AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Memory Power: అల్జీమర్స్ లక్షణాలివే.. కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.. లేదంటే కష్టాలు తప్పవు..

వయసుపైబడిన వారిలో ఎక్కువగా వచ్చే ఈ సమస్య ఉన్న వ్యక్తి చిన్న చిన్న విషయాలను కూడా మరిచిపోతుంటాడు. ఇది కేవలం మన జ్ఞాపకశక్తికి మాత్రమే నష్టం కలిగించకుండా మన రోజువారీ జీవితానికి కూడా హాని కలిగిస్తుంది. ఈ క్రమంలోనే ఇతరుల సూచనలను పాటించడం, గుర్తు..

Memory Power: అల్జీమర్స్ లక్షణాలివే.. కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.. లేదంటే కష్టాలు తప్పవు..
Alzheimer
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 08, 2023 | 6:20 AM

Share

వయసు పైబడిన వారిలో జ్ఞాపకశక్తి లోపించడ అనేది సర్వసాధారణమైన విషయం. అయితే వారిలో అలా జరగడానికి అల్జీమర్స్ అనే జ్ఞాపకశక్తిని నాశనం చేసే వ్యాధి కారణమని నిపుణులు చెబుతున్నారు. వయసుపైబడిన వారిలో ఎక్కువగా వచ్చే ఈ సమస్య ఉన్న వ్యక్తి చిన్న చిన్న విషయాలను కూడా మరిచిపోతుంటాడు. ఇది కేవలం మన జ్ఞాపకశక్తికి మాత్రమే నష్టం కలిగించకుండా మన రోజువారీ జీవితానికి కూడా హాని కలిగిస్తుంది. ఈ క్రమంలోనే ఇతరుల సూచనలను పాటించడం, గుర్తు పెట్టుకోవడం, అర్ధం చేసుకోవడంలో తీవ్ర సమస్యలు తలెత్తుతాయి. పెరుగుతున్న వయసుతో పాటు మెదడు కణాలు బలహీనపడటమే ఈ అల్జీమర్స్‌కు కారణం.  ఇది జ్ఞాపకశక్తి, మానసిక పనితీరు తగ్గడానికి దారితీస్తుంది. ఇక ఈ వ్యాధి కారణంగా లక్షణాలు వ్యక్తికి వ్యక్తికీ మారుతూ ఉంటాయి. ఈ క్రమంలో అసలు అల్జీమర్స్ లక్షణాలేమిటో ఇప్పుడు చూద్దాం..

అల్జీమర్స్ లక్షణాలివే..

తరచుగా ఒక విషయాన్ని పదే పదే చెప్పడం.. ఇంకా చిన్న చిన్న సంభాషణలు, అపాయింట్‌మెంట్, ఈవెంట్లను మరిచిపోవడం అల్జీమర్స్ లక్షణమే. అలాగే పోగొట్టుకున్న వస్తువును కనుగొనలేకపోవడం లేదా ఎక్కడ పోయిందో తెలుసుకోలేకపోవడం కూడా ఈ వ్యాధి లక్షణమే. ఈ క్రమంలో సొంత స్థలం లేదా ఇంటిని మరచిపోవటం వంటివి జరిగితే సమస్య తీవ్ర స్థాయిలో ఉందని అర్థం. అలాగే కుటుంబ సభ్యుల పేర్లు, రోజువారీ విషయాలను మరచిపోవటం కూడా ఈ వ్యాధిగ్రస్తులలో కనిపించే ఒక లక్షణమే. వస్తువులను గుర్తించడానికి, ఆలోచనలను వ్యక్తీకరించడానికి లేదా కమ్యూనికేట్ చేయడానికి పదాలను కనుగొనడంలో ఇబ్బంది పడడం., ఏకాగ్రత పెట్టడం, ఆలోచించడంలో ఇబ్బంది ఉండడం అల్జీమర్స్ లక్షణాలు. ఒకేసారి చాలా పనులు చేయడంలో ఇబ్బంది, సకాలంలో బిల్లు చెల్లించడం లేదా చేసే పనిని ప్లాన్ చేయలేకపోవడం కూడా ఈ వ్యాధి లక్షణాలే. ఇంకా

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..