని వడకట్టి జుట్టుకు అప్లై చేసుకోవాలి. అయితే, ముందుగా తలని తడి చేసుకుని, తర్వాత పులిసిన ఉల్లి రసంతో జుట్టుకు 2-3 నిమిషాలు మసాజ్ చేయాలి. తర్వాత జుట్టు మొత్తాన్ని క్లాత్ తో కవర్ చేసుకుని, 30-60 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత జుట్టును రెండుసార్లు శాంపూతో వాష్‌ చేసుకోవాలని చెబుతున్నారు. ఇలా క్రమం తప్పకుండా 4 నుంచి 6 వారాల పాటు పాటిస్తూ ఉంటే మంచి ప్రయోజనాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

పై విధంగా తయారైన ఉల్లిపాయ రసాన్ని తలకు అప్లై చేస్తే జుట్టు చాలా ఆరోగ్యంగా, వేగంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా తయారు చేసిన ఉల్లిపాయ రసం కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. జుట్టు రాలడాన్ని ఆపుతుంది. లేదా తగ్గిస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..