Kitchen Hacks: కిచెన్‌లోని జిడ్డుగా ఉండే కిటికీ మెస్‌ని.. ఇలా క్లీన్ చేయండి..

కిచెన్ క్లీన్ చేయాలంటే అబ్బా చాలా సమయమే పడుతుంది. ఎందుకంటే అక్కడే వంటలు చేస్తూ ఉంటాం. కాబట్టి.. వంట సామాగ్రి.. అక్కడున్న వస్తువులు కూడా జిడ్డుగా మారిపోతాయి. ఇలా జిడ్డుబారిపోయిన వాటిని క్లీన్ చేయాలంటే చాలా సమయమే పడుతుంది. ముఖ్యంగా కిచెన్‌లోని కిటికీకి పెట్టే మెస్ గురించి ప్రత్యేకంగా చెప్సాల్సిన పని లేదు. చాలా జిడ్డుగా, మురికిగా ఉంటుంది. వంట చేసేటప్పుడు నూనె బిడ్డ.. వంట చేసేటప్పుడు వచ్చే ఆవిరికి కిటికీ మెస్ జిడ్డుగా..

Kitchen Hacks: కిచెన్‌లోని జిడ్డుగా ఉండే కిటికీ మెస్‌ని.. ఇలా క్లీన్ చేయండి..
Kitchen hacks
Follow us

|

Updated on: Sep 13, 2024 | 6:44 PM

కిచెన్ క్లీన్ చేయాలంటే అబ్బా చాలా సమయమే పడుతుంది. ఎందుకంటే అక్కడే వంటలు చేస్తూ ఉంటాం. కాబట్టి.. వంట సామాగ్రి.. అక్కడున్న వస్తువులు కూడా జిడ్డుగా మారిపోతాయి. ఇలా జిడ్డుబారిపోయిన వాటిని క్లీన్ చేయాలంటే చాలా సమయమే పడుతుంది. ముఖ్యంగా కిచెన్‌లోని కిటికీకి పెట్టే మెస్ గురించి ప్రత్యేకంగా చెప్సాల్సిన పని లేదు. చాలా జిడ్డుగా, మురికిగా ఉంటుంది. వంట చేసేటప్పుడు నూనె బిడ్డ.. వంట చేసేటప్పుడు వచ్చే ఆవిరికి కిటికీ మెస్ జిడ్డుగా మారిపోతుంది. ఇది చాలా మురికిగా.. జిగటగా మారుతుంది. దీన్ని క్లీన్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. అయితే కొన్ని చిట్కాలతో ఈజీగా మెస్ మురికిని వదిలించవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా బెస్ట్ కిచెన్ హ్యాక్‌గా ఉపయోగ పడుతుంది. కిటికీ మెస్‌పై పేరుకు పోయిన నూనె జిడ్డును శుభ్రం చేయడానికి బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు. కొద్దిగా నీటిలో బేకింగ్ సోడా, సర్ఫ్ కలిపి.. మెస్ పై స్ప్రే చేయండి. ఆ తర్వాత ఓ పది నిమిషాలు వదిలేయండి. ఇప్పుడు స్క్రబ్బర్‌తో రుద్దితే మురికి మొత్తం పోతుంది. ఆ తర్వాత మంచినీటితో కడగండి. మళ్లీ కొత్తదానిలా మెరుస్తుంది.

హైడ్రోజన్ పెరాక్సైడ్:

హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో కూడా కిటికీ మెస్ జిడ్డును తొలగించుకోవచ్చు. ఒక లీటర్ నీటిలో ఒక టీ స్పూన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ నీటిని ఓ పావుగంట సేపు పక్కనే ఉంచి.. ఆ తర్వాత మెస్‌పై స్ప్రే చేయాలి. మళ్లీ ఓ పది నిమిషాలు వదిలేయండి. ఆ తర్వాత స్క్రబ్బర్‌తో రుద్ది.. మంచినీటితో కడగండి. ఇలా చేస్తే మురికి, జిడ్డు పోతుంది.

ఇవి కూడా చదవండి

వెనిగర్:

వెనిగర్‌తో కూడా మనం మెస్ జిడ్డు, మురికిని వదిలించుకోవచ్చు. నీటిలో వెనిగర్ మిక్స్ చేసి.. మెస్‌పై స్ప్రే చేయండి. ఆ తర్వాత కాసేపు వదిలేసి.. స్ర్కబ్బర్‌తో రుద్ది.. మంచి నీటితో క్లీన్ చేయాలి. అంతే ఇలా క్లీన్ చేయడం వల్ల మురికి, జిడ్డు వదిలి తెల్లగా మారుతుంది. ఇలా క్లీన్ చేయడం వల్ల కిటికీ మెస్ జిడ్డును త్వరగా, సులభంగా వదిలించు కోవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..